CSK vs MI, IPL Final: ‘ఫైనల్‌లో ముంబైని ఓడిస్తేనే మజా’.. మనసులోకి కోరిక చెప్పేసిన ధోని సహచరుడు..
CSK vs MI, IPL Final: ఐపీఎల్ 16వ సీజన్ తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ నేరుగా టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. విశేషమేమిటంటే.. ఐపీఎల్‌లో 14 సీజన్లు మాత్రమే ఆడిన చెన్నై టీమ్ 12 సార్లు ప్లేఆఫ్స్‌కి, అలాగే..
CSK vs MI, IPL Final: ఐపీఎల్ 16వ సీజన్ తొలి క్వాలిఫయర్‌లో గుజరాత్ టైటాన్స్‌ను 15 పరుగుల తేడాతో ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్ నేరుగా టోర్నీ ఫైనల్‌కు చేరుకుంది. విశేషమేమిటంటే.. ఐపీఎల్‌లో 14 సీజన్లు మాత్రమే ఆడిన చెన్నై టీమ్ 12 సార్లు ప్లేఆఫ్స్‌కి, అలాగే 10వ సారి ఫైనల్‌కి చేరుకుంది. అయితే మంగళవారం జరిగిన ఈ మ్యాచ్ అనంతరం చెన్నై టీమ్ బౌలర్ దీపక్ చాహర్ ఫైనల్‌లో ఎవరితో ఆడాలనుకుంటున్నాడో తేల్చేశాడు. గుజరాత్‌పై విజయం తర్వాత దీపక్ చాహర్ జియో సినిమాతో మాట్లాడుతూ.. ముంబై ఇండియన్స్‌తో ఫైనల్ ఆడాలనుకుంటున్నానని చెప్పాడు. ఇంకా ‘ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ని ఓడించడం సరదాగా ఉంటుంది. మా మధ్య అన్‌ఫినిష్‌డ్ బిజనెస్ చాలా మిగిలి ఉంది’ అని అన్నాడు. అందుకు సురేష్ రైనా మాట్లాడుతూ.. ముంబై చేతుల్లోనే చెన్నై ఎక్కువసార్లు ఫైనల్స్‌లో ఓడిపోయిందని అనగా.. ‘అవును, ఆ లెక్కలనే మార్చాలి’ అంటూ బదులిచ్చాడు.
ఫైనల్ లెక్కల్లో ముంబైదే పైచేయి
చెన్నై సూపర్ కింగ్స్ తాజాగా 10వ సారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరుకుంది. అంటే చెన్నై ఇప్పటివరకు 9 సార్లు ఫైనల్ ఆడగా.. అందులో ముంబై ఇండియన్స్‌తోనే 4 సార్లు ఆడింది. ఇక ఆ 4 మ్యాచ్‌ల్లో ముంబై 3 సార్లు గెలవగా, చెన్నై ఒక్కసారి మాత్రమే గెలిచింది. 2010 ఐపీఎల్ ఫైనల్‌లో CSK గెలవగా.. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2019 ఐపీఎల్ ఫైనల్స్‌లో చెన్నైని ఓడించింది.
దూసుకొస్తున్న ముంబై ఇండియన్స్
ఐపీఎల్ 16వ సీజన్ లీగ్ దశ మొదట్లో తడబడిప ముంబై ఇండియన్స్ చివరి దశలో మెరుగ్గా రాణించింది. అలాగే బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ని 81 పరుగుల తేడాతో మట్టికరిపించి.. క్వాలిఫయర్ 2 కోసం అర్హత సాధించింది. ఆ మ్యాచ్‌లోనూ గుజరాత్ టైటాన్స్‌ను ముంబై టీమ్ ఓడించగలిగితే.. దీపక్ చాహర్ కోరిక కూడా నెరవేరుతుంది. ఇంకా చిరకాల ప్రత్యర్థులుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మరోసారి టైటిల్ కోసం ఫైనల్‌లో కనిపిస్తాయి.
‘ముంబై అంటే నాకు భయం’
— Balram Bedage (@itsbalram) May 25, 2023
చెన్నై టీమ్ యువ బౌలర్ దీపక్ చాహర్ ముంబై ఇండియన్స్‌ని ఫైనల్‌లో చూడాలనుకుంటున్నాడు. కానీ చెన్నై మాజీ ప్లేయర్, టీ20 దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో మాత్రం ముంబైతో ఫైనల్ ఆడాలని కోరుకోవడం లేదు. ఇంకా ‘ముంబై అంటే నాకు చాలా భయం. ముంబైతో ఫైనల్ అడాలని నేను కోరకోవడం లేదు’ అని ముక్కుసూటిగా చెబుతున్నాడు. మరి చెన్నై టీమ్ ఎవరితో ఫైనల్ ఆడబోతుందో తెలియాలంటే శుక్రవారం జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్ వరకు వేచి చూడాల్సిందే..
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..