Chandra Mangala Yoga: కర్కాటక రాశిలోకి చంద్ర గ్రహం.. వీరి మనసులో కోరికలు నెరవేరుతాయి..!
Zodiac Signs: ఈనెల 25న చంద్ర గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడంతో చంద్ర మంగళ యోగం చోటు చేసు కుంటుంది. కర్కాటక రాశిలో ఇదివరకే ప్రవేశించిన కుజగ్రహంతో చంద్రుడు కలవడం వల్ల ఈ చంద్రమంగళ యోగం ఏర్పడుతోంది. మనసుకు కారకుడైన చంద్రుడితో ఆశలు, ఆకాంక్షలకు కారకుడైన కుజ గ్రహం కలవడం వల్ల ప్రతి రాశి వారిలోనూ ఏదో విధంగా ఆశలు, ఆకాంక్షలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది.
Zodiac Signs: ఈనెల 25న చంద్ర గ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడంతో చంద్ర మంగళ యోగం చోటు చేసు కుంటుంది. కర్కాటక రాశిలో ఇదివరకే ప్రవేశించిన కుజగ్రహంతో చంద్రుడు కలవడం వల్ల ఈ చంద్రమంగళ యోగం ఏర్పడుతోంది. మనసుకు కారకుడైన చంద్రుడితో ఆశలు, ఆకాంక్షలకు కారకుడైన కుజ గ్రహం కలవడం వల్ల ప్రతి రాశి వారిలోనూ ఏదో విధంగా ఆశలు, ఆకాంక్షలు బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి గట్టి ప్రయత్నం కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు వివిధ రాశుల వారి మనసులోని కోరికలు నెరవేరటానికి అవకాశం ఉంటుంది. అంటే మనసులో డబ్బు ఉద్యోగం హోదా ప్రమోషన్ వగైరాలకు సంబంధించిన కోరికలను కోరుకోవడానికి అందుకు తగ్గట్టుగా ప్రయత్నాలు చేయటానికి ఇది అనుకూల సమయం అని కూడా చెప్పవచ్చు.
- మేష రాశి: ఈ రాశి వారికి నాలుగవ స్థానంలో చంద్రమంగళ యోగం చోటు చేసుకుంటున్నందువల్ల మనసు లోని కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో విజయం, ఉద్యోగంలో సానుకూల మార్పు, ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగటం వంటివి తప్పకుండా సఫలం అవుతాయి. జీవితంలో ఏదో విధంగా పైకి రావాలనే తపన పెరుగుతుంది. ముఖ్యంగా అదనపు ఆదాయానికి, ఆదాయం పెంచుకోవ డానికి గట్టి ప్రయత్నం ఆరంభం అవుతుంది. ముఖ్యంగా వృత్తి వ్యాపార రంగాల వారిలో అత్యాశ పెరిగే సూచనలు ఉన్నాయి. ఈ రాశి వారు ఎంత ప్రయత్నం చేసుకుంటే అంత మంచిది.
- వృషభ రాశి: ఈ రాశి వారిలో ఉన్నత స్థాయికి వెళ్లాలనే తపన పెరుగుతుంది. ఉద్యోగం ఆదాయానికి సంబం ధించి వీరు తమ కోర్కెలను సాధించుకోవడానికి ఇది అనుకూల సమయం. నిరుత్సాహపరిచే వారిని లెక్కచేయకుండా వీరు తమ ప్రయత్నా లను కొనసాగించడం మంచిది. వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరటానికి అవకాశం ఉంది. కొద్దిగా ధైర్యం, తెగింపు, చొరవ, ఆత్మవిశ్వాసం అవసరం అని అర్థం చేసుకోండి. మీ ప్రయత్నాలు విజయవంతం కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ సంబంధంగా సానుకూల మార్పులకు అవకాశం ఉంది.
- మిథున రాశి: ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఉన్న ఆకాంక్షలు, కోరికలు వారి ప్రయత్నం మేరకు నెరవేరటానికి అవకాశం ఉంది. ఏ చిన్న ప్రయత్నం చేసినప్పటికీ అది ఘనవిజయం సాధించే సూచనలు కనిపిస్తు న్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలలో అదనపు ఆదాయ ప్రయత్నాలలో విజయం సిద్ధించడం ఖాయం అని చెప్పవచ్చు. కొందరు మిత్రుల సహాయంతో మీ ఆకాంక్షలు నెరవేర వచ్చు. మొత్తం మీద ఆర్థిక సమస్యలు పరిష్కా రమై ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారే అవకాశం ఉంది.
- కర్కాటక రాశి: ఈ రాశిలో చంద్రమంగళ యోగం ఏర్పడుతు న్నందువల్ల ఈ రాశి వారు అదనపు ఆదాయాన్ని సునాయాసంగా సంపాదించడంతోపాటు రహస్యంగా దాచుకునే అవకాశం కూడా ఉంది. అతి ఎక్కువగా పొదుపు సూత్రాలను అనుస రించడం జరుగుతుంది. ఆర్థిక ప్రయత్నాలు కలిసి వస్తాయి. వృత్తి ఉద్యోగాలపరంగా ఆదాయం కలిసి వస్తుంది. అదృష్టం తలుపు తడుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. ఎంత పాజిటివ్ గా వ్యవహరిస్తే అంత మంచిది. మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి.
- సింహ రాశి: ఈ రాశి వారికి 12వ స్థానంలో చంద్రమంగళ యోగం జరుగుతున్నందువల్ల అదనపు ఆదాయ ప్రయత్నాలను ముమ్మరం చేయడంతో పాటు పిసినారి తనాన్ని కూడా వృద్ధి చేసుకొనే అవకాశం ఉంటుంది. సాధారణంగా డబ్బును రహస్యంగా దాచుకోవడం కూడా జరుగుతుంది. ఉద్యోగపరంగా తప్పకుండా దూర ప్రాంతంలో మంచి ఉద్యోగం లభించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ఎవరినైనా గుడ్డిగా నమ్మటం మంచిది కాదని, రహస్య శత్రువులు ఉంటారని గ్రహించడం చాలా అవసరం.
- కన్యా రాశి: ఈ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఆదాయ సంబంధమైన ఆకాంక్షలు తప్పకుండా నెరవేరవచ్చు. గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బును వసూలు చేసు కోవడం ప్రారంభిస్తారు. ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వడ్డీ వ్యాపారులు బాగా ప్రయోజనం పొందుతారు. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఇతరులకు ఆర్థికంగా సహాయ పడతారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా అదనపు ఆదాయానికి అనుకూలంగా మార్పులు జరిగే సూచనలు ఉన్నాయి.
- తులా రాశి: ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలలో అదృష్ట యోగం పడుతుంది. మనసులోని ఆర్థిక సంబం ధమైన కోరికలలో ఒకటి రెండు తప్పకుండా నెరవేరుతాయి. ఉద్యోగ సంబంధంగా మంచి మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో మంచి ఆదాయంతో కూడిన ప్రమోషన్ లభించవచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా మారుతుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలు కలసి వస్తాయి. అయితే, ఆర్థిక బాధ్యతలను ఇతరులకు అప్పగించకపోవడం మంచిది.
- వృశ్చిక రాశి: ఈ రాశి వారికి కొద్ది ప్రయత్నంతో ఆర్థిక పరిస్థి తుల్లో ఎదుగుదల మెరుగుదల కనిపిస్తాయి. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. డబ్బు పరంగా మనసులో ఉన్న కోరికలు ఒకటి రెండు నెరవేరి సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపారాల వారు లాభాల విషయంలో పురోగతి సాధిస్తారు. ఈ రాశి వారు పాజిటివ్ గా వ్యవహరిస్తూ తమ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. ఆర్థికంగా ఇది వీరికి చాలావరకు అనుకూల సమయం.
- ధనుస్సు రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా పురోగతి చెందటానికి మార్గం సుగమం అవుతుంది. వీరు తమ ప్రయత్నాలను కొనసాగించడం మంచిది. వృత్తి ఉద్యోగాల పరంగా ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ధన లాభం విషయంలో ఈ రాశి వారి మనసులో ఉన్న కోరికలు నెరవేరే అవకాశం ఉంది. పొరపాటున కూడా నెగిటివ్ ఆలోచనలు చేయవద్దు. ఎంత పాజిటివ్ గా ఆలోచిస్తే అంతగా సత్ఫలితాలు అనుభవానికి వస్తాయి. మీ రహస్యాలను ఎవరితోనూ పంచుకోకపోవడం మంచిది. మనసులోని కోరికలు తగ్గట్టుగా సొంత ప్రయత్నాలు చేయవలసిన అవసరం ఉంది.
- మకర రాశి: ఈ రాశి వారికి అనుకోకుండా అప్రయత్నంగా డబ్బు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ పరంగా ఆదాయపరంగా మనసులో ఉన్న కోరికలు నెరవేరవచ్చు. ఈ రాశి వారికి సప్తమ కేంద్రంలో చంద్రమంగళ యోగం చోటు చేసుకుంటున్నందువల్ల కోర్టు కేసు ఒకటి సానుకూలంగా పరిష్కారమై ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తి మీ పరం అయ్యే సూచనలు కూడా ఉన్నాయి. మనసులోని డబ్బు సంబంధమైన కోరికలు తప్పకుండా నెరవేరటానికి అవకాశం ఉంది. ఈ విషయంలో చాలావరకు పాజిటివ్ గా ఉండటం మంచిది. సమయం అనుకూలంగా ఉంది.
- కుంభ రాశి: ఈ రాశి వారు ఉద్యోగం మారడం కోసం చేస్తున్న ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. పొదుపు సూత్రాలు పాటి స్తారు. కొద్ది ప్రయత్నంతో ఒకటి రెండు ప్రధాన మైన ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రస్తుతానికి వీరి ప్రధాన సమస్య ఉద్యోగంలో మార్పే కనుక అది 25 తరువాత తప్పకుండా సానుకూలపడుతుంది. ఆర్థిక పరిస్థితి కూడా ఆశాజనకంగా ఉంటుంది. కొందరికి ఆర్థికంగా సహాయపడాలన్న కోరిక నెరవేరటానికి అవకాశం ఉంది. ఆర్థికంగా తప్పకుండా స్థిరత్వం లభిస్తుంది.
- మీన రాశి: ఉద్యోగం, ఆదాయం, విదేశీ యానం వంటి విషయాలలో వీరి మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. పాజిటివ్ గా ఆలోచించడం, సరైన నిర్ణయాలు తీసుకో వడం, వాటిని సమర్థంగా అమలు చేయడం ప్రారంభం అవుతుంది. వీటివల్ల మున్ముందు అనేక ఆకాంక్షలు ఆశలు నెరవేరటం జరుగు తుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారా లతో ఈ రాశి వారి ఆకాంక్షలు తప్పకుండా సఫలం అవుతాయి. సంతానం విషయంలో కూడా వీరి ఆశలు ఆశయాలు సత్ఫలితాలను ఇస్తాయి. కొద్దిపాటి ప్రయత్నం చేయండి మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..