AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: వేటాడడమే కాదు.. కెమెరా కనిపిస్తే ఫోజులివ్వడమూ తెలుసు..! చిరుత వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అవ్వాల్సిందే..

జంతువు ఎప్పుడు ఏం చేస్తుందో మనం ఊహించలేము. కానీ కొన్నిసార్లు అడవి జంతువుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటిదే చిరుతపులి అసాధారణ ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిరుతపులి చేసే పనులు చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు.

Watch: వేటాడడమే కాదు.. కెమెరా కనిపిస్తే ఫోజులివ్వడమూ తెలుసు..! చిరుత వెరైటీ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అవ్వాల్సిందే..
Leopard Poses For Photoshoo
Jyothi Gadda
|

Updated on: May 23, 2023 | 6:26 PM

Share

వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతుంటాయి. అలాంటి వీడియోలు కొన్నిసార్లు మనకు గూస్‌బంమ్స్‌ తెప్పించేవిగా ఉంటాయి. కొన్నిసార్లు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. ఈ వీడియోలలో చిరుతపులులు వేటాడడం, చెట్లను ఎక్కడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలాసార్లు చూసి ఉంటారు. అలాగే కొన్నిసార్లు పిల్లులు, కుక్కలు వెనుక కాళ్లపై నిలబడటం, రెండు కాళ్లతో నడవటం వంటి వీడియోలు కూడా అనేకం చూస్తుంటాం.. అయితే, చిరుతపులులు రెండు కాళ్లపై నిలబడి ఉండటం ఎప్పుడైనా చూశారా? ఈ వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

సాధారణంగా వన్యప్రాణుల స్వభావం చాలా వింతగా ఉంటుంది. ఒక్కోసారి హఠాత్తుగా మనపై దాడికి వస్తుంటాయి.. ఒక్కోసారి వాటినే చూస్తూ ఆలోచనలో పడేలా చేస్తుంటాయి. వాటి ప్రవర్తనను అంచనా వేయడం చాలా కష్టం. ఆ జంతువు ఎప్పుడు ఏం చేస్తుందో మనం ఊహించలేము. కానీ కొన్నిసార్లు అడవి జంతువుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. అలాంటిదే చిరుతపులి అసాధారణ ప్రవర్తన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో చిరుతపులి చేసే పనులు చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు.

ఇవి కూడా చదవండి

వీడియోలో ఒక చిరుతపులి రోడ్డు వెంట నడుస్తూ కనిపించింది. ఇక్కడికి వచ్చిన సందర్శకుల్లో ఒకరు తీసిన వీడియో ఇది. సందర్శకులు చిరుతపులి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా తమ కెమెరాల్లో బంధించడానికి ట్రై చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ఊహించని ఘటన చోటుచేసుకుంది. సందర్శకులు కెమెరాలతో చిరుతను షూట్‌ చేస్తున్నారు..ఆ చిరుతపులి వేగంగా నడుచుకుంటూ వచ్చింది. ఆ తర్వాత ఓ చోట ఆగి నెమ్మదిగా క్రిందికి వంగి, దాని ముందు కాళ్ళపై తిరిగి నిలబడటం కనిపిస్తుంది. అప్పుడు ముందు రెండు కాళ్లను పైకి లేపి, వెనుక కాళ్లపై నిలబడింది. అంటే లేచి నిలబడటం కనిపిస్తుంది. వీడియో చూస్తుంటే పులి ఫోటోగ్రాఫర్లకు పోజులిచ్చినట్లుగా అనిపిస్తుంది. పులి చాలా సేపు అదే ఫోజులో నిలబడి ఉంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (IFS) అధికారి సాకేత్ బడోలా ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియో వ్యవధి 27 సెకన్లు మాత్రమే. క్యాప్షన్ లో సెలబ్రిటీలు కెమెరాకు ఎలా పోజులు ఇస్తారో చిరుతపులి కూడా అలాగే నిలబడిపోయిందంటూ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే, ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను కూడా ఎంతగానో ఆకర్షించింది. ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేశారు. 60.8 వేల మంది వీడియోను వీక్షించారు. పిల్లులు, కుక్కలు ఇలా రెండు కాళ్లపై నిలబడి కనిపించాయి. అయితే చిరుతపులి ఇలా నిలబడటం తనకు ఇదే తొలిసారి అని ఓ యూజర్ రాశారు. పులికి సెలబ్రిటీలా ఉండే యాటిట్యూడ్, పోజు ఉందని మరొకరు వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..