Tipu Sultan’s Sword: లండన్‌లో వేలానికి టిప్పు సుల్తాన్ కత్తి.. ఎన్ని కోట్ల ధర పలికిందో తెలుసా..? ప్రత్యేకత ఏంటంటే..

ప్పు సుల్తాన్‌కు సంబంధించిన అన్ని ఆయుధాలలోకెల్లా గొప్పది. ఈ కత్తిపై భగవంతుని ఐదు గుణాలు, ప్రత్యేకంగా రెండు ప్రార్థనలు హిల్ట్ మీద బంగారు అక్షరాలతో చెక్కబడి ఉన్నాయి. కత్తిపై ‘పాలకుడి కత్తి’ అని రాసి ఉంటుంది. కత్తిపై రత్నాలు పొదిగి ఉన్నాయి. పిడి వద్ద పులితల బొమ్మ ఉంటుంది. ఈ కత్తి తయారీ వెనుక..

Tipu Sultan’s Sword: లండన్‌లో వేలానికి టిప్పు సుల్తాన్ కత్తి.. ఎన్ని కోట్ల ధర పలికిందో తెలుసా..? ప్రత్యేకత ఏంటంటే..
Tipu Sultans Sword
Follow us
Jyothi Gadda

|

Updated on: May 25, 2023 | 7:03 PM

Tipu Sultan’s Sword: 18వ శాతాబ్ధపు మైసూర్ రాజ్య పాలకుడు టిప్పు సుల్తాన్. లండన్‌లో జరిగిన వేలంలో టిప్పు సుల్తాన్‌ కత్తికి అనూహ్య ధర పలికింది. వేలంలో ఏకంగా 14 మిలియన్ పౌండ్లు అంటే దాదాపుగా రూ.140 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. వేలం నిర్వహించిన సంస్థ బోన్‌ హామ్స్‌ అంచనా వేసిన దానికంటే.. దాదాపుగా ఏడు రెట్లు ఎక్కువ ధరకు అమ్ముడైనట్లు సంస్థ తెలిపింది. 18వ శతాబ్ధంలో జరిగిన వివిధ యుద్ధాల్లో ఈ కత్తికి ప్రాధాన్యం ఉందని తెలిపింది.మరాఠాలకు, బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా టిప్పు అనేక యుద్ధాల్లో పాల్గొన్నాడు. టిప్పు సుల్తాన్‌ మరణానంతరం.. అతని ఖడ్గాన్ని బ్రిటీష్ మేజర్ జనరల్ డేవిడ్ బైర్డ్‌కు అతని ధైర్యానికి చిహ్నంగా సమర్పించినట్లు వేలం సంస్థ తెలిపింది.

బోన్‌హామ్స్‌లోని ఇండియన్ ఆర్ట్ అండ్ ఇస్లామిక్ గ్రూప్ హెడ్ నిమా సాగర్చి ఇలా అన్నారు: “ఖడ్గానికి అసాధారణమైన చరిత్ర ఉంది. ఆశ్చర్యకరమైన నిరూపణ, అసమానమైన నైపుణ్యం ఉంది. ఈ అద్భుతమైన కత్తి, ఇప్పటికీ వ్యక్తిగత చేతుల్లో ఉంది. టిప్పు సుల్తాన్‌కు సంబంధించిన అన్ని ఆయుధాలలోకెల్లా గొప్పది. ఈ కత్తిపై భగవంతుని ఐదు గుణాలు, ప్రత్యేకంగా రెండు ప్రార్థనలు హిల్ట్ మీద బంగారు అక్షరాలతో చెక్కబడి ఉన్నాయి. కత్తిపై ‘పాలకుడి కత్తి’ అని రాసి ఉంటుంది. కత్తిపై రత్నాలు పొదిగి ఉన్నాయి. పిడి వద్ద పులితల బొమ్మ ఉంటుంది. ఈ కత్తి తయారీ వెనుక ఆశ్చర్యపోయే ఆధారాలు, కత్తి నైపుణ్యం గురించి చరిత్ర దాగి ఉన్నాయి.

ఇక కత్తి వేలంలో ఇద్దరు ఫోన్ బిడ్డర్లు, ఓ బిడ్డర్ మధ్య హాట్ హాట్ గా వేలంపాట జరిగింది. టిప్పు సుల్తాన్ కత్తి 14 మిలియన్ డాలర్లకు అమ్ముడు పోవడాన్ని మేము సంతోషిస్తున్నాము అని ఇస్లామిక్ మరియు ఇండియన్ ఆర్ట్ గ్రూప్ హెడ్ నిమా సాగర్చి చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..