Mukesh Ambani: అపర కుబేరుడి గ్యారేజీలో చేరిన మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?

భారతదేశ అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. వారి కుటుంబానికి రోల్స్ రాయిస్‌తో సహా అనేక లగ్జరీ కార్లు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వారి గ్యారేజీలో రెండోతరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కూడా చేరిపోయింది. పెట్రా గోల్డ్ ఫినిష్‌తో కూడిన లగ్జరీ కారు ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం కనిపించింది.

Mukesh Ambani: అపర కుబేరుడి గ్యారేజీలో చేరిన మరో కొత్త కారు.. ధర ఎంతో తెలుసా?
Mukesh Ambani New Car
Follow us

|

Updated on: May 23, 2023 | 5:53 PM

సాధారణంగా కారు కొనడం అనేది చాలామందికి ఒక కల. అయితే ఈ కలను కొంతమంది సాకారం చేసుకుంటారు. మరి కొందరికి ఆ కల కలగానే మిగిలిపోతుంది. అది చిన్న కారు కావొచ్చు లేదా లగ్జరీ కారు కావచ్చు. ఏదైతేనేం కల సాకారం కావడానికి. మనదేశంలో కారు కొనడానికి కొందరు సాహసం చేస్తుంటే, దేశంలోని కొందరు సంపన్నులు అత్యంత ఖరీదైన కార్లను ఇట్టే కొనిపడేస్తుంటారు. ఈ క్రమంలోనే కార్లు కూడా అత్యంత ఖరీదైనవిగా మారుతున్నాయి. అలాంటి జాబితాలోనిదే రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి. ఈ కారు ఇప్పుడు ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ పార్కింగ్‌లో వాలింది.

భారతదేశ అత్యంత సంపన్నుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. వారి కుటుంబానికి రోల్స్ రాయిస్‌తో సహా అనేక లగ్జరీ కార్లు ఇప్పటికే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా వారి గ్యారేజీలో రెండోతరం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కూడా చేరిపోయింది. పెట్రా గోల్డ్ ఫినిష్‌తో కూడిన లగ్జరీ కారు ముంబై వీధుల్లో చక్కర్లు కొట్టడం కనిపించింది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ధర రూ.6.95 కోట్లతో ప్రారంభమవుతుంది. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.7.95 కోట్లు. కొత్త పెట్రా గోల్డ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ ట్రాఫిక్ సిగ్నల్‌ను దాటుతుండటం కనిపించింది. రాత్రిపూట ఆ కారు ఓ భవనం నుంచి బయటకు వెళ్లడం కూడా కనిపించింది. నివేదికల ప్రకారం, ఈ కొత్త తరం సూపర్ లగ్జరీ కారు 2020 సంవత్సరంలో ప్రారంభించబడింది. దాని EWB వేరియంట్ ఇప్పుడు అంబానీ గ్యారేజీని అలంకరించింది.

Mukesh Ambani New Car Rolls

Mukesh Ambani New Car Rolls

ఈ కొత్త సూపర్ లగ్జరీ కారులోని ఇంజన్ కూడా చాలా శక్తివంతమైనది. ఈ మోడల్‌లో 563hp పవర్, 820Nm టార్క్ ఉత్పత్తి చేసే 6.75-లీటర్ V12 ఇంజన్‌తో తయారు చేయబడింది. ఇందులో 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉంటుంది. ఇది కేవలం 4.6 సెకన్లలో 0 నుండి 100 కిమీ వేగాన్ని అందుకోగలదు. భద్రతా లక్షణాలలో హెడ్-అప్ డిస్‌ప్లే, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ డిపార్చర్ వార్నింగ్, 360-డిగ్రీ కెమెరా సిస్టమ్ ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..