IPL 2023: కొంపముంచిన ఐపీఎల్.. ఈ 5గురి ప్లేయర్స్ టీమిండియాలో కెరీర్ ఖతమే..! వారెవరంటే.?

IPL 2023: టీమిండియా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఐపీఎల్ ఎంతగానో దోహదపడుతుంది. అందుకే చాలామంది ఆటగాళ్లు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అంచనాలకు మించి రాణిస్తుంటారు. టీమిండియాలో చోటు కోల్పోయిన రహనే.. ఈ సీజన్‌లో దుమ్ములేపి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌‌లో..

IPL 2023: కొంపముంచిన ఐపీఎల్.. ఈ 5గురి ప్లేయర్స్ టీమిండియాలో కెరీర్ ఖతమే..! వారెవరంటే.?
Ipl 2023
Follow us

|

Updated on: May 26, 2023 | 11:30 AM

ఐపీఎల్.. టీమిండియా జాతీయ జట్టులో చోటు దక్కించుకునేందుకు ఈ లీగ్‌ ఎంతగానో దోహదపడుతుంది. అందుకే చాలామంది ఆటగాళ్లు ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అంచనాలకు మించి రాణిస్తుంటారు. ఇందుకు నిదర్శనం అజింక్యా రహనే. టీమిండియాలో చోటు కోల్పోయిన అతడు.. ఈ సీజన్‌లో దుమ్ములేపి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ ప్లేయింగ్ ఎలెవన్‌లో స్థానం దక్కించుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సుయాష్ శర్మ, రింకూ సింగ్ లాంటి యువ ప్లేయర్స్.. తమ అద్భుతమైన ఆటతీరుతో టీమిండియా తలుపు తడుతుంటే.. మరికొందరు ఆటగాళ్లు పేలవమైన ఫామ్‌తో వచ్చిన ఛాన్స్‌లు మిస్ చేసుకుంటున్నారు. ఐపీఎల్ 2023 సీజన్ తర్వాత ఈ ఐదుగురికి టీమిండియా తలుపులు మూసుకుపోయినట్టే అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. మరి వారెవరో చూసేద్దాం పదండి..

  • పృథ్వీ షా:

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోన్న పృథ్వీ షా ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో 13.25 సగటుతో 106 పరుగులు చేశాడు. ఇప్పటివరకు టీమిండియాలో చోటు దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడిన పృథ్వీ షా.. ఈసారి అదరగొట్టాలని అనుకున్నాడు. కానీ సీన్ కాస్తా రివర్స్ అయింది.

  • సర్ఫరాజ్ ఖాన్:

దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన సర్ఫరాజ్ ఖాన్.. ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. 4 మ్యాచ్‌ల్లో 13.25 సగటుతో 53 పరుగులు చేశాడు. దీన్ని బట్టి చూస్తే.. ఈ ఐపీఎల్‌ సర్ఫరాజ్ కొంపముంచిందని చెప్పొచ్చు. టీమిండియాలోకి చోటు దక్కడం కష్టమే.

  • రాహుల్ త్రిపాఠి

భారత్ తరఫున 5 టీ20ల్లో 97 పరుగులు చేసిన త్రిపాఠి.. ఈ సీజన్‌లో ఒకట్రెండు మినహా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లు ఆడలేదు. ఈ 32 ఏళ్ల ఆటగాడు ఐపీఎల్ 2023లో 13 మ్యాచ్‌ల్లో 22.75 సగటుతో 273 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో అతడి ఫామ్ లయ తప్పిందని చెప్పొచ్చు. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు అద్భుతంగా రాణించడంతో.. బీసీసీఐ వారికే మొగ్గు చూపే అవకాశం ఉంది.

  • దీపక్ హుడా:

భారత్ తరఫున 10 వన్డేలు, 21 టీ20లు ఆడిన దీపక్ హుడా.. ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్‌లో దీపక్ ప్రదర్శన నిరాశపరిచింది. 12 మ్యాచ్‌ల్లో 7.64 సగటుతో 84 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో దీపక్ హుడా కెరీర్ ఇక ఖేల్ ఖతం అయినట్లే అని ఫ్యాన్స్ అంటున్నారు.

  • దీపక్ చాహర్:

దీపక్ చాహర్ ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు పడగొట్టాడు. గాయాలు కారణంగా చాలావరకు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న దీపక్.. ఈ ఐపీఎల్‌కు లైన్ అండ్ లెంగ్త్ మిస్ అయ్యాడు. అతడి ఫిట్‌నెస్ ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో దీపక్ చాహర్‌కు టీమిండియాలో చోటు దక్కడం కష్టమేనంటున్నారు టీమిండియా ఫ్యాన్స్.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..