Viral Photo: ఈ అబ్బాయి ఎవరో గుర్తుపట్టారా..? దూకుడుకు నయా మీనింగ్ చెప్పిన క్రికెట్ నవాబ్
ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతనో అద్భుతం. దూకుడుకు నయా మీనింగ్ చెప్పిన క్రికెట్ నవాబ్. ఎందరో ప్లేయర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. అంతేనా.. గ్రౌండ్‌లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలిపాడు. భారత క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడెవరో మీరు గుర్తుపట్టగలరా..?
ప్రజంట్ త్రో బ్యాక్ పిక్స్ ట్రెండ్ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్స్ చిన్ననాటి, అరుదైన ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. వీరిలో కొందర్ని గెస్ చేయగలం కానీ.. మరికొందర్ని అయితే గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంటుంది. ఇప్పుడు మీ ముందుకు ఓ మాజీ క్రికెటర్ చిన్నప్పటి ఫోటోను తీసుకొచ్చాం. ఇతడు అగ్రెసీవ్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతడిని చాలామంది ఇష్టపడతారు. సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉన్న వ్యక్తి. పెద్ద క్లూ ఏంటంటే.. అతడు ఇండియన్ టీమ్‌కి కెప్టెన్‌గా కూడా పనిచేశాడు. యస్.. చాలామంది గెస్ కరెక్టే. అతడు సౌరవ్ గంగూలీ. టీమిండియాకు ఎందరో కెప్టెన్లు వచ్చారు.. పోయారు.. కానీ, గంగూలీ కెప్టెన్‌గా ఉన్నన్ని రోజులు భారత క్రికెట్ ఓ వెలుగు వెలిగింది. టీమిండియాకు ఎనలేని సేవలు అందించాడు గంగూలీ. 1972 జూలై 8న జన్మించిన గంగూలీ పూర్తిపేరు సౌరవ్ చండీదాస్ గంగూలీ. అభిమానులు ముద్దుగా దాదా అని పిలుచుకుంటారు. 1992లో వెస్టిండీస్‌పై అంతర్జాతీయ వన్డే అరంగేట్రం చేశాడు.
క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి, విజయాల బాట పట్టించాడు. అప్పటి వరకు ఉన్న సాదాసీదా టీమ్‌కు దూకుడు నేర్పించాడు. వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్బజన్ సింగ్, జహీర్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోని లాంటి గొప్ప ప్లేయర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన దాదా.. తన ప్రత్యేకమైన శైలితో ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. తీసుకునే నిర్ణయాల్లో, ఆడే ఆటలో దూకుడు తగ్గించని గంగూలీ.. దాని ఫలితంగా ఒడిదొడుకులను కూడా ఎదుర్కొన్నాడు.
2002లో ఇంగ్లండ్ గడ్డపై జరిగిన నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో గంగూలీ ప్రవర్తన క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోలేరు. మ్యాచ్ గెలిచిన తర్వాత షర్టు విప్పి.. తన వ్యక్తిత్వంలో ఎంతకసి ఉందో అందరికీ తెలిపాడు. ఆ తర్వాత 2003 వరల్డ్ కప్‌లో భారత జట్టును ఫైనల్ వరకు తీసుకెళ్లి తానేంటో నిరూపించాడు. ఈ టోర్నీలో కెప్టెన్‌గానే కాకుండా ఆటగాడిగా 3 సెంచరీలతో 465 పరుగులు చేసి కీలకపాత్ర పోషించాడు. 2019 అక్టోబర్ నుంచి 2022 అక్టోబర్ వరకు బీసీసీఐ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేసిన దాదా.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు.
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..