Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: జడేజాను దించేసిన వార్నర్ మామ.. లైవ్ మ్యాచ్‌లో బ్యాట్‌తో రచ్చ.. చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌లో నవ్వుల వర్షం.. వైరల్ వీడియో..

David Warner vs Ravindra Jadeja: మొదటి సింగిల్ చక్కగానే పూర్తి చేశాడు. అయితే, రెండో రన్ కోసం ప్రయత్నించే క్రమంలో జడేజా, వార్నర్ మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లతోపాటు ప్లేయర్లంతా నవ్వుల్లో మునిగిపోయారు.

Video: జడేజాను దించేసిన వార్నర్ మామ.. లైవ్ మ్యాచ్‌లో బ్యాట్‌తో రచ్చ.. చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌లో నవ్వుల వర్షం.. వైరల్ వీడియో..
David Warner vs Ravindra Jadeja video
Follow us
Venkata Chari

|

Updated on: May 20, 2023 | 7:27 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 67వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ 224 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారీ టార్గెట్ ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. 5 పరుగుల వద్ద పృథ్వీ షా ఔటయ్యాడు. దీంతో ఢిల్లీకి కష్టాలు మొదలయ్యాయి. షా అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన సాల్ట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో పడ్డాడు డేవిడ్ వార్నర్.

కాగా, 4.2 ఓవర్లో దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఓ సరదా సన్నివేశం చోటుచేసుకుంది. తొలి రెండు బంతులను సిక్స్, ఫోర్ కొట్టిన వార్నర్.. మూడో బంతికి భారీ షాట్ ఆడదామనుకున్నాడు. కానీ, అంచనా మిస్ కావడంతో సింగిల్ తీసేందుకు ప్రయత్నించాడు. మొదటి సింగిల్ చక్కగానే పూర్తి చేశాడు. అయితే, రెండో రన్ కోసం ప్రయత్నించే క్రమంలో జడేజా, వార్నర్ మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది. దీంతో ఈ ఇద్దరు ఆటగాళ్లతోపాటు ప్లేయర్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..

ఇవి కూడా చదవండి

వార్నర్ రెండో రన్ కోసం సిద్ధమయ్యాడు. అయితే, బాల్ రహానే వద్ద ఉంది. రహానేను ఆటపట్టించేందుకు వార్నర్ పరుగు తీసేందుకు క్రీజు దాటాడు. ఈ క్రమంలో రహానే బాల్‌ను వికెట్ల వైపు విసిరేస్తాడు. అది గమనించిన వార్నర్ క్రీజులోకి చేరుకుంటాడు. ఆ తర్వాత బాల్ జడేజా అందుకుంటాడు. మరోసారి ఆటపట్టించేందుకు వార్నర్ క్రీజు నుంచి బయటకు వస్తాడు. జడేజా బాల్ విసిరేందుకు ట్రై చేసి ఆపేస్తాడు. ఇది గమనించిన వార్నర్.. జడేజా స్టైల్లో బ్యాట్‌ను కత్తిలా తిప్పేస్తాడు. దీంతో జడేజా నవ్వుల్లో మునిగిపోయాడు. ఇది గమనించిన సాల్ట్ షాక్ అవుతూ చూస్తుంటాడు. వీరిద్దరిని చూసి ప్లేయర్లంతా నవ్వుల్లో మునిగిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..