Astro Tips: ఇంట్లో సంపద, సంతోషం ఉండాలంటే.. సూర్యాస్తమయం తర్వాత ఈ 5 పనులు చేయకండి..

పురాణ గ్రంథాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో వాతావరణంలో గరిష్ట ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. అందుకే సూర్యాస్తమయం సమయంలో అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే సూర్యాస్తమయ సమయంలో కొన్ని రకాల పనులు చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి.

Astro Tips: ఇంట్లో సంపద, సంతోషం ఉండాలంటే.. సూర్యాస్తమయం తర్వాత ఈ 5 పనులు చేయకండి..
Astro Tips
Follow us
Surya Kala

|

Updated on: May 26, 2023 | 7:45 AM

సనాతన హిందూ ధర్మంలో సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఏమి చేయాలి..  ఏమి చేయకూడదనేది వివరంగా పేర్కొన్నారు. సూర్యాస్తమయం సమయంలో..  తర్వాత కొన్ని పనులను చేయరాదని పురాణాల గ్రంథాలతో పాటు..పెద్దలు కూడా చెబుతారు.  సాయంత్రం వేళ ఇంటిని  ఊడ్చకూడదని, గుమ్మంలో కూర్చోకూడదని ఇంటి పెద్దలు ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. పురాణ గ్రంథాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో వాతావరణంలో గరిష్ట ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. అందుకే సూర్యాస్తమయం సమయంలో అస్సలు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే సూర్యాస్తమయ సమయంలో కొన్ని రకాల పనులు చేయడం వల్ల అశుభ ఫలితాలు వస్తాయి. కనుక ఈ రోజు సూర్యాస్తమయం తర్వాత  చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుందాం..

పసుపు వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత పసుపు ఎవరికీ ఇవ్వకూడదు. పసుపు బృహస్పతికి సంబంధించినది. ఐశ్వర్యానికి కారకుడు గురువు, అదృష్టాన్ని తీసుకొస్తుంది. అందుకే సూర్యాస్తమయం తర్వాత పసుపు ఇవ్వడం వల్ల దేవతల గురువు బృహస్పతికి కోపం వస్తుంది. ఆర్థిక పరిస్థితి తీవ్రంగా దెబ్బతింటుంది.

చీపురుతో తుడవద్దు  చీపురు లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. చీపురుతో ఇంటి మురికిని శుభ్రం చేసిన తర్వాత  లక్ష్మీదేవి ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. అయితే సూర్యాస్తమ సమయంలో ఇంటిని అస్సలు శుభ్రం చేయకూడదు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని.. ఆ ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కోల్పోతుందని పెద్దలు చెబుతారు.

ఇవి కూడా చదవండి

సూర్యాస్తమయం తర్వాత పాలు, పెరుగు, జున్ను, పంచదార, ఉప్పు మొదలైన వాటిని దానం చేయకూడదు లేదా ఎవరికీ అప్పుగా కూడా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం.. మీరు ఈ వస్తువులను అందుకున్న వ్యక్తికీ చేరుకుంటాయి.

బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యాస్తమయం తర్వాత వాతావరణంలో గరిష్ట ప్రతికూల శక్తి ఉంటుంది. కనుక  సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకకూడదు లేదా ఆరబెట్టకూడదు. అటువంటి పరిస్థితిలో, బట్టలు ఉతకడం లేదా ఎండబెట్టడం ద్వారా.. ప్రతికూల శక్తి బట్టల్లో ప్రవేశిస్తుంది. దీని కారణంగా శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.

పెరుగు తినకూడదు సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. ఇది శుక్ర గ్రహానికి సంబంధించినది. శుక్రుడు సంపద-కీర్తి, ఆకర్షణ మొదలైన వాటికి కారకంగా పరిగణించబడుతున్నాడు. అంతేకాదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  సూర్యుడు, శుక్రుడి మధ్య స్నేహ సంబంధాలు లేవు. కనుక రాత్రి పెరుగు తిన్న వ్యక్తి అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. కనుక పెద్దలు రాత్రి పెరుగు బదులు మజ్జిగ పోసుకుని తినేవారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
వాడీవేడిగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
రూ.4 కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ.! వీడియో
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
ఆధార్‌పై బిగ్ అప్‌డేట్.! ఆధార్ అప్ డేట్ పై ఎక్స్‌లో ఉడాయ్ కీలక..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
అనాథలా పెరిగిన కోటీశ్వరుడు! సీన్ కట్ చేస్తే.. 26 ఏళ్లు తరువాత..
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
కొండచిలువ చుట్టేయడంతో ఊపిరాడక విలవిల్లాడిన సింహం.. వీడియో.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
90 లక్షల మందిని కట్టిపడేసిన గున్న ఏనుగు ప్రేమ.. వీడియో వైరల్.
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
రూ. 13 లక్షలతో సినిమా.. రూ. 1,647 కోట్లు కొల్లగొట్టింది.!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
స్పెర్మ్‌తో ఫేషియల్‌.! ఛీ ఛీ కాదు.. అసలు రహస్యం వేరే..!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
హనీమూన్‌ నుండి తిరిగి వస్తుండగా విషాదం.. కొత్త జంట మృతి.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!
చుట్టూ నీరు.. కొండ పైన స్వామి.! దర్శనం కోసం సాహసం చేయాల్సిందే.!