MP Avinash Reddy: వైఎస్ వివేకా మర్డర్ కేసు ఊహించని మలుపులు.. అవినాష్ రెడ్డి ఎపిసోడ్‌లో పొద్దున్నుంచి హైడ్రామా..
వైఎస్ వివేకా మర్డర్ కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. అవినాష్ రెడ్డి ఎపిసోడ్‌లో ఇవాళ హైడ్రామా కొనసాగింది. ఓవైపు ఆస్పత్రి దగ్గర హైటెన్షన్ కొనసాగితే.. మరోవైపు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈనెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్‌కు వెళ్లాలని అవినాష్ రెడ్డికి కోర్టు సూచించింది. గురువారం అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. ఈక్రమంలోనే.. సీబీఐ అధికారుల నెక్ట్స్ స్టెప్ ఏంటి? అవినాష్ ముందున్న ఆప్షన్లేంటి? ఓవైపు ఆస్పత్రి దగ్గర హైటెన్షన్ కొనసాగుతుంటే.. మరోవైపు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది.
ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విఙ్ఞప్తిని సుప్రీంకోర్ట్ తిరస్కరించింది. విచారణ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఈనెల 25న హైకోర్టు వెకేషన్ బెంచ్ కు వెళ్లాలని అవినాష్ రెడ్డికి కోర్టు సూచించింది. ఎల్లుండి అవినాష్ ముందస్తు బెయిల్ పిటీషన్ పై హైకోర్టు విచారణ జరిపి తీర్పు ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ వాదనలు వినేంత వరకు అరెస్ట్ చేయకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలనే విన్నపాన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. మరోవైపు విచారణ సందర్భంగా…సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు న్యాయవాదుల్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. సీబీఐ అధికారుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
ఈనెల 16, 19, 21న హాజరుకావాలంటూ అవినాష్‌కు నోటీసులిచ్చింది సీబీఐ. అయితే వేర్వేరు కారణాలతో విచారణకు హాజరుకాలేనని సీబీఐకి సమాచారమిచ్చారు. ప్రస్తుతం కర్నూలులోని విశ్వభారతి హాస్పిటల్‌లో ఉన్నారు అవినాష్. తల్లి అనారోగ్యంతో నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నారు. మరోవైపు అవినాష్‌కు సంఘీభావంతో ఆయన అనుచరులు హాస్పిటల్‌కి క్యూ కడుతున్నారు. అయితే వారిని హాస్పిటల్‌లోకి వెళ్లనీయకుండా తిప్పి పంపుతున్నారు.
మరోవైపు విచారణ సందర్భంగా.. సీబీఐ నోటీసులకు ఎందుకు స్పందించడం లేదని, విచారణకు ఎందుకు హాజరు కావడం లేదని అవినాశ్ తరపు న్యాయవాదుల్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అవినాశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ విషయంలో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు తిరస్కరించడంతో.. సీబీఐ అధికారుల తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం