Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guinness World Record: శాండ్‌విచ్‌ చేస్తే గిన్నిస్‌ రికార్డు.. కొత్త టెక్నిక్‌తో అదరగొట్టిన దంపతులు.. వైరలవుతున్న వీడియో

భర్త తన కళ్లకు గంతలు కట్టుకుని భార్య సాయం తీసుకోకుండా ఈ శాండ్‌విచ్‌ను తయారుచేశారు. అచ్చం కళ్తతో చూస్తున్నట్లుగానే తయారుచేయడమే ఇక్కడ హైలైట్‌. శాండ్‌విచ్‌ను తయారు చేస్తున్న వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా, తన చేతులను వెనుకకు కట్టుకుని ఎదురుగా నిలబడి ఉన్న మహిళ అతనికి ఈ ప్రక్రియలో మార్గనిర్దేశం చేయడం కనిపించింది.

Guinness World Record: శాండ్‌విచ్‌ చేస్తే గిన్నిస్‌ రికార్డు.. కొత్త టెక్నిక్‌తో అదరగొట్టిన దంపతులు.. వైరలవుతున్న వీడియో
Sandwich
Follow us
Jyothi Gadda

|

Updated on: May 24, 2023 | 3:54 PM

వరల్డ్‌ రికార్డులు సృష్టించాలంటే.. పెద్ద పెద్ద ఘనకార్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఇంటి పనులు, వంటపనుల్లోనూ విభిన్నత ప్రదర్శించి కూడా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇదే నిజమేనంటున్నారు జర్మనీకి చెందిన యువదంపతులు.. వీరు కేవలం 40 సెకన్లలోనే శాండ్‌విచ్‌ చేసి, గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఇద్దరూ కలిసి శాండ్‌విచ్‌ను తయారు చేస్తున్న వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటి వరకు 1.5 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. అయితే, ఇక్కడ అసలు ట్విస్ట్‌ ఏంటంటే..

జర్మనీలోని ఆగ్స్‌బర్గ్‌కు చెందిన సారా గాంపెర్లింగ్, ఆండ్రీ ఓర్టోల్ఫ్ 40.17 సెకన్లలో ఈ ఫీట్‌ను పూర్తి చేశారు. నవంబర్ 2, 2022న వారు రికార్డు సృష్టించారు. భర్త తన కళ్లకు గంతలు కట్టుకుని భార్య సాయం తీసుకోకుండా ఈ శాండ్‌విచ్‌ను తయారుచేశారు. అచ్చం కళ్తతో చూస్తున్నట్లుగానే తయారుచేయడమే ఇక్కడ హైలైట్‌. శాండ్‌విచ్‌ను తయారు చేస్తున్న వ్యక్తి కళ్లకు గంతలు కట్టుకుని ఉండగా, తన చేతులను వెనుకకు కట్టుకుని ఎదురుగా నిలబడి ఉన్న మహిళ అతనికి ఈ ప్రక్రియలో మార్గనిర్దేశం చేయడం కనిపించింది.

ఇవి కూడా చదవండి

గతంలో, భారత్‌కు చెందిన దినేష్ ఉపాధ్యాయ, మనీష్ ఉపాధ్యాయ కళ్లకు గంతలు కట్టుకుని నారింజ పండు ఒలిచి తిన్న రికార్డు సృష్టించారు. మార్చి 5, 2014న ముంబైలోని గోరేగావ్‌కు చెందిన ఉపాధ్యాయ ద్వయం 17.15 సెకన్లలో రికార్డును బద్దలు కొట్టింది. మనీష్ ఆరెంజ్ ఒలిచినప్పుడు దినేష్ తిన్నాడు.