50ఏళ్లుగా దాచిన వైన్‌ సీసా.. వేలం వేయగా వచ్చిన ఆదాయం తెలిస్తే.. మతి పోతుంది మచ్చా..

పురాతన వైన్ బాటిల్ కలిగిన వ్యక్తి పాల్సన్ వృత్తిరీత్యా పెయింటర్. అతను అరుదైన, ప్రత్యేకమైన వైన్‌లను సేకరించి భద్రపరుచుకోవటంలో ప్రత్యేకించి ఆసక్తి చూపించేవాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు అతనికి ఈ బాటిల్ కొనడానికి ఏర్పాటు చేశాడట. అదే అతని జీవితాన్ని మార్చేసింది.

50ఏళ్లుగా దాచిన వైన్‌ సీసా.. వేలం వేయగా వచ్చిన ఆదాయం తెలిస్తే.. మతి పోతుంది మచ్చా..
Bottle Of Wine
Follow us
Jyothi Gadda

|

Updated on: May 25, 2023 | 3:59 PM

లిక్కర్, వైన్ ఎంత పాతబడితే అంత కిక్కేక్కించేలా ఉంటుందని అంటారు. పాత మద్యం రంగు, దాని రుచి మత్తు చాలా ప్రత్యేకమైనది. దీంతో మద్యం ప్రియులు పాత మద్యం కావాలని అడుగుతుంటారు. కాబట్టి దీని ధర కూడా ఎక్కువే. ఇదే పాత మద్యం ఓ వ్యక్తిని లక్షాధికారిని చేసింది. అతని వద్ద కేవలం 1 మద్యం సీసా మాత్రమే ఉంది. ఆ ఒక్కటి వేలంలో పెట్టగా అత్యంత ఖరీదు పలికింది. దాని తెలిస్తే తాగకుండానే మీ కళ్లు బైర్లు కమ్మేయాల్సిందే. ఎందుకంటే..ఏళ్ల నాటి మద్యం బాటిల్ వల్ల ఓ వ్యక్తి కోటీశ్వరుడయ్యాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి తన వద్ద దాచిపెట్టుకున్న 50 ఏళ్ల నాటి మద్యం బాటిల్‌ను వేలం వేయగా అది కోట్లకు అమ్ముడుపోయిందని చెబుతున్నాడు.

ది వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం, మార్క్ పాల్సన్ అనే కాలిఫోర్నియా వ్యక్తి 1970ల నుండి Domaine de la Romanée-Conti La Tâche (డొమైన్ డి లా రోమనీ-కాంటి లా టాచే) బాటిల్‌ను కొనుగోలు చేశాడు. ఇక అప్పటి నుంచి దశాబ్దాలుగా ఆ బాటిల్‌ను అలాగే నేలమాళిగలో కార్డ్‌బోర్డ్ పెట్టెలో పెట్టి దాచిపెట్టాడు.. అప్పట్లో పాల్సన్ 250 డాలర్లు అంటే ఈరోజు 20 వేల రూపాయలు పెట్టి కొన్నాడు. దీని ప్రకారం, దీని ధర $1,889 ఉండాలి. కానీ పాతది కావడంతో వేలంలో $106,250 కంటే ఎక్కువ ధరకు విక్రయించబడింది. అంటే, ఈ వ్యక్తి కేవలం ఒక మద్యం బాటిల్‌ తో రూ.87,91,815.63 సంపాదించుకోగలిగాడు. అనుకున్న ధర కంటే రెట్టింపు ధరకు విక్రయించినట్టుగా వివరించాడు.

వేలం సంస్థ బోన్‌హామ్ స్కిన్నర్ ప్రకారం, ఆ వ్యక్తి మార్చిలో తను ఇప్పటి వరకు ఓపెన్‌ చేయని, కనీసం తాకని 50 ఏళ్ల వైన్ బాటిల్‌ తన వద్ద ఉందని చెప్పాడు. ఈసారి బాటిల్‌ని వేలం వేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలియజేశాడు.. బాటిల్ $50,000-$80,000 (రూ. 41,37,025- రూ. 66,18,784 ) మధ్య అమ్ముడవుతుందని అంచనా వేశారు. కానీ, ఇప్పుడు అది $106,250కి విక్రయించబడింది. ఇది చాలా అరుదైన వైన్ అని, అప్పట్లో దీని ధర చాలా తక్కువగా ఉండేదని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ రకమైన వైన్ 1300 సీసాలు మాత్రమే ఉన్నట్టుగా వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

పురాతన వైన్ బాటిల్ దొరికిన వ్యక్తి పాల్సన్ వృత్తిరీత్యా పెయింటర్. అతను అరుదైన, ప్రత్యేకమైన వైన్‌లను సేకరించి భద్రపరుచుకోవటంలో ప్రత్యేకించి ఆసక్తి చూపించేవాడు. ఆ సమయంలో అతని స్నేహితుడు అతనికి ఈ బాటిల్ కొనడానికి ఏర్పాటు చేశాడట. అదే అతని జీవితాన్ని మార్చేసింది. ఈ సీసా ఒక జెర్బోమ్, దీనిని డబుల్ మాగ్నమ్ అని కూడా పిలుస్తారు. అది నాలుగు స్టాండర్డ్ బాటిళ్ల వైన్‌తో సమానం. బోన్‌హామ్ స్కిన్నర్ ప్రకారం, లా టాచే చాలా అరుదైన వైన్, ప్రపంచవ్యాప్తంగా 1,300 సీసాలు మాత్రమే ఉత్పత్తి చేయబడతాయి. వీటిలో ఎక్కువ భాగం 750 ఎంఎల్ బాటిళ్లే. కానీ మూడు లీటర్ల సీసాలు చాలా తక్కువగా తయారు చేస్తారట. అంతేకాదు..ఈ వైన్ నాణ్యత కూడా అన్నింటిలో కెల్లా ది బెస్ట్‌ అని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే