TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కీలక మలుపు.. మరో మహిళ ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. లీక్ అంశంలో శంకర్‌లక్ష్మీ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 2017 నుంచి టీఎస్‌పీఎస్సీలో శంకర్‌లక్ష్మీ విధులు నిర్వర్తిస్తున్నారు. డీఏఓ, ఏఈఈ, ఏఈ పేపర్ల అంశంలో.. టీఎస్‌పీఎస్సీ వివరాలు దాచిపెట్టినట్టు గుర్తించారు. పేపర్లు వాల్యుయేషన్...

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో కీలక మలుపు.. మరో మహిళ ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు
Tspsc Paper Leak
Follow us
Narender Vaitla

|

Updated on: May 23, 2023 | 7:10 PM

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు కీలక మలుపు తిరిగింది. లీక్ అంశంలో శంకర్‌లక్ష్మీ ప్రమేయం ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 2017 నుంచి టీఎస్‌పీఎస్సీలో శంకర్‌లక్ష్మీ విధులు నిర్వర్తిస్తున్నారు. డీఏఓ, ఏఈఈ, ఏఈ పేపర్ల అంశంలో.. టీఎస్‌పీఎస్సీ వివరాలు దాచిపెట్టినట్టు గుర్తించారు. పేపర్లు వాల్యుయేషన్ చేయలేదంటూ సిట్‌కు టీఎస్‌పీఎస్సీ తప్పుడు వివరాలు ఇచ్చినట్టు తేలింది. ఇప్పటి వరకు సిట్‌కు ఓ స్టేట్‌మెంట్‌, ఈడీకి మరో స్టేట్‌మెంట్‌ ఇచ్చినట్టు గుర్తించారు అధికారులు. ఈ కేసులో శంకర్‌లక్ష్మీ కాల్‌డేటా వివరాలను సిట్ సేకరించింది. మరోవైపు రేణుకను మరోసారి విచారించబోతోంది సిట్.

ఇదిలా ఉంటే.. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 35 మందిని అరెస్టు చేసింది సిట్. DAO పరీక్షలో ర్యాంకులు.. అత్యధిక మార్కులు సాధించిన వారిపై దృష్టి ప్రత్యేక దృష్టి సారించింది. డీఏఓ పరీక్షలో లీక్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రాజేశ్వర్‌కు ఫస్ట్‌ ర్యాంకు, రాజేశ్వర్‌ భార్య శాంతికి రెండో ర్యాంకు.. మరో నిందితురాలు రేణుక స్నేహితుడు రాహుల్ కుమార్‌కు మూడో ర్యాంక్ వచ్చింది. ఆ దిశగా ఎంక్వైరీ చేసిన అధికారులు కీలక విషయాలు రాబట్టారు.

ఓ వైపు సిట్‌ దర్యాప్తు కొనసాగుతూ ఉండగానే.. తీగ లాగితే డొంక కదిలినట్టు…భారీ మొత్తంలో మనీలాండరింగ్‌ జరిగినట్టు అధికారులు గుర్తించారు. ఇదే నేపథ్యంలో ఇటీవల టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌నీ, సెక్రటరీనీ ప్రశ్నించింది ఈడీ. జనార్ధన్‌రెడ్డి, అనితా రామచంద్రన్‌ స్టేట్‌మెంట్స్‌ని ఇటీవల రికార్డ్‌ చేసింది. మొత్తం 31 లక్షల లావాదేవీలు జరిగినట్టు గుర్తించింది సిట్‌. ఇదే నేపథ్యంలో కేసులో కీలక నిందితుడు ప్రవీణ్‌ దగ్గరనుంచి ఇంకా ఎవరెవరు ప్రశ్నాపత్రాలు కొన్నారనే దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..