Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs GT: బెంగళూరుకు వరుణుడి భయం.. మ్యాచ్ రద్దయితే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి చేరుతుందా..? ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే..

Rain Forecast for RCB vs GT: ఐపీఎల్ 2023 సీజన్‌ ప్లేఆఫ్స్‌లో రాయల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తప్పకుండా తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై తప్పక గెలవాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అయితే ప్రస్తుతం బెంగళూరును..

RCB vs GT: బెంగళూరుకు వరుణుడి భయం.. మ్యాచ్ రద్దయితే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి చేరుతుందా..? ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయంటే..
Rain Forecast For Rcb Vs Gt
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 20, 2023 | 8:38 PM

Rain Forecast for RCB vs GT: ఐపీఎల్ 2023 సీజన్‌ ప్లేఆఫ్స్‌లో రాయల్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ తప్పకుండా తమ చివరి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై తప్పక గెలవాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ ఆదివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అయితే ప్రస్తుతం బెంగళూరును వరణుడు బెంబేలెత్తిస్తున్నాడు. ఈ పరిస్థితిలో రేపటి మ్యాచ్ రద్దయితే ఆర్‌సీబీ భవితవ్యం ఏమిటి అనే విషయంపై నెట్టింట జోరుగా చర్చ జరుగుతోంది. 13 మ్యాచ్‌ల్లో 7 విజయాలలు సాధించిన ఆర్‌సీబీ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ఇక ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ చేరాలంటే గుజరాత్‌ టైటాన్స్‌పై తప్పకుండా విజయం సాధించాలి. లేకుంటే ఇతర మ్యాచ్‌ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది.

మరోవైపు ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకోగా.. శనివారం రాత్రి జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ భవితవ్యం తేలిపోతుంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరుగుతున్న నేటి రెండో మ్యాచ్‌లో లక్నో విజయం సాధిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ చేరుతుంది. ఓడితే మాత్రం ముంబై ఇండియన్స్, రాయల్ రాయల్ చాలెంజర్స్ తదుపరి మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇక గుజరాత్ టైటాన్స్‌పై మెరుగైన రన్‌రేట్‌తో ఆర్‌సీబీ విజయం సాధిస్తే ఆ టీమ్ కూడా నేరుగా ప్లే ఆఫ్స్‌కి చేరుతుంది. ఓడితే మాత్రం ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌ ఫలితంపై ఆర్‌సీబీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

అయితే ఆర్‌సీబీ, గుజరాత్ మ్యాచ్ కంటే ముందే ముంబై ఇండియన్స్ తమ సొంత మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో ముంబై టీమ్ ఓడిపోతే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. ఫ్లేఆఫ్స్ ఈక్వేషన్స్ ఇలా ఉండగా.. బెంగళూరును, దాని జట్టును వరుణుడు వణికిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రేపటి మ్యాచ్ రద్దయితే ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయిస్తారు. తద్వారా ఆర్‌సీబీకి 15 పాయింట్లే ఉంటాయి. అప్పుడు ఆర్‌సీబీ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. ఈ పరిస్థితిలో ముంబై తన చివరి మ్యాచ్‌లో ఓడిపోతేనే ఆర్‌సీబీ ప్లేఆఫ్స్‌కి చేరుతుంది. లేదంటే బెంగళూరు టీమ్‌కి టోర్నీలో నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే ఇప్పటికే 15 పాయింట్స్‌తో ఉన్న లక్నోసూపర్ జెయింట్స్ మెరుగైన రన్‌రేట్‌తో ఆర్‌సీబీ కంటే ముందు ఉంది. ఈ క్రమంలోనే రేపు వర్షం రాకూడదని ఆర్‌సీబీ అభిమానులు వరుణ దేవుడిని కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..