AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్‌ థియేటర్‌లో డాక్టర్‌ డ్యాన్స్‌.. హూషారైన స్టెప్పులతో జనం హృదయాలను కొల్లగెట్టేశాడుగా..

డాక్టర్‌ ముఖంలో చిరునవ్వు సందడి చేస్తోంది. క్లియర్‌ మూవ్‌మెంట్స్‌తో డాక్టర్‌ వీక్షకులను ఆకట్టుకునేలా డ్యాన్స్‌ చేశాడు. ఇదంతా ఎదురుగా ఉన్నవారు వీడియో రికార్డ్‌ చేశారు. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్‌ చేయటంతో అది కాస్త వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆపరేషన్‌ థియేటర్‌లో డాక్టర్‌ డ్యాన్స్‌.. హూషారైన స్టెప్పులతో జనం హృదయాలను కొల్లగెట్టేశాడుగా..
Doctor Dancing
Jyothi Gadda
|

Updated on: May 24, 2023 | 1:09 PM

Share

వైద్యులను కనిపించే దేవుళ్లు అంటారు.. ఎందుకంటే వారు ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం పని చేస్తారు. బతుకుతారని ఊహించలేని వారిని సైతం ఓ అద్భుతం చేసి కాపాడేందుకు వైద్యులు కృషి చేస్తుంటారు. రోగి పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ, ఆపరేషన్‌ థియేటర్‌లో వారు గంటల తరబడి, అవిశ్రాంతంగా చికిత్స చేస్తారు. అనేక అరుదైన సర్జరీలు చేసి ఎంతో మంది రోగుల ప్రాణాలను కాపాడడంలో వైద్యులు విజయం సాధించారు. తరచుగా మనం డాక్టర్‌ని సీరియస్‌గా ఉండటం చూస్తుంటాం.. అతను ఎక్కువగా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండటమే మనం గమనిస్తుంటాం.. ఆపరేషన్లు, పేషెంట్ల టెస్టులు, రిపోర్ట్స్‌, ఇలా ఎన్నో టెన్షన్స్‌.. అందువల్ల డాక్టర్ ముఖంలో చిరునవ్వు చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ, వారు కూడా అంతటి తీవ్రమైన ఒత్తిడిని భరించలేరు. వారు కూడా అవకాశం దొరికినప్పుడల్లా సందడి చేస్తుంటారు.. అలాంటి ఓ స్ట్రెస్‌ బస్టర్‌ డాక్టర్‌ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఓ డాక్టర్ ఆపరేషన్ థియేటర్‌లో హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఈ డాక్టర్ వీడియో ఇప్పుడు చాలా మందిని పిచ్చెక్కించేస్తోంది. ఈ వైరల్ వీడియోలో ఒక వైద్యుడు ఆపరేషన్ థియేటర్‌లో డ్యాన్స్ చేస్తూ కనిపించాడు. బ్యాక్‌ గ్రౌండ్‌లో మంచి సాంగ్‌ ప్లే అవుతోంది. డాక్టర్‌ ముఖంలో చిరునవ్వు సందడి చేస్తోంది. క్లియర్‌ మూవ్‌మెంట్స్‌తో డాక్టర్‌ వీక్షకులను ఆకట్టుకునేలా డ్యాన్స్‌ చేశాడు. ఇదంతా ఎదురుగా ఉన్నవారు వీడియో రికార్డ్‌ చేశారు. సోషల్ మీడియాలో వీడియో అప్‌లోడ్‌ చేయటంతో అది కాస్త వైరల్‌ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు భిన్నమైన కామెంట్స్‌ చేస్తున్నారు.

ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇదొక మంచి మార్గం అని చాలా మంది చెబుతున్నారు. వైద్యుల బాధ్యత చాలా పెద్దది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా రోగి ప్రాణాలను కాపాడాలనే ప్రయత్నంలో తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. అలాంటి స్థితిలో ఉండే వైద్యులు, భరించలేని ఒత్తిడిలో ఉంటున్న మరేవరైనా సరే డ్యాన్స్ చేస్తూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంటే అందులో తప్పేమీ లేదు.. డాక్టర్ చేసిన ఈ డ్యాన్స్ వీడియో చాలా మందికి నచ్చింది. అందరూ ప్రశంసిస్తూ కామెంట్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ డ్యాన్స్ వీడియోను drdipakparmar అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేయగా, దీనిని 3 మిలియన్లకు పైగా వీక్షించారు. వేల సంఖ్యలో నెటిజన్లు వీడియోను లైక్ చేసారు. చాలా మంది వినియోగదారులు వీడియోపై వ్యాఖ్యానిస్తున్నారు. డాక్టర్‌ తన అదిరిపోయే డ్యాన్స్‌తో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నాడు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
చైనా-నేపాల్ సరిహద్దులో ఊహించని ప్రళయం.. భయం గొలిపే వీడియో ..
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
23 రోజుల తర్వాత లభించిన ఆచూకీ.. మత్స్యాకారులు సేఫ్
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
కొడుకుతో కలిసి ఎంఐఎం సభలో సందడి చేసిన అసదుద్దీన్ ఓవైసీ
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో!
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
శ్రీ రామునికి ఎంతో ప్రియమైన ఈ పండు పోషకాల నిధి! కనిపిస్తే వదలకండి
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
లైటర్ పనిచేయడం లేదా? ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి!
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
న్యూయార్క్‌ వేదికగా యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
బావగారు బాగున్నారా టైటిల్ పెట్టింది నేనే.. చిరంజీవి ఏమన్నారంటే..
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
కంటిచూపుతో కాదు.. సూటి ప్రశ్నతో చంపేస్తారు! జస్ట్ ఆస్కింగ్ అంటూ వ
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!
సెమీఫైనల్స్‌లో తలపడే 4 జట్లు ఇవే.. దేశవాళీలో ఇక రచ్చరచ్చే..!