Video: గాఢ నిద్రలో హైదరాబాదీ ప్లేయర్.. ఎయిర్ హోస్టెస్‌తో కలిసి స్కై చిలిపి చేష్టలు.. వీడియో చూస్తే నవ్వులే..
LSG vs MI Viral Video: లక్నో సూపర్ జెయింట్‌ని ఓడించి క్వాలిఫైయర్ 2 చేరిన ముంబై ఇండియన్స్ టీం ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్‌లో చోటు దక్కించుకునేందుకు రోహిత్‌సేన పోరాడనుంది. శుక్రవారం ముంబై-గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఇందులో గెలిచిన టీం ఫైనల్లోకి ప్రవేశిస్తుంది.
LSG vs MI Viral Video: లక్నో సూపర్ జెయింట్‌ని ఓడించి క్వాలిఫైయర్ 2 చేరిన ముంబై ఇండియన్స్ టీం ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఫైనల్‌లో చోటు దక్కించుకునేందుకు రోహిత్‌సేన పోరాడనుంది. శుక్రవారం ముంబై-గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుండగా.. ఇందులో గెలిచిన టీం ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. నిన్నటి మ్యాచ్‌లో ముంబై చారిత్రాత్మక విజయంతో లక్నోకు లీగ్ నుంచి నిష్క్రమణ మార్గం చూపించింది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ముంబై ఇండియన్స్ లక్నోపై విజయం సాధించింది. ముంబై 81 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచింది.
అయితే, మ్యాచ్ అనంతరం ముంబై టీం అహ్మదాబాద్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ముంబై ఫ్రాంచైజీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ అద్భుతమైన వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో సూర్యకుమార్ యాదవ్ చేసిన చిలిపి పనులు చూస్తే తప్పకుండా నవ్వకోవాల్సిందే. ఇందులో పాపం తిలక్ వర్మ అడ్డంగా బుక్ అయ్యాడు.
ఈ వీడియోలో తిలక్ వర్మ గాఢ నిద్రలో ఉన్నట్లు చూడొచ్చు. ఆదమరిచి నిద్రపోతున్న తిలక్ వర్మను చూసిన సూర్య కుమార్ యాదవ్ ఆటపట్టించాలనుకున్నాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ దగ్గరి నుంచి ఓ నిమ్మకాయ బద్దను తీసుకున్నాడు. గాఢ నిద్రలో ఉన్న తిలక్ వర్మ నోట్లో ఆ నిమ్మకాయను పించేశాడు. దీంతో నోట్లో పుల్లగా తగలడంతో ఉలిక్కిపడిన తిలక్ వర్మ అమాంతం నిద్ర నుంచి లేచేస్తాడు. దీంతో పక్కనే ఉన్న ముంబై టీంమేట్స్ నవ్వాపుకోలేకపోయారు. అలాగే రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే కూడా నవ్వు ఆపుకోలేకపోయింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.
ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ షేర్ చేసిన వీడియో..
Chain se sona hai toh jaag jao ???#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #IPL2023 #TATAIPL @surya_14kumar @TilakV9 MI TV pic.twitter.com/1SjiJtSSx7
— Mumbai Indians (@mipaltan) May 25, 2023
ఇక మ్యాచ్ గురించి మాట్లాడితే.. ముంబై టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. 183 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన లక్నో టీం 20 ఓవర్లు కూడా ఆడలేక 16.3 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటైంది. ముంబయికి చెందిన ఆకాష్ మధ్వల్ కేవలం 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి లక్నోను చావుదెబ్బ తీశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..