AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI Qualifier 2: 9 మ్యాచ్‌ల్లో ఐదుగురు స్టార్లు.. హార్దిక్ సేనకు ముచ్చెమటలే.. గుజరాత్ ఇక అస్సాం పార్శిలవ్వాల్సిందేనా?

IPL 2023: ముంబై జట్టు ఫైనల్స్ వైపు దూసుకెళ్తున్న తీరు చూస్తుంటే.. ఇప్పుడు సీజన్‌లోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో చెన్నై, ముంబై జట్లు మాత్రమే గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించాయి.

GT vs MI Qualifier 2: 9 మ్యాచ్‌ల్లో ఐదుగురు స్టార్లు.. హార్దిక్ సేనకు ముచ్చెమటలే.. గుజరాత్ ఇక అస్సాం పార్శిలవ్వాల్సిందేనా?
Mi Vs Gt Match
Venkata Chari
|

Updated on: May 26, 2023 | 7:26 AM

Share

ముంబై జట్టు ఫైనల్స్ వైపు దూసుకెళ్తున్న తీరు చూస్తుంటే.. ఇప్పుడు సీజన్‌లోనే అత్యంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో చెన్నై, ముంబై జట్లు మాత్రమే గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో విజయం సాధించాయి. చెన్నై ఇప్పటికే ఫైనల్స్‌కు చేరుకోగా, ఇప్పుడు ముంబై ఈ పాయింట్‌కి ఒక అడుగు దూరంలో నిలిచింది. గత రెండు మ్యాచ్‌ల్లో ముంబై విజయం సాధించిన తీరు కూడా గుజరాత్‌కు హెచ్చరికగా మారింది.

ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ప్రదర్శన చూస్తే.. వారెవ్వా అనాల్సిందే. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 18 ఓవర్లలో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీని తర్వాత, ఎలిమినేటర్ మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో లక్నోను ఓడించింది. గుజరాత్‌పై ముంబై సాధించిన విజయంలో ఓ సందేశం దాగి ఉంది. ఈ సందేశాన్ని అర్థం చేసుకోవడంలో గుజరాత్ విఫలమైతే, హార్దిక్ సేనకు ఇబ్బందులు తప్పవు.

ముంబై విజయంలో దాగిన సందేశం ఏమిటంటే?

ఈ సీజన్‌లో 14 లీగ్ మ్యాచ్‌లు ఆడిన ముంబై జట్టు 8 గెలిచింది. ఇక ఎలిమినేటర్‌లో విజయాన్ని జోడిస్తే, రోహిత్ సేన విజయాల సంఖ్య 9 అవుతుంది. ఈ 9 మ్యాచ్‌ల్లో స్టార్ ప్లేయర్‌లను గుర్తుంచుకోవాల్సిందే. ఈ సీజన్‌లో ఢిల్లీతో జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. కోల్‌కతాతో జరిగిన తదుపరి మ్యాచ్‌లో ముంబై గెలిచింది. అయితే ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు వెంకటేష్ అయ్యర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. తదుపరి విజయం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై వచ్చింది. ఈ మ్యాచ్‌లో స్టార్ కామెరాన్ గ్రీన్.

ఇవి కూడా చదవండి

ఇక రాజస్థాన్‌పై ముంబై విజయం సాధించడంలో యశస్వి జైస్వాల్ కీలకపాత్ర పోషించి, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచారు. తర్వాతి మ్యాచ్‌లోనూ సూర్యకుమార్ యాదవ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో క్యామెరూన్ గ్రీన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఎలిమినేటర్‌లో ఆకాష్ మధ్వల్ ఈ టైటిల్‌ను అందుకున్నాడు. 9 విజయాల్లో అంటే 2 సార్లు టైటిల్ ప్రత్యర్థి జట్టు ఖాతాలోకి వెళ్లింది. సూర్య, కామెరాన్ గ్రీన్ తలో 2 సార్లు టైటిల్‌ను పొందారు. మిగిలిన 3 మ్యాచ్‌లలో వేర్వేరు ఆటగాళ్లు గెలిచారు.

ముంబై ఇండియన్స్ రికార్డులు..

ఈ సీజన్‌లో కెమెరాన్ గ్రీన్ 422 పరుగులు చేశాడు. తిలక్ వర్మ 300, సూర్యకుమార్ యాదవ్ 544, ఇషాన్ కిషన్ 454, రోహిత్ శర్మ 324 పరుగులు చేశారు. టీ20 ఫార్మాట్‌లో 200 పరుగుల మార్కును తాకడం లేదా దాటడం ముంబైకి కష్టమైన పని కాదని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఇందులో కెమరూన్ గ్రీన్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్‌ల స్ట్రైక్ రేట్ కూడా 150కి పైగానే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ 6 సార్లు 200 మార్క్‌ను అధిగమించిన సంగతి తెలిసిందే. ఇందులో ఐదుసార్లు విజయం సాధించింది. ఇది గుజరాత్‌కు ప్రమాద ఘంటికగా మారింది.

గుజరాత్ మెరిసింది ఆ నలుగురి వల్లే..

ఈ సీజన్‌లో లీగ్ మ్యాచ్‌ల తర్వాత గుజరాత్ జట్టు మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యంగా గుజరాత్ ఆటలో నిలకడ కనిపించింది. కానీ ఇబ్బంది ఏమిటంటే, ఆ నిలకడ గుజరాత్‌ది కాదు. శుభమాన్ గిల్‌ది. ఈ సీజన్‌లో గిల్ 722 పరుగులు చేశాడు. అతని తర్వాత, విజయ్ శంకర్ 301 పరుగులు చేశాడు. అంటే, శుభ్‌మన్ గిల్ తర్వాత, ఇతర బ్యాట్స్‌మెన్ సగటు చాలా దారుణంగా తయారైంది. బౌలింగ్‌లోనూ అదే కథ. మహ్మద్ షమీ, రషీద్ ఖాన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. అయితే ఈ ఇద్దరు బౌలర్లు మినహా మిగతా బౌలర్ల ప్రదర్శన యావరేజ్‌గానే ఉంది.

ఈ సీజన్‌లో మహ్మద్ షమీ 26 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్ 25 వికెట్లు తీశాడు. చెన్నైపై ఈ ముగ్గురు ఆటగాళ్ల ప్రదర్శన పేలవంగా లేకపోయినా, మ్యాచ్ కూడా గెలవలేదు. షమీ 28 పరుగులిచ్చి 2 వికెట్లు, రషీద్ 37 పరుగులిచ్చి 1 వికెట్ తీశారు. శుభమన్ గిల్ కూడా 42 పరుగులు చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులోని మిగతా ఆటగాళ్లు విజయం సాధించే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, ఇది మొత్తం సీజన్‌లో జరగనందున ఇప్పుడు ఆశించడం కూడా కష్టమే. ఇది గుజరాత్‌కు తలనొప్పిగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..