Big News Big Debate LIVE: సర్కార్ వారి ధీమా.. 2019ని మించిన విక్టరీ కొడతామంటోన్న వైసీపీ..
2019 ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల చరిత్రలోనే బెంచ్‌మార్క్‌గా నిలిచిపోయే విజయం అందుకుంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. దేశమంతా అబ్బురపరిచేలా వైసీపీకి విజయాన్ని అందించారు ఏపీ ప్రజలు. విజయం అందుకోవడమే కాదు.. దీనికి కాపాడుకోవడంలోనూ సరికొత్త చరిత్ర సృష్టించామంటున్నారు అధికారపార్టీ నేతలు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ దేశానికే రోల్ మోడల్‌గా నిలచామని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగిందని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కే వైసీపీ పరిమితమవుతుందని విపక్షాలు అంటే.. 2019ని మించిన రీసౌండ్ విక్టరీ కొడతామంటోంది అధికారపార్టీ.