జీవితమే ఒక ఆట.. సరికొత్త స్టైల్లో హైవేపై మామిడి పండ్లు అమ్ముకుంటున్న బుడ్డొడు..
కానీ, చాలా వాహనాలు ఆగకుండానే వెళ్లిపోతున్నాయి. కానీ, కారు ఆగినప్పుడు, ఆ పిల్లాడి ముఖంలో చిరునవ్వు వికసిస్తుంది. దేవుడా నాకు గిరాకీ దొరికిందని ఆ పిల్లవాడు సంతోషపడుతున్నట్టుగా కనిపించింది. వీడియో చూసిన నెటిజన్లు ఈ జీవితమే సర్కస్ అని రాశారు. కొంతమంది వినియోగదారులు బాలుడి ఆలోచన,అతని..
ప్రతి ఒక్కరూ జీవితంలో కష్టపడి పనిచేస్తారు. అయితే, కొందరు ‘స్మార్ట్ వర్క్’ చేస్తూ కష్టపడుతున్న వారికంటే అభివృద్ధిపరంగా ముందుంటారు. ఈ క్రమంలోనే మామిడి పండ్లు అమ్ముకుంటున్న ఒక బాలుడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హైవే వెంబడి బండిపై మామిడి పండ్లు అమ్ముకుంటున్న ఆ బాలుడు.. కస్టమర్లను ఆకట్టుకోవటం కోసం తెలివైన మార్గాన్ని ఎంచుకున్నాడు.. అవును.. ఈ కుర్రాడి స్టైల్ ఎలా ఉందంటే అతడు ప్లే చేసిన ట్రిక్‌కు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో చర్చనీయాంశంగా మారింది. 25 సెకన్ల నిడివిగల ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
వైరల్ అవుతున్న వీడియోలో హైవే సైడ్‌లో పసుపు రంగు టీ షర్టు, జీన్స్ వేసుకున్న ఓ కుర్రాడు డ్యాన్స్ చేయడం ముందుగా మనం చూడొచ్చు. బాలుడి డ్యాన్స్ స్టెప్స్ అక్కడ్నుంచి వచ్చే పోయే వాహనదారులను రోడ్డు పక్కన ఆపమని ఆహ్వానిస్తున్నట్టుగా ఉన్నాయి..కానీ, చాలా వాహనాలు ఆగకుండానే వెళ్లిపోతున్నాయి. కానీ, కారు ఆగినప్పుడు, ఆ పిల్లాడి ముఖంలో చిరునవ్వు వికసిస్తుంది. దేవుడా నాకు గిరాకీ దొరికిందని ఆ పిల్లవాడు సంతోషపడుతున్నట్టుగా కనిపించింది.
A boy is dancing near a mango cart trying to get the attention of motorists (customers) in Yelawal along Mysuru-Madikeri National Highway. Dozens of such carts are lined up in the stretch during mango season.
(VC: Chetan Gowda) pic.twitter.com/eEepJSztyd
— Kodagu Connect (@KodaguConnect) May 23, 2023
మే 23న @KodaguConnect అనే ట్విటర్ వినియోగదారు ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ శీర్షికతో: ఒక బాలుడు యెలావల్ మైసూర్-మడికేరి జాతీయ రహదారి వెంబడి మామిడి పండ్లు అమ్ముతున్నాడు. కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి ఇలాంటి వినూత్న ప్రయత్నం చేశాడని పేర్కొన్నారు. కాగా, వైరల్ అవుతున్న ఈ వీడియోకి 13 వేలకు పైగా వీక్షణలు, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసి కొందరు తమ మనసులోని మాటను కామెంట్స్‌లో రాశారు. పిల్లల అంకితభావాన్ని నేను అభినందిస్తున్నాను అని ఒక వ్యక్తి చెబితే..ఈ పద్ధతి అంత సురక్షితం కాదని సూచించారు. మరికొందరు..ఈ జీవితమే సర్కస్ అని రాశారు. కొంతమంది వినియోగదారులు బాలుడి ఆలోచన,అతని డ్యాన్స్ నైపుణ్యం రెండింటినీ ప్రశంసించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..