Astro Tips: మీ గురించి మీరే చెడుగా ఆలోచిస్తున్నారా.. ఒకొక్క ఆలోచనకు ఒకొక్క గ్రహం వ్యతిరేక ఫలితానిస్తుందని తెలుసా..!

పురాణ గ్రంధాల ప్రకారం ప్రతికూలంగా మాట్లాడడం, ఈ చెడు ఆలోచనలను చేయడం వల్ల మనకు మనమే హాని చేసుకుంటాము. ఎందుకంటే ఈ ప్రతికూల పదాలు పరోక్షంగా వ్యక్తి జాతకంలో ఉన్న వివిధ గ్రహాల ప్రభావాలను ప్రతికూలంగా చేస్తాయని పేర్కొన్నారు. 

Astro Tips: మీ గురించి మీరే చెడుగా ఆలోచిస్తున్నారా.. ఒకొక్క ఆలోచనకు ఒకొక్క గ్రహం వ్యతిరేక ఫలితానిస్తుందని తెలుసా..!
Astro Tips In Telugu
Follow us

|

Updated on: May 22, 2023 | 8:23 AM

ఎవరైనా ఏదైనా కారణాల వల్ల నిరాశకు గురైనప్పుడు.. వారు తమ మనస్సులో ప్రతికూల ఆలోచనలను చేయడం మొదలు పెడతారు. కోపంలో ఉన్న సమయంలో ఒకొక్కసారి మనం మన గురించి తక్కువ చేసుకుంటూ లేదా ఇతరుల గురించి తప్పుగా మాట్లాడుతాము. అయితే ఇలా మనం తరచుగా చెప్పే ఈ మాటలు నిజమవుతాయి లేదా ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటాయి. పురాణ గ్రంధాల ప్రకారం ప్రతికూలంగా మాట్లాడడం, ఈ చెడు ఆలోచనలను చేయడం వల్ల మనకు మనమే హాని చేసుకుంటాము. ఎందుకంటే ఈ ప్రతికూల పదాలు పరోక్షంగా వ్యక్తి జాతకంలో ఉన్న వివిధ గ్రహాల ప్రభావాలను ప్రతికూలంగా చేస్తాయని పేర్కొన్నారు.

1 పురాణాల గ్రంధాల ప్రకారం ఒకరు తన గురించి పదేపదే చెడుగా మాట్లాడుకోవడం లేదా ప్రతికూలంగా ఆలోచించడం మానుకోవాలి. తన గురించి తానే చెడు ఆలోచనలు కలిగి ఉండటం వల్ల సూర్యుని దోషం పెరుగుతుంది. అంతేకాదు జీవితంలో చాలా సమస్యలు మొదలయ్యాయి. ఈ సమస్య నుండి బయటపడాలంటే సూర్య దర్శనం చేసుకోండి. ఉదయం సూర్యకాంతిలో కొంత సమయం గడపండి. దీని ద్వారా ప్రయోజనం పొందండి. అంతేకాదు మీ గురించి అన్ని ప్రతికూల ఆలోచనలను విడిచి సంతోషముగా ఉండడానికి ప్రయాత్నించండి.

2జీవితంలోముందుకు సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా మనస్సులో చెడు మరియు హానికరమైన ఆలోచన కలుగుతుంది. ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు భవిష్యత్తు గురించి తెలియని భయం ఏర్పడుతుంది. ఈ భయం నిజమై నిలిస్తే.. ఆ దురదృష్టానికి గురవుతాడు. అలాంటి భయం మనస్సులో తలెత్తితే, చంద్రుని దుష్ప్రభావం పెరుగుతుంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ముందుగా మీ మనసును అదుపులో పెట్టుకోండి. శివుని పూజించడం వలన శుభఫలితాలను పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

3ఒక ఆలోచన మనస్సులో వేళ్ళూనుకున్నప్పుడు.. దాని గురించి ప్రతికూల ఆలోచనలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే వ్యక్తి క్రమంగా ఆ ప్రతికూల ఆలోచనలకుగురైతే.. క్రమంగా అతడు తన శక్తిని కోల్పోతూ ఉంటాడు. ఇటువంటి పరిస్థితిలో బుధుడు ప్రతికూల ప్రభావం చూపిస్తాడు. వినాయకుడిని పూజించి ధ్యానం చేస్తే ఫలితం ఉంటుంది.

4ఎవరితోనైనా చెడుగా మాట్లాడటం లేదా చెడుగా ఆలోచిస్తే.. పురాణాల గ్రంధాల ప్రకారం బృహస్పతి ప్రభావితమవుతాడు. ఫలితంగా ఇల్లు, కుటుంబం, స్నేహితులు, సమాజంలో ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇతరులు మీ నుండి దూరంగా వెళ్లడం ప్రారంభిస్తారు. కనుక ఎవరిని విమర్శించవద్దు.. అంతేకాదు శ్రీ మహా విష్ణువును పూజించడం వలన శుభఫలితాలు ఉంటాయి.

5చాలా సార్లు మనం ఒకరి మీద కోపాన్ని వేరొకరి పేరుతో వ్యక్తం చేస్తాం.. ఇలా చేయడం మంచిది కాదు.. శుక్రుడిపై ప్రభావం చూపిస్తుంది. ఫలితంగా, జీవితంలో సుఖ సంపదలు, సమాజంలో గౌరవం కోల్పోతారు. మీరు కనుక ఇలాంటి తప్పు చేస్తే.. దుర్గాదేవిని క్షమించమని కోరండి. పూజను నిర్వహించండి.

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..