Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sun in Rohini 2023: రోహిణి నక్షత్రంలోకి ఆదిత్యుడు.. ఈ రాశులవారికి అనూహ్య ధనలాభం, సంతాన ప్రాప్తి..

Sun in Rohini 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివిధ రాశులలోకి గ్రహాల ప్రవేశం మానవ జీవితంపై ప్రభావం చూపుతోందన్న విషయం తెలిసిందే. అయితే గ్రహాలు వివిధ నక్షత్రాల్లోకి ప్రవేశించడానికి కూడా ఇదే తరహాలో ఫలితాలు

Sun in Rohini 2023: రోహిణి నక్షత్రంలోకి ఆదిత్యుడు.. ఈ రాశులవారికి అనూహ్య ధనలాభం, సంతాన ప్రాప్తి..
Sun In Rohini Nakshatra 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 26, 2023 | 8:55 AM

Sun in Rohini 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వివిధ రాశులలోకి గ్రహాల ప్రవేశం మానవ జీవితంపై ప్రభావం చూపుతోందన్న విషయం తెలిసిందే. అయితే గ్రహాలు వివిధ నక్షత్రాల్లోకి ప్రవేశించడానికి కూడా ఇదే తరహాలో ఫలితాలు కలుగుతాయి. ఈ క్రమంలో గ్రహాల రాజు అయిన సూర్యుడు మే 25న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. ఫలితంగా కొన్ని రాశులకు అనూహ్య లాభాలు, శుభ ఫలితాలు సిద్ధించనున్నాయి. ఈ శుభ  ఫలితాలను ఆయా రాశులవారు జూన్ 2 వరకు కూడా పొందగలుగుతారు. ఇంకా ఈ సమయంలో వారికి కెరీర్‌లో ఉన్నత స్థానం, రెట్టింపు ఆదాయం, వ్యాపారాభివృద్ధి కూడా కలగనున్నాయి. మరి ఏయే రాశులవారికి ఈ ఫలితాలు ప్రాప్తిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సింహ రాశి: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల సింహ రాశివారికి ప్రభుత్వం ఉద్యోగం కోసం యత్నించేవారికి కోరికలు నేరవేరుతాయి. నిజానికి ఇది సింహరాశివారి కెరీర్‌కి శుభ గడియలని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సమయంలో మీ ఆర్థికారోగ్య పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్యంగా సంతాన ప్రాప్తి కలిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.

మేష రాశి: సూర్యుడు రోహిణీ నక్షత్రంలోకి ప్రవేశించడం మేషరాశివారికి ఆర్ధిక ప్రయోజనాలను తెచ్చేదిగా ఉంటుంది. ఈ సమయంలో మీకు మీ బంధుమిత్రులతో సత్సంబంధాలు, మీరు చేసే పనులకు ప్రశంసలు లభిస్తాయి. ఇంకా మీరు జూన్ 2 వరకు అనూహ్య స్థాయిలో లాభాలను పొందుతారు.

ఇవి కూడా చదవండి

ధనస్సు రాశి: ధనస్సు రాశివారికి కూడా రోహిణీ నక్షత్రంలో సూర్యుడు సంచరించడం శుభప్రదంగా ఉంటుంది. ఫలితంగా మీ జీవితంలో అంతులేని కనకవర్షం కురుస్తుంది. కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఆదాయానికి కొత్త మార్గాలు, కష్టానికి తగిన ప్రతిఫలం, కృషికి గౌరవ మర్యాదలను పొందుతారు

కర్కాటక రాశి: రోహిణీ నక్షత్రలోకి సూర్యుడి పరివర్తనం కర్కాటక రాశివారికి పెను మార్పులు తీసుకురానుంది. ఫలితంగా కీలక పదవి లేదా బాధ్యతలను స్వీకరిస్తారు. ఇంకా కొత్త ఆదాయపు మార్గాలు, ఉద్యోగావకాశాలను, వ్యాపార ప్రారంభానికి సృజనాత్మకంగా అడుగులు వేస్తారు.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..