Video: ఇదేం ఊచకోత బ్రో.. దెబ్బకు టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డ్ నమోదు.. ఒక్క ఇన్నింగ్స్‌లోనే 324 పరుగుల వరద..

Ravi Bopara: ఈ తుఫాన్ బ్యాటింగ్ ఫలితంగా రవి బొపారా కేవలం 49 బంతుల్లో 144 పరుగులు చేశాడు. మరోవైపు టామ్ అల్సోప్ 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు.

Video: ఇదేం ఊచకోత బ్రో.. దెబ్బకు టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డ్ నమోదు.. ఒక్క ఇన్నింగ్స్‌లోనే 324 పరుగుల వరద..
Ravi Bopara viral Video
Follow us
Venkata Chari

|

Updated on: May 24, 2023 | 5:15 PM

ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 ఛాంపియన్‌షిప్ లీగ్‌లో ససెక్స్ జట్టు 324 పరుగులు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. మిడిల్‌సెక్స్‌ 2వ ఎలెవన్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ససెక్స్‌ 2వ ఎలెవన్‌ తుఫాన్ బ్యాటింగ్‌ చేసింది. ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగిన కెప్టెన్ రవి బొపారా.. ఏకంగా 12 భారీ సిక్సర్లు, 14 ఫోర్లు బాదేశాడు.

ఈ తుఫాన్ బ్యాటింగ్ ఫలితంగా బొపారా కేవలం 49 బంతుల్లో 144 పరుగులు చేశాడు. మరోవైపు టామ్ అల్సోప్ 27 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఫలితంగా 20 ఓవర్లు ముగిసే సరికి ససెక్స్ జట్టు 7 వికెట్లు కోల్పోయి 324 పరుగులు చేసింది.

ఇవి కూడా చదవండి

325 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిల్‌సెక్స్‌ కేవలం 130 పరుగులకే ఆలౌటైంది. దీంతో ససెక్స్ జట్టు 192 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

దీంతో పాటు ఇంగ్లీష్ కౌంటీ టీ20 క్రికెట్‌లో 300+ పరుగులు చేసిన తొలి జట్టుగా ససెక్స్ సెకండ్ ఎలెవన్ నిలిచింది. అలాగే టీ20 క్రికెట్‌లో 300 పరుగులు రావడం కూడా కొత్త ప్రపంచ రికార్డుగా నమోదైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..