Watch: నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టం చూడలేక భగీరథ ప్రయత్నం చేసిన బాలుడు.. అదేంటో వీడియోలో చూడండి..

బాలుడు చేసిన ఈ గొప్ప పని తెలుసుకున్న స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు బాలుడి ఇంటికి వెళ్లి మరీ ప్రశంసించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణవ్‌కు కావాల్సిన స్కూల్ మెటీరియల్స్, పుస్తకాలు, యూనిఫాంలు, బట్టలు అన్నీ ఇచ్చి సత్కరించారు. అంతేకాదు..

Watch: నీళ్ల కోసం తల్లి పడుతున్న కష్టం చూడలేక భగీరథ ప్రయత్నం చేసిన బాలుడు.. అదేంటో వీడియోలో చూడండి..
Palghar Boy
Follow us
Jyothi Gadda

|

Updated on: May 23, 2023 | 5:05 PM

తల్లి పడుతున్న కష్టాలు చూసి తల్లడిల్లిపోయిన ఓ బాలుడు ఎవరూ చేయని గొప్ప సాహసం చేశాడు. ఇంటికి నీళ్లు తెచ్చేందుకు తన తల్లి ప్రతిరోజూ ఎండలో నడుచుకుంటూ వెళ్లడం చూసి బాధపడ్డ 14 ఏళ్ల బాలుడు ఏకంగా ఇంటివద్దే ఓ బావిని తవ్వేశాడు. తల్లి కోసం నీటిబావిని తవ్వించిన విద్యార్థి ప్రణవ్ రమేష్ సల్కర్ పై జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బాలుడు చేసిన ఈ గొప్ప పని తెలుసుకున్న స్థానిక పోలీస్ ఉన్నతాధికారులు బాలుడి ఇంటికి వెళ్లి మరీ ప్రశంసించారు. తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రణవ్‌కు కావాల్సిన స్కూల్ మెటీరియల్స్, పుస్తకాలు, యూనిఫాంలు, బట్టలు అన్నీ ఇచ్చి సత్కరించారు. ఇదొక్కటే కాదు, 9,10వ తరగతి చదువుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భరిస్తానని స్థానిక పోలీస్‌ స్టేషన్ లోని పోలీస్ ఇన్‌స్పెక్టర్ భీమ్‌సేన్ గైక్వాడ్ సల్కర్ కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ అపురూప సంఘటన మహారాష్ట్రలోని పాల్గర్ లో చోటు చేసుకుంది.

Palghar Boy Pranav Salkar

Palghar Boy Pranav Salkar

ఇప్పటికీ మన దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి కోసం చాలా మంది బోరు బావులకు వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతూనే ఉంది.. మారుమూల ప్రాంతాల్లో ఇది సర్వ సాధారణం. వేసవిలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. ఎర్రటి ఎండల్లో నీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహారాష్ట్రలోని పాల్ఘర్‌ జిల్లా కెల్వే ధావంగేపాడకు చెందిన ఓ బాలుడు నీటి కోసం తల్లి పడుతున్న కష్టాన్ని చూడలేక ఇంటి ఆవరణలో బావిని తవ్వాడు. పాల్ఘర్‌లోని కెల్వేలోని తురంగపడాలో సల్కర్ దంపతులు నివసిస్తున్నారు. దర్శన, రమేష్ ఇద్దరూ భార్యాభర్తలు. వాడిలో కూలిపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత, దర్శన తన కుటుంబానికి నీరు తీసుకురావాల్సి వచ్చింది. కానీ కొడుకు ప్రణవ్ మాత్రం నీళ్ల కోసం తల్లిపడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. చివరకు 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల ప్రణయ్ తన ఇంటి ఆవరణలో బావి తవ్వాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రణవ్ ఇంటి ఆవరణలో బావి తవ్వడం మొదలుపెట్టాడు.

ఇవి కూడా చదవండి

వ్యవసాయానికి ఉపయోగించే పనిముట్లను ఉపయోగించి నాలుగు రోజుల్లో 18 అడుగులకు పైగా బావిని తవ్వాడు. ప్రణవ్‌ కష్టాన్ని చూడలేక తండ్రి వినయ్‌ సల్కర్‌ కూడా అతడికి సాయం అందించాడు. దీంతో బావి నిర్మాణం అనతి కాలంలోనే పూర్తయింది.  ఎట్టకేలకు 18 అడుగుల తర్వాత బావిలో తాగునీరు రావడంతో ప్రణవ్ భగీరథ ప్రయత్నాలు ఫలించాయి. దీంతో ఆ తల్లి కష్టాలు తీరాయి. సకాలంలో బాలుడి తల్లిదండ్రులు పనులకు వెళ్లగలుగుతున్నారు. బాలుడి సాహసం చూసి గ్రామపంచాయతీ వారితో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురుస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..