Astro Tips: దంపతుల మధ్య గొడవలా.. కుజ దోష నివారణకు మంగళవారం ఈ పరిహారాలు చేసి చూడండి..
అంగారకుడు నీచ స్థితిలో ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాదు దంపతుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. అయితే కుజ ప్రభావాన్ని తగ్గించడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక చర్యలు ఉన్నాయి. వీటిని పాటించడం వలన జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది.
ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒడిదుడుకులకు అతని జాతకంలోని గ్రహాలు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. గ్రహాల చెడు స్థితిలో ఉంటే అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి. జాతకంలో కుజుడు తనదైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాడు. అంగారకుడిని ఇతర గ్రహాల కమాండర్ అని అంటారు. ఈ గ్రహం సంబంధాల కారకంగా పరిగణించబడుతుంది. ఎవరి జాతకంలోనైనా కుజుడు స్థానం బాగాలేకపోతే జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుజుడు బలంగా ఉన్న వారి జీవితం సంతోషం ఉంటుంది. అంగారకుడు నీచ స్థితిలో ఉంటే వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేకాదు దంపతుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. అయితే కుజ ప్రభావాన్ని తగ్గించడానికి జ్యోతిషశాస్త్రంలో అనేక చర్యలు ఉన్నాయి. వీటిని పాటించడం వలన జాతకంలో కుజుడు స్థానం బలపడుతుంది.
అంగారకుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తులు మంగళ దోషాన్ని కలిగి ఉంటారు. అలాంటి వారి పెళ్లిలో చాలా సమస్యలు ఏర్పడతాయి. చాలా సార్లు పెళ్లి కుదిరిన తర్వాత కూడా చెడిపోతుంది. వైవాహిక జీవితంలో సంతోషం ఉండదు. చిన్న చిన్న విషయాలకే భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి. కుజుడు బలహీనంగా ఉన్న వ్యక్తులకు కోపం ఎక్కువగా ఉంటుంది. కోపం వల్ల తనకు తానే హాని చేసుకుంటాడు. మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే.. ఆ దోషాన్ని తొలగించడానికి ఖచ్చితంగా ఈ నివారణ చర్యలను చేసి చూడండి..
- మంగళవారం రోజున బెల్లం ఆహారాన్ని కలిపి ఆవుకు తినిపించండి. ఇలా చేయడం వలన మంగళ దోషం తొలగిపోవడమే కాకుండా వ్యాపారంలో పురోగతికి బాటలు పడుతుంది.
- కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి మంగళవారం పూజ గదిలో పెట్టండి. లేదా నదిలో విడిచిపెట్టండి. ఈ పరిహారాన్ని 7 మంగళవారాలు నిరంతరం చేయండి.
- కోతులను హనుమంతుడు సేన అంటారు. కోతులకు మంగళవారం పప్పు, అరటిపండు తినిపించండి. ఆవును సేవించడం వల్ల కుజుడు కూడా బలవంతుడు అవుతాడు.
- 21 మంగళవారాలు హనుమంతుడి ఆలయాన్ని సందర్శించండి, బూందీ లడ్డూలు, శెనగలు, బెల్లం తో దేవునికి నైవేద్యాన్ని సమర్పించి, ఆపై ఆ నైవేద్యాన్ని కోతులకు తినిపించండి. దీంతో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది.
- మంగళ దోషం కారణంగా కుటుంబంలో ఇబ్బందులు తలెత్తాయి. అందుకే ప్రతి మంగళవారం అన్నయ్యకు మిఠాయిలు తినిపించి ఆయన ఆశీర్వాదం తీసుకోండి. దీంతో సంతోషం, శాంతి కలుగుతుంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..