Pet Dog Funeral: పెంపుడు కుక్కకు అంత్యక్రియలు.. హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు..
Pet Dog Funeral: పెంపుడు జంతువులను సొంత బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించే పెట్ లవర్స్ ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ఆనారోగ్యంతో మరణించిన ఓ పెంపుడు కుక్కకు చిత్తురు జిల్లాలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు..
Pet Dog Funeral: పెంపుడు జంతువులను సొంత బిడ్డ కంటే ఎక్కువగా ప్రేమించే పెట్ లవర్స్ ఎందరో ఉన్నారు. ఈ క్రమంలో ఆనారోగ్యంతో మరణించిన ఓ పెంపుడు కుక్కకు చిత్తురు జిల్లాలో సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లాకు చెందిన మల్లి ఆచారి 11 ఏళ్లుగా ఓ పెంపుడు కుక్కను పోషిస్తున్నాడు. అయితే ఆ పెంపుడు కుక్క అనారోగ్యంతో మంగళవారం మరణించింది.
తామెంతో అల్లారుముద్దుగా పెంచుకున్న పెంపుడు కుక్క అనారోగ్యంతో చనిపోవడంతో తల్లడిల్లిపోయింది సదరు మల్లి కుటుంబం. ఇక ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబంలో భాగమైన ఆ పెంపుడు కుక్కకు హిందూ ధర్మ సాంప్రదాయాల ప్రకారం స్మశాన వాటిలో దహన సంస్కారాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఏపీ వార్తల కోసం..