Healthy Hair : పట్టులాంటి కేశాల కోసం అలోవెరా ప్యాక్‌ ట్రై చేయండి.. మిలమిల మెరిసే జుట్టు మీ సొంతం..!

పట్టులాంటి, మృదువైన మెరిసే జుట్టుకోసం ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అందుకోసం జుట్టుతో పాటు స్కాల్ప్‌కు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో భాగంగా అలోవెరా అనేక జుట్టు సమస్యలతో సమర్థవంతంగా పోరాడుతుంది. కలబంద మీ చెంత ఉంటే అందమైన కురులు మీ సొంతం అది ఎలానో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda

|

Updated on: May 23, 2023 | 7:05 PM

అలోవెరా జుట్టు రాలడాన్ని నివారించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహింస్తుంది. ఆలోవెరాలోని ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ మాడుపై పాడైన కణాలను బాగుచేస్తాయి. స్కాల్ప్‌ సంరక్షణకు సులభమైన మార్గం ఆయిల్‌ మసాజ్‌.

1 / 5
వేడి ఆయిల్‌ మసాజ్‌తో పాటు కలబందతో మీ స్కాల్ప్‌ను జాగ్రత్తగా చూసుకోవచ్చు. కలబంద చుండ్రుకు చికిత్స చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు మెత్తగా,ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. మీ శిరోజాలను మెరిపిస్తుంది.

2 / 5
కలబంద జుట్టును తేమగా ఉంచుతుంది. హానికరమైన సూర్య కిరణాల నుండి రక్షిస్తుంది. అలోవెరా వాపు వ్యతిరేక లక్షణాలు తల మాడుకి మంట, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

3 / 5
కొబ్బరినూనె, ఆలోవెరాను సమపాల్లుగా కలుపుకుని అలోవెరా ప్యాక్ ను తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని మీ తలపై అప్లై చేసుకుని నెమ్మదిగా మసాజ్ చేస్తూ చివర్ల వరకూ రాయండి. తల అంతా పట్టించాక, షవర్ క్యాప్ పెట్టుకొని ఒక గంట అలా వదిలేశాక కడిగేయండి.

4 / 5
అలోవెరా ప్యాక్‌తో మీ జుట్టు బలంగా,మృదువైన,ఒత్తుగా మారుతుంది. వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ ను వేసుకుంటూ ఉంటే అందమైన పట్టులాంటి జుట్టు మీ సొంతం అవుతుంది.

5 / 5
Follow us