అద్దిరిపోయే వంటింటి చిట్కా.. వంట గ్యాస్‌ త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..

ఆహారాన్ని వండడానికి లేదంటే నీటిని వేడి చేయడానికి ఎక్కువ గ్యాస్ అవసరం. అలాంటప్పుడు మీ గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే కొన్ని సాధారణ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటిస్తే మీరు మీ గ్యాస్‌ సిలిండర్‌ని మరిన్ని ఎక్కువ రోజులు ఉపయోగించుకోగలుగుతారు.

అద్దిరిపోయే వంటింటి చిట్కా.. వంట గ్యాస్‌ త్వరగా అయిపోకుండా ఉండాలంటే ఇలా చేయండి..
Lpg Cylinder
Follow us

|

Updated on: May 24, 2023 | 7:37 PM

ఎల్‌పీజీ గ్యాస్‌ ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. ఇంట్లో చేసే వంట దగ్గర నుంచి హోటళ్లలో వండే భోజనాల వరకు వంటగ్యాస్ తప్పనిసరి. కానీ ఇటీవల గ్యాస్ ధర పెరగడంతో గ్యాస్ ను చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. ఆహారాన్ని వండడానికి లేదంటే నీటిని వేడి చేయడానికి ఎక్కువ గ్యాస్ అవసరం. అలాంటప్పుడు మీ గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు పనిచేయాలంటే కొన్ని సాధారణ చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటిస్తే మీరు మీ గ్యాస్‌ సిలిండర్‌ని మరిన్ని ఎక్కువ రోజులు ఉపయోగించుకోగలుగుతారు.

ముందుగా, గ్యాస్ అయిపోతుందని ఎలా తెలుసుకోవాలంటే..

ముందుగా ఒక పెద్ద కాటన్ క్లాత్ తీసుకుని నీళ్లలో ముంచాలి. సిలిండర్ చుట్టూ బాగా రోల్ చేసి, 10 నిమిషాల తర్వాత తనిఖీ చేయాలి. ఆ క్లాత్‌ ఎక్కడి వరకు ఆరిపోయిందో చెక్‌ చేసుకోవాలి. ఆ మార్క్‌ సిలిండర్‌లో మిగిలి ఉన్న గ్యాస్ మొత్తాన్ని సూచిస్తుంది. అలాగే స్టౌవ్‌ మండుతున్నప్పుడు గ్యాస్ ఎక్కువ ఎరుపు రంగులో కనిపిస్తే కూడా గ్యాస్‌ అయిపోతుందని అర్థం.

ఒకేసారి ఎక్కువ మొత్తంలో వండటం ఉత్తమం..

మీరు పెద్ద పరిమాణంలో వంట చేసినప్పుడు..తక్కువ వంటే కంటే గ్యాస్‌ను మరింత సమర్థవంతంగా ఉపయోగిస్తారు. అలాగే మీరు మిగిలిన ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో పెట్టుకోవచ్చు. కావాలంటే మళ్లీ కాస్త వేడి చేసి అవసరమైనప్పుడు తినేయొచ్చు.

ఇవి కూడా చదవండి

కుక్కర్ ఉపయోగించడం మంచిది.

ప్రెషర్ కుక్కర్ ద్వారా వంట చేయటం వల్ల త్వరగా మీ వంటపని పూర్తవుతుంది. అంతేకాదు.. ప్రెషర్‌ కుక్కర్‌ ద్వారా వంట చేస్తే.. తక్కువ గ్యాస్‌తో పని పూర్తవుతుంది. ఎందుకంటే ఇది అధిక పీడనంతో ఆహారాన్ని ఉడికించడానికి ఆవిరిని ఉపయోగిస్తుంది. అంటే తక్కువ సమయంలో వంట తయారు చేయడం ద్వారా గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు.

సరైన సైజు బర్నర్‌ని ఉపయోగించండి

మీరు ఉపయోగిస్తున్న పాన్ లేదా పాట్ పరిమాణానికి సరిపోయే బర్నర్‌ని ఉపయోగించాలి.. ఒక పెద్ద బర్నర్ ఒక చిన్న గిన్నే, పాన్‌ను వేడి చేయడానికి ఎక్కువ గ్యాస్‌ను ఉపయోగిస్తుంది. కాబట్టి సరైన పరిమాణాన్ని ఎంచుకోండి.

బర్నర్ శుభ్రంగా ఉంచండి

శుభ్రమైన బర్నర్ వేగంగా, మరింత సమర్థవంతంగా వేడెక్కుతుంది. అంటే మీరు తక్కువ గ్యాస్ ఖర్చు చేస్తారు. మంచి స్థితిలో ఉంచడానికి బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని నిర్ధారించుకోండి.

త్వరగా బర్నర్ ఆఫ్ చేయండి

వంట చేసేటప్పుడు మీ ఆహారం పూర్తిగా వండడానికి కొన్ని నిమిషాల ముందు స్టౌవ్‌ ఆపేయాలి. అవశేష వేడి వంట ప్రక్రియను పూర్తి చేస్తుంది. అంటే బర్నర్‌ వేడితో ఆహారం ఊర్తిగా ఉడికిపోతుంది. దీంతో గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు.

వంట చేసేటప్పుడు తప్పనిసరిగా మూతలుపెట్టాలి.

మీరు వంటచేసేటప్పుడు కడాయ్‌, పాన్ మీద తప్పని సరిగా మూత పెట్టాలి. ఇది వేడి, ఆవిరిని కలిగిస్తుంది. ఇది తక్కువ గ్యాస్‌ని ఉపయోగించి మీ ఆహారం త్వరగా సమర్థవంతగా పూర్తి చేయటానికి సహకరిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..