Watch: మెట్రోలో మనుషుల రీల్స్‌ పాత ట్రెండ్‌.. ఇప్పుడు జంతువుల వంతు..కోతి తమాషాలు చూడండి..

సోషల్ మీడియా వ్యూస్‌ కోసం రీల్స్ చేసేవాళ్లు మెట్రోలో వింత పనులు చేస్తారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొంతమేరకు ప్రజలు అలాంటి వాటిని చూడటం అలవాటు చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఓ కోతి మెట్రోలోకి ప్రవేశిస్తే సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంత భద్రత మధ్య అదేలా సాధ్యమని అనుకుంటున్నారు కదా..! కానీ, ఇది సాధ్యమేనండోయ్..

Watch: మెట్రోలో మనుషుల రీల్స్‌ పాత ట్రెండ్‌.. ఇప్పుడు జంతువుల వంతు..కోతి తమాషాలు చూడండి..
Monkey In Delhi Metro
Follow us
Jyothi Gadda

|

Updated on: May 25, 2023 | 6:40 PM

గత కొద్ది రోజులుగా మెట్రోలో జరిగే వింత వింత సంఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతన్నాయి. మెట్రోలో ప్రయాణీకులు డ్యాన్స్‌లు చేయటం, పాటలు పాడటం, స్నానం చేయడం, కొందరు హద్దులు మీరి రొమాన్స్ చేయడం కూడా కనిపించింది. ఇంకొందరు ఇంతకంటే ముందుకెళ్లి వింత పనులు చేస్తూ ఫేమస్ అయ్యారు. అయితే ఈ సారి ఢిల్లీ మెట్రో అనేది మనుషులకే కాదు.. జంతువులకు కూడా తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు అడ్డాగా మారింది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ కోతి మెట్రో ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తూ కనిపించింది. తొలిసారి మెట్రో ఎక్కిన కోతి అటు ఇటూ ఎగురుతూ, దూకుతూ నానా హంగామా చేసింది. కానీ, ఆ కోతిని చూసిన ప్రయాణికులేవరూ సీటు నుండి లేవటం గానీ, భయపడటం గానీ, చేయలేదు.

గతంలో మెట్రోలో జనం చేసిన ఫీట్‌లు పలు విమర్శలకు దారి తీసింది. తీవ్రమైన విమర్శల నేపథ్యంలో DMRC (ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్) కూడా కఠిన మార్గదర్శకాలను జారీ చేయాల్సి వచ్చింది. అంతే కాదు దీని వల్ల ప్రయాణికులు నానా అవస్థలు పడాల్సి వచ్చిందని, లక్షలు వెచ్చించినా ప్రజలు వారి చేష్టలను మానుకోలేదు. సోషల్ మీడియా వ్యూస్‌ కోసం రీల్స్ చేసేవాళ్లు మెట్రోలో వింత పనులు చేస్తారని అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొంతమేరకు ప్రజలు అలాంటి వాటిని చూడటం అలవాటు చేసుకున్నారు. అయితే అకస్మాత్తుగా ఓ కోతి మెట్రోలోకి ప్రవేశిస్తే సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇంత భద్రత మధ్య అదేలా సాధ్యమని అనుకుంటున్నారు కదా..! కానీ, ఇది ఢిల్లీ మెట్రో.. ఇక్కడ అన్ని రకాల వింతలు విడ్డూరాలు కనిపిస్తాయి. అలాంటి దృశ్యాలను ఎవరూ ఊహించలేరు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌ అవున్న ఈ వీడియో ఇప్పుడు జనాల దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే, ఈ వీడియో పాతదే అని తెలిసింది. కానీ, ఇప్పుడు మళ్లీ వైరల్‌గా మారింది. మెట్రో లోపల ఉన్న స్తంభంపై కోతి ఎక్కితూ గెంతుతున్నట్టుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ కోతి అక్కడ్నుంచి కిందకు జారుకుంటూ ముందుకు సాగి గేటు వైపు వెళ్తుంది. సీటులో కూర్చున్నవారు కూడా ఆ కోతిని చూస్తున్నారు. కానీ, ఎవరూ పట్టించుకోవటం లేదు.. కాసేపు అటూ ఇటూ నడిచిన కోతి ఓ వ్యక్తి పక్కనే ఉన్న సీటు దగ్గరకు వెళ్లి హాయిగా కూర్చుంది. తర్వాత అక్కడి నుంచి లేచి బయటి దృశ్యాలను చూడటం మొదలుపెట్టింది.

ఈ వీడియోను అనురాగ్ మైనస్ వర్మ (@anuragminusverma) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇది ఢిల్లీ మెట్రోలో కోతి అనే క్యాప్షన్‌తో పోస్ట్‌ చేవారు. 7 రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోను 90 వేల మందికి పైగా లైక్ చేశారు. అయితే చాలా మంది దీనిపై తమాషాగా భిన్నమైన కామెంట్‌లు చేస్తున్నారు. ఢిల్లీ మెట్రోలో మనుషుల తర్వాత, ఇప్పుడు జంతువులు టాలెంట్‌ ప్రదర్శిస్తున్నాయంటూ నెటిజన్లు కామెంట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..