Tuesday Puja: ఈ రోజు హనుమంతుడిని పూజించడం అత్యంత ఫలప్రదం.. కష్టాల నుంచి విముక్తి పొందడానికి పరిహారాలు ఏమిటంటే..

మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతుడిని ఆరాధించడం ద్వారా త్వరగా సంతోషిస్తాడని, ప్రత్యేక అనుగ్రహం భక్తులకు ఇస్తాడని నమ్ముతారు. జేష్ఠ మంగళవారం రోజున బజరంగబలిని పూజించడం ద్వారా, సాధకుడు ఆనందం, శ్రేయస్సు పొందుతాడు. దీంతో పాటు జీవితంలో వచ్చే సమస్యలు సులభంగా తొలగిపోతాయి.

Tuesday Puja: ఈ రోజు హనుమంతుడిని పూజించడం అత్యంత ఫలప్రదం.. కష్టాల నుంచి విముక్తి పొందడానికి పరిహారాలు ఏమిటంటే..
శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం సూర్యాస్తమయం తర్వాత హనుమంతుడిని పూజించండి. హనుమంతదేవుని పూజలో దీపం వెలిగించవచ్చు. అయితే ఆ దీపంలో నల్ల నువ్వుల నూనె ఉపయోగించండి.
Follow us

|

Updated on: May 23, 2023 | 7:35 AM

హిందూ మతం నమ్మకం ప్రకారం హనుమంతుడిని పూజిస్తే అన్ని కష్టాలు తీరతాయని.. బాధల నుండి ఉపశమనం పొందుతారని నమ్మకం. అంతేకాదు కోరికలు త్వరగా నెరవేరుతాయని విశ్వాసం. అటువంటి పరిస్థితిలో హనుమంతుడిని పూజించడానికి మంగళవారం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. హనుమంతుడుని శ్రీరాముడు జ్యేష్ఠ మాసంలో కలిశాడని నమ్ముతారు. జ్యేష్ఠ మాసంలో హనుమంతుడిని ఆరాధించడం ద్వారా కష్టాల నుంచి విముక్తి పొందవచ్చని భక్తుల విశ్వాసం.

మంగళవారం ఉపవాసం ఉండి హనుమంతుడిని ఆరాధించడం ద్వారా త్వరగా సంతోషిస్తాడని, ప్రత్యేక అనుగ్రహం భక్తులకు ఇస్తాడని నమ్ముతారు. జేష్ఠ మంగళవారం రోజున బజరంగబలిని పూజించడం ద్వారా, సాధకుడు ఆనందం, శ్రేయస్సు పొందుతాడు. దీంతో పాటు జీవితంలో వచ్చే సమస్యలు సులభంగా తొలగిపోతాయి. బజరంగబలి అనుగ్రహం పొందడానికి ఈ రోజున తీసుకునే చర్యలు విశేష ప్రయోజనాలను ఇస్తాయని పురాణాల గ్రంధాలు పేర్కొన్నాయి.

మంగళవారం హనుమంతికి చేసే పరిహారాలు 

ఇవి కూడా చదవండి

జేష్ఠ మాసం మంగళవారం మహాపర్వ సందర్భంగా ఆంజనేయస్వామి అనుగ్రహం పొందడానికి, శరీరం,  మనస్సులో ఎటువంటి ఆలోచనలు లేకుండా స్వచ్ఛంగా చేసుకుని పూజామోదలు పెట్టాలి. ఎరుపు రంగు ఉన్ని ఆసనంపై కూర్చుని  7 సార్లు హనుమాన్ చాలీసాను పఠించండి.

మంగళవారం హనుమంతుని పూజించే ఈ పరిహారం చేయడం ద్వారా, ప్రజలు వీలైనంత త్వరగా  అనుగ్రహాన్ని పొందుతారని నమ్ముతారు.

ఈ రోజు హనుమంతుడికి సింధూరం, ఎర్రటి వస్త్రాలు, ఎరుపు రంగు పండ్లను ప్రసాదంగా సమర్పించండి.

స్వచ్ఛమైన నెయ్యి దీపం వెలిగించిన తర్వాత బూందీ ప్రసాదాన్ని అందించండి. దీని తర్వాత సుందరకాండ పఠించండి.

హనుమంతుడికి ప్రత్యేక ఆశీర్వాదాలు పొందాలనుకుంటే పూజించే సమయంలో తమలపాకును సమర్పించండి. హిందూ మతం ప్రకారం ఆంజనేయస్వామి ఆరాధనలో తమలపాకులను సమర్పించడం వలన సుఖ సంతోషాలు వస్తాయని విశ్వాసం. ఆగిపోయిన పనులన్నీ ఎటువంటి ఆటంకం లేకుండా సమయానికి పూర్తవుతాయని నమ్మకం.

పూజించేటప్పుడు గుర్తుంచుకోవలసిన నియమాలు ఏమిటి?

  1. శరీరం, మనస్సు స్వచ్ఛం ఉంచుకోవాలి . ఈ రోజున బ్రహ్మచర్యాన్ని పూర్తిగా పాటించాలి.
  2. అంతే కాకుండా మంగళ పండుగ నాడు ఉపవాసం ఉండే వ్యక్తి తన మనస్సులో ఎలాంటి తప్పుడు ఆలోచనలను చేయరాదు. అలాగే మద్యం, మాసం వంటి వాటికీ దూరంగా ఉండాలి.
  3. హిందూ మత విశ్వాసాల ప్రకారం భక్తులు ఎల్లప్పుడూ  మంగళవారం హనుమంతుడి విగ్రహాన్ని పూజించాలి. కాగా కొందరు ఆంజనేయ చిత్రపటానికి పూజలు చేస్తున్నారు. ఇలా చేయడం మంచిది కాదు. అంతేకాదు హనుమంతుడు ఛాతీని చీల్చి ఉన్న ఫోటోలను పూజించవద్దు.
  4. మంగళవారం రోజున కోతులకు అరటిపండ్లు తినిపిస్తే బజరంగబలి అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. 21 అరటిపండ్లను తీసుకుని మంగళవారం బజరంగబలికి నైవేద్యంగా పెట్టి కోతులకు ప్రసాదంగా తినిపించండి.
  5. ఉద్యోగంలో జీతం లేదా ప్రమోషన్ పొందాలనుకుంటే.. ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత, హనుమంతుని ఆలయానికి వెళ్లి, హనుమంతుడి విగ్రహం నుండి సింధూరం తీసుకొని సీతమ్మ పాదాల వద్ద పూయండి. ఈ పని చేయడం మీ పురోగతికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు