AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ‌ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం వరాల జల్లు.. గృహలక్ష్మి పథకానికి మూహూర్తం ఖరారు..

ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను సిఎం కేసిఆర్ ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సిఎం తెలిపారు.

తెలంగాణ‌ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సీఎం వరాల జల్లు.. గృహలక్ష్మి పథకానికి మూహూర్తం ఖరారు..
CM KCR
Narender Vaitla
| Edited By: Jyothi Gadda|

Updated on: May 23, 2023 | 8:33 PM

Share

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రోజువారీ కార్యక్రమాల షెడ్యూల్ ఖరారు, పోడు భూముల పట్టాల పంపిణీ, తదితర అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పలు నిర్ణయాలు తీసుకున్నారు.

గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ :

జూన్ 24 నుంచి 30 వరకు గిరిజన సోదరులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. నూతనంగా పోడు పట్టాలు పొందిన గిరిజనుల వివరాలు సేకరించి రైతుబంధు వర్తింపచేయాలని అధికారులను సిఎం ఆదేశించారు. కాగా ఇప్పటికే ఆర్ఓఎఫ్ఆర్ ద్వారా రైతుబంధు పొందుతున్న వారితో పాటు నూతనంగా పోడు పట్టాలు అందుకోబోతున్న గిరిజన లబ్దిదారులతో ను క్రోడికరించి ….రాష్ట్రంలో మిగతా రైతులకు ఏవిధంగానైతే రైతుబందు అందుతున్నదో వీరికీ అదే పధ్దతిలో రైతు బంధు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వమే బ్యాంకు అకౌంట్ ను తెరిచి పోడు భూముల పట్టాల యాజమానులకు నేరుగా వారి ఖాతాల్లో రైతుబంధును జమచేస్తుందన్నారు. ఇందుకు సంబంధించి…నూతనంగా పోడు పట్టాలు అందుకున్న గిరిజన రైతుల బ్యాంకు ఖాతాల వివరాలను ఆర్థిక శాఖ వారికి అందజేయాలని, ఈ దిశగా చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ను సిఎం కేసిఆర్ ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే స్వయంగా హాజరవుతానని సిఎం తెలిపారు.

జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్ :

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కార్యాచరణకు సంబంధించి ఈ నెల 25న జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశంలో మంత్రులు, జిల్లా ఎస్పీలు పాల్గొంటారు.

ఇవి కూడా చదవండి

ఇండ్ల స్థలాల పంపిణీ :

ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఇంకా మిగిలి వున్న నివాసయోగ్యమైన ప్రభుత్వ భూములను అర్హులైన నిరుపేదలను గుర్తించి వారి ఇండ్ల నిర్మాణాల కోసం దశాబ్ది ఉత్సవాల నేపథ్యం లో అర్హులకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీ చేపట్టాలని సిఎం కేసిఆర్ నిర్ణయించారు.

జూలైలో గృహలక్ష్మి పథకం ప్రారంభం :

గృహలక్ష్మి పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరితగతిన తయారు చేయాలని,. జూలై నెలలో గృహలక్ష్మి పథకం ప్రారంభించాల ని సిఎం ఆదేశించారు. జూలైలోనే దళితబంధు కొనసాగింపు కోసం ఏర్పాట్లు చేయాలని సి ఎస్ ను సిఎం ఆదేశించారు.

నిమ్స్ దవఖాన నూతన భవనానికి శంఖుస్థాపన :

జూన్ 14, వైద్య ఆరోగ్య దినోత్సవం’ నాడు నిమ్స్ దవఖానా విస్తరణ పనులకు సిఎం శ్రీకారం చుట్టనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటి హాస్పిటల్ భవన నిర్మాణానికి సిఎం కేసిఆర్ శంఖుస్థాపన చేయనున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..