Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023, Eliminator 1: ‘వెల్క‌మ్ టు 5/5 క్ల‌బ్‌’.. యువ ఆటగాడిపై వెల్లువెత్తిన ప్రశంసలు జల్లు.. జహీర్, సెహ్వాగ్ ఎమన్నారంటే..?

IPL 2023, LSG vs MI: ఐపీఎల్ 16వ సీజన్ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 81 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై టీమ్ యంగ్ ప్లేయర్ ఆకాశ్ మధ్వల్ ప్రదర్శన అద్భుతం, అద్వితీయమని..

IPL 2023, Eliminator 1: ‘వెల్క‌మ్ టు 5/5 క్ల‌బ్‌’.. యువ ఆటగాడిపై వెల్లువెత్తిన ప్రశంసలు జల్లు.. జహీర్, సెహ్వాగ్ ఎమన్నారంటే..?
Akash Madhwal Vs Lsg, Ipl 2023 Eliminator 1
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 25, 2023 | 3:30 PM

IPL 2023, LSG vs MI: ఐపీఎల్ 16వ సీజన్ ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై 81 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ముంబై టీమ్ యంగ్ ప్లేయర్ ఆకాశ్ మధ్వల్ ప్రదర్శన అద్భుతం, అద్వితీయమని చెప్పుకోవాలి. 3.3 ఓవర్లు వేసిన మధ్వల్ కేవలం 5 పరుగులే సమర్పించుకుని 5 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో 5 వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలవడంతో పాటు.. ఈ మార్క్ అందుకున్న 5వ ప్లేయర్‌గా కూడా అవతరించాడు. విశేషమేమిటంటే.. అన్‌క్యాప్డ్ ప్లేయర్ల బౌలింగ్ ప్రదర్శనలో మధ్వల్‌దే అత్యుత్తమ ప్రదర్శనగా టాప్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ మధ్వల్‌పై మాజీల నుంచి, సీనియర్ల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఈ యువ ఆటగాడిని ప్రశంసించినవారిలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, ఆర్‌సీ సింగ్, మొహమ్మద్ కైఫ్ వంటి మాజీలతో పాటు జస్ప్రీత్ బూమ్రా వంటి సీనియర్లు కూడా ఉన్నారు.

అలాగే ఆకాశ్ మధ్వల్‌ని ప్రశంసించినవారిలో టీమిండియా మాజీ కెప్టెన్, స్పిన్ దిగ్గజం అనీల్ కుంబ్లే కూడా ఉన్నాడు. అనిల్ కుంబ్లే మధ్వల్‌ని ప్రశంసిస్తూ ‘ఒత్తిడి ఎక్కువగా ఉండే మ్యాచ్‌లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన మధ్వల్. 5/5 క్లబ్‌లోకి స్వాగతం’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఇంకా వీరేంద్ర సెహ్వాగ్ కూడా మధ్వల్‌ని ప్రశంసిస్తూ తన ట్వీట్‌లో ‘డూ ఆర్ డై మ్యాచ్‌లో ఆకాష్ మధ్వల్ 5 వికెట్లు తీశాడు. కొత్త ప్లేయర్లు బాగా ఆడడం చాలా ఆనందంగా ఉంది. మ్యాచ్‌లో గెలిచిన  ముంబైకి అభినందనలు. లీగ్ దశలో 4వ స్థానంలో నిలిచి.. ఐపీఎల్‌లో విజేతగా నిలిచిన తొలి జట్టుగా ముంబై ఇండియన్స్ అవతరిస్తారా..?’ అంటూ పేర్కొన్నాడు.

అలాగే ‘5 పరుగులకు 5 వికెట్లు.. మధ్వల్ అద్భుత ప్రదర్శన చేసి, ప్లేఆఫ్స్‌లో 5 వికెట్లు తీసుకున్న తొలి ఆటగాడిగా నిలిచాడు. ఇలాంటి ప్రదర్శనలను మున్ముందు ఎన్నో చూడాలనుకుంటున్నాను’ అంటూ టీమిండియా మాజీ ప్లేయర్ జహీర్ ఖాన్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.

మరోవైపు టీమిండియా మాజీ బౌలర్ మొహమ్మద్ కైఫ్ కూడా మధ్వల్ ప్రదర్శనను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కైఫ్ ‘ఎలిమినేటర్ మ్యాచ్‌లో 5 పరుగులకు 5 వికెట్లు.. మధ్వల్ రూపంలో టీమిండియాకి ముంబై ఇండియన్స్ మరో ప్లేయర్‌ని అందిస్తున్నారా..? ’ అంటూ రాసుకొచ్చాడు.

మాజీల తరహాలోనే గాయం కారణంగా లీగ్‌కి దూరమైన జస్ప్రీత్ బూమ్రా కూడా ‘మధ్వల్ నుంచి అద్భుత ప్రదర్శన. ముంబై ఇండియన్స్‌కి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశాడు.

కాగా, బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో గెలిచిన ముంబై ఇండియన్స్ టోర్నీ ఫైనల్‌కి చేరాలంటే.. శుక్రవారం జరిగే క్వాలిఫైయర్ 2 లో కూడా గెలిచి తీరాలి. క్వాలిఫైయర్ 1 మ్యాచ్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌ టీమ్ ముంబైతో క్వాలిఫైయర్ 2లో తలపడుతుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
వాలంటైన్స్ డే కానుకగా సుఖేష్ జాక్వెలిన్‌కు ఏమిచ్చాడో తెలుసా?
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
ఈ వయ్యారి సొగసుకు హంస కూడా పోటీ రాదు.. స్టన్నింగ్ కేతిక..
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
రామ్ చరణ్ కూతురు క్లింకార ఫేస్ రివీల్..ఎంత క్యూట్‌గా ఉందో? వీడియో
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
వారంలోనే 30 కోట్లు.. రీరిలీజ్‌లో రికార్డులు కొల్లగొడుతోన్న సినిమా
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
సొగసులో గులాబీ.. అందం వెన్నెల ఈ కోమలి.. చార్మింగ్ రుక్సార్..
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
ముస్లిం అబ్బాయి- ఆంగ్లో ఇండియన్ అమ్మాయిల అందమైన ప్రేమకథ
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌ఛార్జ్‌‌గా మీనాక్షి నటరాజన్..
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
నెలకు రూ.4,500 ఇన్వెస్ట్ చేస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
ఈ వయ్యారి అందానికి జాబిల్లి ప్రేమలో పడదా.. మెస్మరైజ్ అతుల్య..
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో
స్పెషల్ ఫ్లైట్‌లో జ్యూవెలరీ షాప్ ఓపెనింగ్‌కు మోనాలిసా.. వీడియో