Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadrakali Temple: భద్రకాళీ దేవాలయం పునర్మిణానికి సర్వం సిద్ధం.. రాజగోపురం, మాడ వీధుల నమూనా రెడీ..

తెలంగాణ రాష్ట్రంలోని మరో ప్రముఖ ఆలయాన్ని పునర్మించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. ఉమ్మడి వరంగల్లు జిల్లాలోని భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని సరికొత్తగా నిర్మించడానికి సర్వం సిద్ధం అయింది. 

Bhadrakali Temple: భద్రకాళీ దేవాలయం పునర్మిణానికి సర్వం సిద్ధం.. రాజగోపురం, మాడ వీధుల నమూనా రెడీ..
Bhadrakali Temple
Follow us
Surya Kala

|

Updated on: May 25, 2023 | 10:53 AM

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను అభివృద్ధి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యాదగిరి గుట్టలోని శ్రీ లక్మి నరసింహ స్వామి ఆలయాన్నీ వైభవంగా పునర్మించగా తాజాగా మరో ప్రముఖ ఆలయాన్ని పునర్మించే దిశగా అడుగులు వేస్తోంది తెలంగాణ సర్కార్. ఉమ్మడి వరంగల్లు జిల్లాలోని భద్రకాళీ చెరువు తీరాన గుట్టల మధ్య ప్రకృతి శోభతో ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని సరికొత్తగా నిర్మించడానికి సర్వం సిద్ధం అయింది.

వేంగీ చాళుక్యులపైన విజయం సాధించటానికి పశ్చిమ చాళుక్య ప్రభువైన రెండవ పులకేశి భద్రకాళి  ఆలయాన్ని నిర్మించి, అమ్మవారిని ఆరాధించినట్లు చెబుతారు. అయితే ఇప్పుడు ఈ ఆలయానికి సీఎం కేసీఆర్ సరికొత్త రూపురేఖలను తీసుకుని రావాలని ఆలయ అభివృద్ధికి నిధులను మంజూరు చేశారు.

శ్రీ భద్రకాళి మాడవీదులు, రాజగోపురం నమూనాకు చెందిన ఎక్స్యూవీవ్ ఫోటోలు టీవీ9 చేతికి అందాయి.  తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద రాజగోపురం, భద్రకాళి మాడ వీధుల నిర్మాణానికి సర్వం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ అధికారులు రాజగోపురం, మాడ వీధుల నమూనా సిద్ధం చేశారు. ప్రభుత్వం కేటాయించిన రూ.30 కోట్ల రూపాయల నిధులతో మాడ వీధులను నిర్మాణం చేయనున్నారు. ఈ మేరకు మాడ వీధుల నిర్మాణం కు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ భద్రకాళి అమ్మవారి విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు 9 అడుగుల వెడల్పుతో కన్నుల పండువుగా భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారు 8 చేతులతో భక్తులను కటాక్షిస్తూ కనిపిస్తుంది. కుడివైపు ఉన్న 4 చేతులలో ఖడ్గము, ఛురిక, జపమాల, డమరుకం ఉంటాయి. ఎడమవైపున ఉన్న 4 చేతులలో ఘంట, త్రిశూలం, ఛిన్నమస్తకం, పానపాత్రలు ఉంటాయి. అమ్మవారు పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనం ఇస్తుంది.

ఆషాఢమాసంలో పౌర్ణమినాడు అమ్మవారిని “శాకంభరి”గా రకరకాల కూరగాయలతో అలంకరిస్తారు. ఆశ్వయుజ మాసంలో దసరా శరన్నవరాత్రులు, చైత్రమాసంలో వసంతరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతాయి.  ప్రతి సంవత్సరం శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున రాత్రి అమ్మవారు శ్రీకృష్ణుడి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..