Viral Video: నీళ్లలో పడి మునిగిపోతున్న కాకి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..

అడవిలోని క్రూర మృగాలు ఎప్పుడూ ఇతర జంతువులను వెటాడే పని మాత్రమే చేస్తాయని మనం నమ్ముతుంటాం. కానీ, వేటాడే మృగాలు సైతం ఆపదలో ఉన్న మరో జీవి ప్రాణాలను కాపాడాతాయని నిరూపించే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్న ఓ కాకిని

Viral Video: నీళ్లలో పడి మునిగిపోతున్న కాకి.. అక్కడే ఉన్న ఎలుగుబంటి ఏం చేసిందో చూస్తే షాక్ అవుతారు..
Bear Saving Drowning Crow
Follow us
Jyothi Gadda

|

Updated on: May 24, 2023 | 3:22 PM

ప్రేమ, సానుభూతి, ఎదుటి వారికి సాయం చేసే గుణం మనుషులకే కాదు.. జంతువుల్లో కూడా ఎక్కువగానే ఉంటుంది. క్రూర జంతువులు కూడా ఒక్కోసారి జాలి చూపిస్తుంటాయి. అలాంటి వీడియోలు మనం ఎన్నో చూసి ఉంటాం. అలాంటి వీడియోలు చూస్తుంటే మనుషుల కంటే జంతువుల్లోనే ఈ ప్రేమ, జాలిగుణం ఎక్కువగా కనిపిస్తుంది. అడవిలోని క్రూర మృగాలు ఎప్పుడూ ఇతర జంతువులను వెటాడే పని మాత్రమే చేస్తాయని మనం నమ్ముతుంటాం. కానీ, వేటాడే మృగాలు సైతం ఆపదలో ఉన్న మరో జీవి ప్రాణాలను కాపాడాతాయని నిరూపించే సంఘటన ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. నీటిలో పడి ప్రాణాలు కోల్పోతున్న ఓ కాకిని ఎలుగుబంటి కాపాడిన వీడియో ఇది.

హంగేరిలోని బుదాపేస్ట్ జూలో జరిగింది ఈ సంఘటన. ఓ కొలను ఒడ్డు వద్ద కాకి ఒకటి ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. అయితే అదే సమయంలో అక్కడికి ఓ ఎలుగుబంటి వచ్చింది. నీటిలో పడిపోయిన కాకి అరుపులు గమనించిన ఎలుగుబంటి ఆ కాకి వద్దకు వెళ్లింది. నీటిలో మునిగిపోతున్న కాకిని ఎలుగుబంటి చటుక్కున పట్టుకుని ఒడ్డున పడేసి రక్షించింది. తన నోటి సాయంతో కాకి రెక్కలను పట్టుకుని బయటకు తీసింది ఆ ఎలుగుబంటి. ఆ తర్వాత ఎలుగుబంటి తన దారిన తను అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కొద్ది సేపటికి ఆ కాకి కూడా అక్కడి నుంచి ఎగిరిపోయింది.

ఇవి కూడా చదవండి

వేటాడే వన్యప్రాణులు ప్రేమగా ప్రవర్తించే ఇలాంటి సన్నివేశాలు వీక్షకులను భావోద్వేగానికి గురిచేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోని ఇప్పటికే 4.5 మిలియన్లకు పైగా వీక్షించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో చాలా మంది షేర్ చేస్తున్నారు. లైక్ చేస్తున్నారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కాకిని కాపాడిన ఎలుగుబంటికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!