Gayatri Jayanti 2023: గాయత్రీ జయంతి ఎప్పుడు, పూజ శుభ సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి

గాయత్రీ మాతను ఎవరైతే నియమ నిష్ఠలతో పూజిస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. అంతేకాదు గాయత్రీ జయంతి రోజున గాయత్రీ మంత్రాన్ని జపించడం అనేక ప్రయోజనాలును ఇస్తుంది.  ఈ ఏడాది గాయత్రి జయంతి ఎప్పుడు వస్తుంది? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

Gayatri Jayanti 2023: గాయత్రీ జయంతి ఎప్పుడు, పూజ శుభ సమయం, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి
Gayatri Jayanti
Follow us
Surya Kala

|

Updated on: May 21, 2023 | 12:59 PM

ప్రతి సంవత్సరం హిందువులు జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి గాయత్రి దేవి జన్మదినంగా జరుపుకుంటారు. హిందూ మత పరమైన దృక్కోణంలో గాయత్రీ జయంతికి ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున గాయత్రీ మాతను ఎవరైతే నియమ నిష్ఠలతో పూజిస్తారో వారికి సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్మకం. అంతేకాదు గాయత్రీ జయంతి రోజున గాయత్రీ మంత్రాన్ని జపించడం అనేక ప్రయోజనాలును ఇస్తుంది.  ఈ ఏడాది గాయత్రి జయంతి ఎప్పుడు వస్తుంది? దాని ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

గాయత్రి జయంతి తేదీ: హిందూ క్యాలెండర్ ప్రకారం జ్యేష్ట శుక్ల ఏకాదశినాడు హిందువులు గాయత్రీ జయంతిని ఘనంగా జరుపుకుంటారు. ఈ ఏడాది మే 31వ తేదీ బుధవారం గాయత్రి జయంతి. ఈ రోజున నిర్జల ఏకాదశి కూడా జరుపుకుంటారు. అయితే మే 30, 2023న మధ్యాహ్నం 01:07 నుండి పూజా సమయం ప్రారంభం కానుంది.  ఇది మరుసటి రోజు అంటే మే 31, 2023 మధ్యాహ్నం 01:45 గంటలకు ముగుస్తుంది. హిందూ మత విశ్వాసం ప్రకారం గాయత్రీ జయంతి రోజున గాయత్రీ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. ఇలా చేయడం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, సంపద లభిస్తాయి. మీరు మీ లక్ష్యాన్ని సులభంగా సాధిస్తారు.

గాయత్రీ జయంతి ప్రాముఖ్యత: సనాతన సంప్రదాయం ప్రకారం గాయత్రి అమ్మవారు నాలుగు వేదాలకు మూలంగా పరిగణించబడుతుంది. గాయత్రీ అమ్మవారు..  సరస్వతి, లక్ష్మి, కాళీ మాతకు చిహ్నంగా పరిగణిస్తారు. వేదాలు గాయత్రీ దేవి నుంచి  ఉద్భవించాయి. కనుక ఆమెను వేదమాత అని కూడా అంటారు. సనాతన ధర్మంలో వేదాల ప్రాముఖ్యత గురించి చెప్పబడింది. ఎల్లప్పుడైనా మానసికంగా ఇబ్బంది పడుతున్నా, మీ కెరీర్‌లో గొప్ప విజయాలు సాధించాలనుకున్నా నిజమైన హృదయంతో గాయత్రిని పూజించండి. అమ్మవారిని ధ్యానం చేయండి. ఇలా చేయడం వలన మీ పనులన్నీ పూర్తవుతాయి.

ఇవి కూడా చదవండి

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..