Watch: స్వచ్ఛమైన ప్రేమకు అచ్చమైన నిదర్శనం ఇదే..! సినిమా థియేటర్‌లో వృద్ధ జంట అనురాగం చూడాల్సిందే..
స్నేహితులతో సినిమాకు వెళ్లగా అక్కడ ఎంతో ముచ్చటైన విషయం కంటపడింది..ప్రతిఒక్కరి ప్రేమ ఇలాగే ఉండాలని కోరుతూ ఇన్‌స్టా యూజర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ పది లక్షల మందికి పైగా చూశారు. వైరల్ వీడియో పట్ల నెటిజన్లు

నేటి బిజీ జీవన ప్రపంచంలో మనుషుల మధ్య స్వచ్ఛమైన ప్రేమ కరువైంది. డేటింగ్ యాప్స్ ద్వారా యువత సులభంగా భాగస్వాములను ఎంపిక చేసుకోవడంతో గతంలో మాదిరి లెటర్లు, ల్యాండ్‌లైన్ నుంచి గంటల తరబడి ఫోన్ కాల్స్ మాట్లాడుకోవటం వంటివి తెరమరుగయ్యాయి. ఈ పరిస్ధితుల్లో వృద్ధ దంపతుల మధ్య ఒకరి పట్ల మరొకరికి ఉన్న ప్రేమను చాటే వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ కనిపిస్తూ నిజమైన ప్రేమకు అసలైన అర్థాన్ని గుర్తు చేస్తున్నాయి. అలాంటి ఇక్కడ ఒక వృద్ధ జంటకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
కంటెంట్ క్రియేటర్ అన్వేష ఘోష్ కోల్‌కతాలోని మూవీ థియేటర్‌లో వృద్ధ దంపతుల ఆత్మీయతకు అద్దం పట్టే వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన ఈ వీడియోలో థియేటర్‌లో ఓ పెద్దాయన తన భార్య చేయి పట్టుకుని మెట్లు దిగిపించడం ఆకట్టుకుంటుంది. ఖాళీగా ఉన్న థియేటర్‌లో భార్య చేయి పట్టుకుని ఆమె మెట్లు దిగేందుకు భర్త సాయం చేస్తున్న అద్భుతమైన దృశ్యం ఈ వీడియోలో కనిపించిది.
స్నేహితులతో సినిమాకు వెళ్లగా అక్కడ ఎంతో ముచ్చటైన విషయం కంటపడింది..ప్రతిఒక్కరి ప్రేమ ఇలాగే ఉండాలని కోరుతూ ఇన్‌స్టా యూజర్ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటివరకూ పది లక్షల మందికి పైగా చూశారు. వైరల్ వీడియో పట్ల నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. ప్రతి ఒక్కరూ వీడియోపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.




మరిన్ని ట్రెండింగ్ న్యూస్ ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..