Minister Anurag Thakur: భారత్ గౌరవం మరింత పెరిగింది.. ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ హర్షం..
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన విజయవంతం అయ్యిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయత అనే ముంద్రను ప్రధాని మోదీ వేశారని గుర్తు చేశరు. ఐదు రోజులు మూడు దేశాల్లో ప్రధాని పర్యటనలో భారతయుల గౌరవం ఎంతో పెరిగిందన్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మూడు దేశాల పర్యటన విజయవంతం అయ్యిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. 140 కోట్ల మంది భారతీయుల గౌరవాన్ని పెంచేలా పర్యటన సాగిందన్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా భారత్ గురించి.. భారత ప్రధాని గురించి చర్చ జరుగుతోందన్నారు. ఒక్కప్పుడు విదేశాల్లో జరిగే సదస్సుల్లో పశ్చిమ దేశాల ఆదిపత్యం కనిపించేది. కానీ, ఇప్పుడు అలాంటి ప్రభావం భారత్ ప్రధాని మోదీ చుట్టూ తిరుగుతోందన్నారు. జీ 7 దేశాల సదస్సుల్లో భారత ప్రతినిధిగా ప్రధాని మోదీ వెళ్లడం.. దీంతో మన మాటకు ప్రముఖ్యం పెరగిందన్నారు. అంతేకాకుండా అక్కడి దేశాలవారు ప్రధాని, రాష్ట్రపతిని కలిసేందుకు సమయం అడగడం చాలా ప్రత్యేకంగా నిలిచింది. అంతేకాదు విదేశాల్లో ఉంటున్న కళాకారులు, రచయితలతోపాటు ప్రముఖులను భారత్‌తో కలిపే ప్రయత్నం ప్రధాని మోదీ చేశారని అన్నారు. జపాన్‌లో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రధాని మోదీని ప్రశంసించడం మనం చూశామని గుర్తు చేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.
గినియా దేశ ప్రధాని జేమ్స్ మరాపే మోదీ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం.. ప్రధాని మోదీని ది బాస్ అంటూ ఆస్ట్రేలియా ప్రధాని అనడం.. ఇది భారతయులకు విదేశాల్లో లభించిన గౌరవం అని మంత్రి అనురాగ్ ఠాకూర్ అభివర్ణించారు.
ఇవన్నీ చిన్న విషయాలు కాదని.. విధేశాల్లో భారత దౌత్యానికి దక్కిన గౌరవం అని అన్నారు. మూడు దేశాల్లో పర్యటించి వచ్చిన ప్రధాని మోదీ.. కేవలం రెండు గంటల్లోనే ప్రభుత్వ పనుల్లో నిమగ్నం అయ్యారు. ఇది మన భారత ప్రధాని మోదీ గొప్పతనం అని అన్నారు.
“ప్రధాని మోదీ ఆరు రోజుల విదేశీ పర్యటన భారత్, 140 కోట్ల మంది భారతీయులు గౌరవాన్ని పెంచింది. గత కొద్ది రోజులుగా, ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం, ప్రధానమంత్రి తీరు చర్చనీయాంశమైందన్నారు. ఇది సామాన్యమైనది కాదు.. ఈ ప్రధాని పర్యటన సాధికారత కలిగిన భారతదేశానికి సాక్షి” ఈ సందర్భంగా ఆయన అన్నారు.
#WATCH | Union Minister Anurag Thakur says, “PM Modi’s 6-day visit to foreign countries, enhanced the pride of India, Indianness and 140 crore India. In the past few days, the manner in which India and the PM are being discussed in global politics, is not ordinary. This visit of… pic.twitter.com/P8cXrdaALu
— ANI (@ANI) May 25, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం