Venus Transit 2023: కర్కాటక రాశిలోకి శుక్ర గ్రహం.. వారి జీవితంలో నమ్మలేనన్ని సానుకూల మార్పులు
ఈ నెల 31వ తేదీన శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి మారుతోంది. కర్కాటక రాశిలో శుక్రుడు జులై ఆరవ తేదీ వరకు సంచరించడం జరుగుతుంది. శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం అన్నది కుటుంబ పరంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించినప్పుడు కుటుంబ పరంగా కొన్ని సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి.
Shukra Gochar 2023: ఈ నెల 31వ తేదీన శుక్ర గ్రహం కర్కాటక రాశిలోకి మారుతోంది. కర్కాటక రాశిలో శుక్రుడు జులై ఆరవ తేదీ వరకు సంచరించడం జరుగుతుంది. శుక్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించడం అన్నది కుటుంబ పరంగా ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. చంద్రుడికి సంబంధించిన కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించినప్పుడు కుటుంబ పరంగా కొన్ని సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా శుభకార్యాలు జరగటం, కుటుంబంలో సామరస్యం పెరగటం, ఏవైనా సమస్యలు, మనస్పర్ధలు, అపార్ధాలు ఉన్న పక్షంలో అవి తొలగిపోవడం, పిల్లలు వృద్ధిలోకి రావడం, కుటుంబ పరంగా శుభవార్తలు వినటం వంటివి తప్పకుండా జరుగుతాయి. వ్యక్తిగత జాతకాలను బట్టి ఈ సానుకూల పరిణామాలలో కొద్దిగా హెచ్చుతగ్గులు ఉంటే ఉండవచ్చు. కానీ తప్పకుండా ఒకటి రెండు మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. శుక్ర గ్రహం రాశి మార్పు ఏ రాశుల వారికి ఏ విధంగా శుభవార్తలు మోసుకు వస్తుందో ఇక్కడ పరిశీలిద్దాం.
- మేష రాశి: ఈ రాశి వారికి కుటుంబంలో వివిధ కారణాలవల్ల సుఖసంతోషాలు వెళ్లి విరిసే అవకాశం ఉంది. సంతానంలో ఎవరికైనా పెళ్లి సంబంధం కుదరటం, లేదా మంచి ఉద్యోగం రావడం వంటివి జరిగే అవకాశం ఉంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినే సూచనలు కూడా ఉన్నాయి. ఆదాయం పెరగటానికి, ఆస్తి కలసి రావడానికి, ఇల్లు కొనడానికి కూడా అవకాశం ఉంది. మొత్తానికి ఈ రాశి వారికి ఇది సెలబ్రేషన్ టైం అని చెప్పవచ్చు.
- వృషభ రాశి: కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ రాశి వారికి తప్పకుండా ఒకటి రెండు శుభవార్తలు చెవిన పడే అవకాశం ఉంది. ఒక శుభకార్యం జరిగే సూచనలు ఉన్నాయి. తీర్థ యాత్రలు లేదా విహార యాత్రలకు వెళ్లడం జరుగుతుంది. వాహనం కొనే అవకాశం కూడా ఉంది. కుటుం బంలో ఎవరికైనా మంచి ఉద్యోగం లభించడం లేదా సంతానం కలగటం లేదా మరి ఏదైనా శుభ పరిణామం చోటు చేసుకోవడం వంటివి జరుగుతాయి. మొత్తం మీద కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి.
- మిథున రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి రావడం వల్ల ఇంట్లో వేడుకలు జరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధన లాభం, ఆస్తి కలిసి రావడం, కోర్టు కేసులో విజయం సాధించడం, పెళ్లి సంబంధం కుదరటం, ఉద్యోగంలో ప్రమోషన్ రావడం వంటివి ఏవైనా జరగవచ్చు. అకస్మాత్తుగా కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు చోటు చేసుకోవడం వల్ల కుటుంబ సభ్యులు విందుల్లో మునిగి తేలే అవకాశం ఉంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి కి సంబంధించి ఒక శుభ పరిణామం సంభవించవచ్చు.
- కర్కాటక రాశి: ఈ రాశి వారి జీవితంలో ఒక్కసారిగా సానుకూల మార్పు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఉద్యోగంలో పైకి ఎదగటం, ఆశించిన మార్పులు చోటు చేసుకోవడం, మంచి కంపెనీలో ఉద్యోగం లభించడం, విదేశీ ఉద్యోగానికి ఆఫర్ రావటం, మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం కుదరటం వంటివి తప్పకుండా జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరికి ఉన్నత విద్యకు లేదా మంచి ఉద్యోగానికి అవకాశం లభించడం కూడా జరగవచ్చు. ఆరోగ్యం కుదుటపడే అవకాశం కూడా ఉంది.
- సింహ రాశి: సింహరాశి వారి జీవితంలో తప్పకుండా ఆర్థిక స్థితి బాగా మెరుగుపడే అవకాశం ఉంది. ప్రధానంగా ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, ఆదాయపరంగా అభివృద్ధి చెందటం, శుభకార్యాలు జరగటం వంటి విషయాల వల్ల కుటుంబాన్ని ఆనందోత్సాహాలు ముంచెత్తుతాయి. సంతాన యోగానికి కూడా అవకాశం ఉంది. విదేశీ యానానికి సంబంధించి శుభవార్త వింటారు. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటమే ఈ రాశి వారికి జరగబోయే మంచి కార్యక్రమం అని చెప్పవచ్చు.
- కన్యా రాశి: ఈ రాశి వారికి ఆదాయంలో పెరుగుదల వల్ల, మంచి ఉద్యోగంలోకి మారడం వల్ల కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. పెళ్లి సంబంధం కుదరటం లేదా ఆస్తి విలువ పెరగటం లేదా ఇల్లు కొనడం వంటివి చోటు చేసుకుంటాయి. పిల్లలు ఆశించిన దాని కంటే ఎక్కువగా పురోగతి సాధించడం జరుగుతుంది. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా రుణ సమస్యలు లేదా ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి.
- తులా రాశి: ఈ రాశి వారికి ఉద్యోగం, వృత్తి, వ్యాపారాలలో ఊహించని విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. సంతాన యోగానికి సంబంధించి శుభవార్త వినటం జరుగుతుంది. ప్రమోషన్ లభించడానికి అవకాశం ఉంది. వృత్తిపరంగా విదేశాలకు వెళ్ళవలసి వస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. తల్లిదండ్రుల నుంచి ఆస్తి కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులు లేదా బంధువులు లేదా జీవిత భాగస్వామితో సయోధ్య సామరస్యం ఏర్పడే సూచనలు ఉన్నాయి.
- వృశ్చిక రాశి: జీవిత భాగస్వామి తరఫు నుంచి ఆస్తి కలసి రావడం, జీవిత భాగస్వామికి ప్రమోషన్ రావటం, అనారోగ్యం నుంచి కోలుకోవడం, ఇష్టమైన ప్రాంతానికి బదిలీ కావడం, కోర్టు కేసు సానుకూలంగా పరిష్కారం కావడం, ఇష్టం లేని వ్యక్తి నుంచి విడాకులు మంజూరు కావడం వంటివి జరిగే సూచనలు ఉన్నాయి. వీటి వల్ల కుటుంబంలో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ముఖ్యంగా ఇల్లు లేదా వాహనం కొనుగోలుకు అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన శుభవార్త వినడం జరుగుతుంది.
- ధనుస్సు రాశి: ఈ రాశి వారు భారీ వేతనాలతో వేరే ఉద్యోగానికి మారే అవకాశం ఉంది. ఇది చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం కావడం వల్ల కుటుం బంలో సంతోషం ఏర్పడుతుంది. అంతేకాక, విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. సంతానంలో ఒకరు ఉద్యోగపరంగా స్థిరపడటం జరుగుతుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో చేరే సూచనలు ఉన్నాయి. శుభకార్యం ఒకటి జరగవచ్చు. దూరప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు.
- మకర రాశి: మంచి కుటుంబంలో పెళ్లి సంబంధం నిశ్చయం అవుతుంది. తప్పకుండా ఒకటి రెండు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. మంచి ఉద్యోగంలోకి మారడానికి చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అధికారం చేపట్టడానికి కూడా అవకాశం ఉంది. కొన్ని సంస్థల నుంచి ఆఫర్లు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినడం జరుగుతుంది. కుటుంబ సమేతంగా తీర్థయాత్ర లేదా వినోదయాత్రలకు వెళ్లడం జరుగుతుంది.
- కుంభ రాశి: కుంభ రాశి వారికి ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో భారీ మొత్తంలో ఇంక్రిమెంట్ కి అవకాశం ఉంది. వృత్తిలో సంపాదన పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాల శాతం మెరుగుపడే సూచనలు ఉన్నాయి. కుటుంబ జీవితంలో సామరస్య వాతావరణం ఏర్పడటం, ఆనందోత్సాహాలు వెల్లి విరియటం వంటివి జరుగుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలించవచ్చు. విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంది. బంధుమిత్రు లతో విందులు వినోదాలలో పాల్గొనడం జరుగుతుంది.
- మీన రాశి: ఈ రాశి వారికి ఆర్థికంగా స్థిరత్వం లభించడం వల్ల, ఉద్యోగ పరంగా అధికార యోగం పట్టడం వల్ల కుటుంబంలో సంతోష వాతావరణం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల జీవనశైలి మారిపోయే అవకాశం కూడా ఉంది. కొద్దికాలం పాటు విలాస జీవితం గడిపే సూచనలు ఉన్నాయి. వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. వృత్తి నిపుణులకు విదేశాల నుంచి కూడా ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులలో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే అవకాశం కూడా ఉంది.
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)
మరిన్ని జ్యోతిష్య కథనాలు చదవండి..