AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మూడు రంగులతో మెరిసిన సిడ్నీ హార్బర్.. ప్రధాని మోదీ పర్యటనతో బలపడిన బంధం..

ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు సిడ్నీ హార్బర్, ఒపెరా హౌస్ త్రివర్ణ పతాకాలతో నిడిపోయిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు నిరంతరంగా కలిసి సాగుతున్న చిత్రాలను నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతుండటంపై శత్రుదేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి.

PM Modi: మూడు రంగులతో మెరిసిన సిడ్నీ హార్బర్.. ప్రధాని మోదీ పర్యటనతో బలపడిన బంధం..
Tiranga Colors For Sydney Harbour
Sanjay Kasula
| Edited By: |

Updated on: May 24, 2023 | 3:25 PM

Share

ప్రధాని నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటనకు ముందు సిడ్నీ హార్బర్, ఒపెరా హౌస్ త్రివర్ణ పతాకాలతో నిండిన ఫోటోలు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. భారత- ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు నిరంతరంగా సాగుతున్నాయని చిత్రాలు నిరూపిస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతుండటంపై శత్రుదేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. సిడ్నీ హార్బర్, ఆస్ట్రేలియాలోని ప్రసిద్ధ ఒపెరా హౌస్‌లు ప్రధాని మోదీ,  భారతదేశం గౌరవార్థం త్రివర్ణ కాంతులతో మెరిసిపోయాయి. ఈ సన్నివేశం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్, ప్రధాని మోదీ మధ్య వ్యక్తిగత స్నేహం గురించి కూడా చెబుతుంది. ఈ రోజు, ప్రధాని మోదీ, అల్బనీస్ ద్వైపాక్షిక చర్చలు జరిపినప్పుడు, ఈ సందర్భంగా అనేక ముఖ్యమైన అంశాలు చర్చించబడ్డాయి.

ఆస్ట్రేలియాలో దేవాలయాలపై దాడులు, ఖలిస్తానీల అరాచకాలపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ గా లేవనెత్తారు. ఈ చర్యలను సహించేది లేదని ప్రధాని మోదీ సూచించారు. దీనిపై ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ భారత్ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి ఘటనలపై తీవ్ర స్థాయిలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

దీని తరువాత, ప్రధాని మోదీ బుధవారం ఆస్ట్రేలియా ప్రతిపక్ష నాయకుడు పీటర్ డటన్‌ను కూడా కలిశారు. భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యానికి లభించిన బలమైన ద్వైపాక్షిక మద్దతును మోదీ అభినందిస్తున్నట్లు భారత ప్రధానమంత్రి కార్యాలయం (PMO) విడుదల చేసిన ఒక ప్రకటన పేర్కొంది.

అల్బనీస్ ప్రధాని మోదీకి ఉన్న ప్రజాదరణపై..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఉన్న ప్రజాదరణపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ నమ్మకంగా ఉన్నారు. మంగళవారం ప్రధాని మోదీ కార్యక్రమానికి జనసమూహాన్ని చూసి అల్బానీస్ ఉబ్బితబ్బిబ్బయ్యారు. ప్రధాని మోదీని నిజమైన బాస్ అని అభివర్ణించారు. ఇరువురు నేతలు పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారత్- ఆస్ట్రేలియా భద్రత, సహకారం వంటి అనేక అంశాలలో భాగస్వామిగా ఉండటానికి అంగీకరించాయి.

పీఎంఓ అందించిన సమాచారం ప్రకారం.. ద్వైపాక్షిక భాగస్వామ్యానికి సంబంధించిన వివిధ అంశాలు, ప్రజల మధ్య సంబంధాలు కూడా ప్రతిపక్ష నేతతో చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ప్రాంతీయ పరిణామాలపైనా చర్చించారు. ప్రధానమంత్రి మోదీ మే 22-24 మధ్య ఆస్ట్రేలియా పర్యటనలో రాష్ట్ర అతిథిగా ఉన్నారు. బుధవారం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు మంగళవారం కూడా ఆయన విదేశీ భారతీయుల కార్యక్రమంలో ప్రసంగించారు. తన పర్యటనలో మోడీ ఆస్ట్రేలియాకు చెందిన పలువురు ప్రముఖులను కూడా కలిశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం