Salt: ఉప్పును చేతికి ఇవ్వొద్దని ఎందుకంటారో తెలుసా..? దీని వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటంటే..
భారతీయులకు ఎన్నో నమ్మకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హిందువులకు ఎన్నో విశ్వసాలు ఉంటాయి. అలాంటి విశ్వాసాల్లో ఒకటి ఉప్పును చేతికి ఇవ్వొద్దు. సాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని చెబుతుంటారు. అసలు ఉప్పును నేరుగా ఎందుకు..
భారతీయులకు ఎన్నో నమ్మకాలు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా హిందువులకు ఎన్నో విశ్వసాలు ఉంటాయి. అలాంటి విశ్వాసాల్లో ఒకటి ఉప్పును చేతికి ఇవ్వొద్దు. సాధారణంగా ఉప్పు డబ్బాను ఎదుటి వ్యక్తి ఇచ్చే సమయంలో నేరుగా చేతికి ఇవ్వకూడదని చెబుతుంటారు. అసలు ఉప్పును నేరుగా ఎందుకు ఇవ్వకూడదు.? దీని గురించి హిందూ ధర్మం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.
దశదానాల్లో ఉప్పు ఒకటని విశ్వసిస్తుంటారు. పిత్రు దానాలలో, శని దానాలలో ఉప్పుని దానం చేస్తూ ఉంటారు. అందుకే పూజల దగ్గర ఉప్పుని దూరంగా ఉంచుతారు. ఉప్పుతో దిష్టి తీస్తే దుష్టశక్తులు పోతాయని కూడా నమ్ముతారు. ఉప్పందించడం అంటే ఒకరి రహస్యాన్ని మరొకరికి చెప్పడమే అని అర్థం. అందుకే ఉప్పు చేతికి అందిస్తే గొడవలు జరుగుతాయని, ఉప్పు చేతిలోకి అందుకునేవారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుందని నమ్ముతుంటారు.
ఇక పురాణాల ప్రకారం అమృతం కోసం చేసిన సాగర మధనం సమయంలో సముద్రం గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. అదే సముద్రగర్భం నుంచి ఉప్పు కూడా తయారవుతుంది. అందుకే ఉప్పుని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో పరిహారాలు చేయాలని సూచించేది అందుకే. ముఖ్యంగా జ్యేష్టాదేవిని వదిలించుకునేందుకు ఉప్పుతో పరిహారాలు చేస్తారు కాబట్టి..ఉప్పును ఎవరి చేతినుంచైనా అందుకుంటే వారి చెడు మీకు సంక్రమిస్తుందని విశ్వసిస్తుంటారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..