MiG-29K: కటిక చీకట్లో నౌకపై యుద్ధ విమానం ల్యాండింగ్.. వీడియో చూశారంటే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే..
MiG-29K Jet Night Landing: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లోని మిగ్-29కె యుద్ధ విమానాన్ని భారత నావికాదళం విజయవంతంగా నైట్ ల్యాండింగ్ చేసింది. ఇక ఈ ఇందుకు సంబంధించిన వీడియోను..
MiG-29K Jet Night Landing: స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లోని మిగ్-29కె యుద్ధ విమానాన్ని భారత నావికాదళం విజయవంతంగా నైట్ ల్యాండింగ్ చేసింది. ఇక ఈ ఇందుకు సంబంధించిన వీడియోను ఇండియన్ నేవీ ట్వీట్ చేసింది. కటిక చీకట్లో కూడా ఇండియన్ నేవీ చేపట్టిన ఈ సహసోపేతమైన జెట్ ల్యాండింగ్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇంకా భారత నావికాదళం తన ట్వీట్‌లో ‘ఐఎన్‌ఎస్ విక్రాంత్‌లో మిగ్-29కె తొలి సారిగా నైట్ ల్యాండింగ్‌ను చేపట్టడం ద్వారా ఇండియన్ నేవీ మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. ఇది ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా నావికాదళం ప్రోత్సాహాన్ని సూచిస్తుంది. ఈ ఛాలెంజింగ్ నైట్ ల్యాండింగ్ ట్రయల్ విక్రాంత్ సిబ్బంది, నావికా పైలట్ల సంకల్పం, నైపుణ్యానికి ప్రదర్శన’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చొంది.
మరోవైపు ఇండియన్ నేవీ సాధించిన ఈ విజయాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సముచితంగా గుర్తించి, భారత నౌకాదళాన్ని ప్రశంసించారు. ట్విట్టర్ వేదికగా ‘”#INSVikrantలో MiG-29K జెట్ తొలి నైట్ ల్యాండింగ్ ట్రయల్స్‌ను విజయవంతంగా చేపట్టినందుకు భారత నౌకాదళానికి అభినందనలు. ఈ అద్భుతమైన విజయం విక్రాంత్ సిబ్బంది, నావికా పైలట్ల నైపుణ్యం, పట్టుదలకు నిదర్శనం. వారందరికీ నా అభినందనలు’ అంటూ రాజ్‌నాధ్ సింగ్ ట్వీట్ చేశారు.
Congratulations to the Indian Navy for successfully undertaking the maiden night landing trials of MiG-29K on #INSVikrant. This remarkable achievement is a testimony to the skills, perseverance and professionalism of the Vikrant crew and Naval pilots. Kudos to them. https://t.co/1wzIONNM8C
— Rajnath Singh (@rajnathsingh) May 25, 2023
ఈ ఐఎన్‌ఎస్ విక్రాంత్ నిర్మాణ ప్రక్రియ స్వదేశీ పరిజ్ఞానంతో 2009లో ప్రారంభం కాగా.. గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదగా అధికారికంగా కమీషనింగ్ జరిగింది. ఇక ఈ INS విక్రాంత్ 262 మీటర్ల పొడవు, 62 మీటర్ల వెడల్పు, 59 మీటర్ల ఎత్తైన ఎత్తుతో ఆకట్టుకునే రూపురేఖలను కలిగి ఉంది. ఇంకా అందులో 2,300 కంటే ఎక్కువ కంపార్ట్‌మెంట్‌లు, మహిళా అధికారుల కోసం ప్రైవేట్ క్యాబిన్‌లు, దాదాపు 1,700 మంది ఉండేందుకు కావలసిన సౌకర్యాలు ఉన్నాయి. ఈ నౌక గరిష్టంగా 28 నాట్‌ల(నాట్=1.852 కీమీ) వేగం, 18 నాట్ల స్థిరమైన వేగాన్ని కలిగి ఉంది, ఇంకా 7,500 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..