Horoscope Today (27th May): మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త.. 12 రాశుల వారికి శనివారం దినఫలాలు..
Horoscope Today (27 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి శనివారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Horoscope Today (27 మే 2023): సాధారణంగా చాలామందికి తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తి ఉంటుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా విశ్వసించే విధానం జ్యోతిష్యం. రాశుల గ్రహ స్థితిగతులను లెక్కించి ఆ వ్యక్తుల భవిష్యత్తు ఎలా ఉండబోతుందని జ్యోతిష్య పండితులు లెక్కిస్తారు. అయితే, 12 రాశుల వారికి శనివారం దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
- మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఉద్యోగ పరంగా శుభవార్త అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా ముందడుగు వేస్తారు. కొందరు స్నేహితులకు సహాయం చేస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం ఖాయం అవుతుంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందు తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం మానసికంగా ఒత్తిడి చేస్తుంది. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. అనారోగ్యం నుంచి బయటపడతారు. డబ్బు జాగ్రత్త.
- వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఆర్థిక ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఎవరికీ అప్పులు ఇవ్వటం కానీ, తీసుకోవటం కానీ చేయవద్దు. ఉద్యోగంలో అధికారులు మీ ప్రతిభను గుర్తించి అదనపు బాధ్యతలు అప్పగించడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. మంచి చోట పెళ్లి సంబంధం కుదిరే సూచనలున్నాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీ నుంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలిస్తుంది.
- మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ధన లాభానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఐటి తదితర నిపుణులు ప్రమోషన్లు అందుకుంటారు. అనారోగ్యం నుంచి చాలావరకు ఉపశమనం లభిస్తుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. ఉద్యోగంలో అదనపు బాధ్యతలను స్వీకరించడం జరుగుతుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. శుభవార్తలు వింటారు.
- కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): అవసరానికి తగినట్టుగా చేతికి డబ్బు అందుతుంది. రుణ సమస్య చాలావరకు తగ్గుతుంది. సన్నిహితుల సహాయంతో ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా లక్ష్యాలను పూర్తి చేస్తారు. పెళ్లి ప్రయత్నాలలో కొన్ని చికాకులు ఎదురవుతాయి. ముఖ్యమైన ప్రయత్నాలు కొన్ని వెనక్కి వెళతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది. అనవసర ఖర్చులకు కళ్లెం వేయాల్సి ఉంటుంది.
- సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ప్రతి పనికి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. ఉద్యోగంలో అధికారుల నుంచి అసంతృప్తిని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఐటీ రంగానికి చెందిన వారికి మంచి ఆఫర్లు వచ్చే సూచనలు ఉన్నాయి. మనసు లోని కోరిక ఒకటి అనుకోకుండా నెరవేరుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్డు ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా నిరుత్సాహం చెందడం జరుగుతుంది.
- కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టు కోవద్దు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఆశించిన లక్ష్యాలను శ్రద్ధగా పూర్తి చేస్తారు. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. కొన్నిప్రయత్నాలు బె డిసి కొట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రేమ వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. బంధుమిత్రుల నుంచి ఆర్థిక సహాయానికి ఒత్తిడి ఉంటుంది.
- తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): ఆర్థికంగా బాగానే ఉంటుంది కానీ ఖర్చులు పెరిగి ఇబ్బంది పడతారు. తిప్పట, శ్రమ తప్పవు. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. పట్టుదలగా లక్ష్యాలు పూర్తి చేస్తారు. కొత్త ఉద్యోగం ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కొద్దిగా అసంతృప్తి కలిగిస్తాయి.
- వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ): బంధుమిత్రుల సహాయంతో ఓ ముఖ్యమైన సమస్య నుంచి బయటపడతారు. ఆర్థికంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది. మంచి ఉద్యోగానికి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు వెళతాయి. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడతాయి.
- ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): అధికార యోగానికి అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు మంచి ఫలితాలను ఇస్తాయి. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే సూచనలు ఉన్నాయి. బందు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. పిల్లల నుంచి శుభవార్త వింటారు.
- మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2): వృత్తి వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలను గడించడం జరుగుతుంది.ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేస్తారు. తల్లితండ్రుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులకు మంచి సలహాలు ఇస్తారు. మీ మాటకు సమాజంలో విలువ పెరుగుతుంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు. సన్నిహితులు అండగా నిలబడతారు.
- కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): అనుకోకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఒక మెట్టు పైకి ఎక్కడానికి అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు సరైన గుర్తింపు లభిస్తుంది. విపరీతంగా ఒత్తిడి ఉన్నా పట్టుదలగా లక్ష్యాలను పూర్తి చేస్తారు. అనారోగ్యం నుంచి చాలావరకు బయటపడతారు. ఒకటి రెండు శుభవార్తలు మీ చెవిన పడే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బంది పడతారు. ప్రేమ వ్యవహారాలు నిలకడగా ఉంటాయి.
- మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఉద్యోగ పరంగా బాగా ఒత్తిడి ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు నిలకడగా ఉంటాయి. ఖర్చుల్ని తగ్గించుకుంటారు. బంధుమిత్రుల కారణంగా ఒకటి రెండు చికాకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. సన్నిహితుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. మీకు డబ్బు ఇవ్వాల్సిన వాళ్ళు తీసుకువచ్చి ఇస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..