Saturday Astro Tips: శని దోష నివారణకు శనివారాల్లో 7 పరిహారాలు చేసి చూడండి.. లక్కీ మీ సొంతం
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే అతని జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరైనా శనీశ్వరుడికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. వాటిని వదిలించుకోవడానికి, శని అనుగ్రహాన్ని పొందడానికి క్రింద ఇవ్వబడిన సాధారణ సనాతన నివారణలను ప్రయత్నించండి.
గ్రహాల్లో ఒకటైన శనీశ్వరుడిని జ్యోతిషశాస్త్రంలో కర్మ ప్రదాత అని పిలుస్తారు, న్యాయాధిపతిగా అని పిలుస్తారు. ప్రతి వ్యక్తిని అతని పనుల ప్రకారం శిక్షిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో శనికి సంబంధించిన ఏదైనా దోషం ఉంటే అతని జీవితంలో అన్ని రకాల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఎవరైనా శనీశ్వరుడికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే.. వాటిని వదిలించుకోవడానికి, శని అనుగ్రహాన్ని పొందడానికి క్రింద ఇవ్వబడిన సాధారణ సనాతన నివారణలను ప్రయత్నించండి.
- శనివారం నాడు శనీశ్వరుడు అనుగ్రహించాలంటే అతను రావి చెట్టుని పూజించాలి. సేవించాలి. హిందూ విశ్వాసం ప్రకారం శనివారం రోజున రావి చెట్టుకు నీటిని సమర్పించి సాయంత్రం ఆవనూనెతో దీపాన్ని వెలిగించడంపై శనీశ్వరుడు సంతోషిస్తాడు. ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు.
- హిందూ విశ్వాసం ప్రకారం శనీశ్వరుడికి సంబంధించిన దోషాలను తొలగించడానికి.. అతని అనుగ్రహాన్ని పొందడానికి, శివ, హనుమంతుడి ఆరాధన చాలా పవిత్రమైనది. ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.
- శనివారం ప్రత్యేక వ్యక్తికి కొన్ని వస్తువులను దానం చేయడం ద్వారా.. శని సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వికలాంగులకు శనివారం రోజున నల్ల గొడుగు, నల్లని చెప్పు, కిచడీ, తేయాకు తదితరాలను దానం చేస్తే శని దోషం తొలగిపోతుందని నమ్మకం.
- శనీశ్వరుడుకి సంబంధించిన అన్ని వస్తువులను దానం చేసినట్లే.. శనివారం శని దోష నివారణకు ఛాయ దానం గొప్పదని చెప్పబడింది. ఒక గిన్నెలో లేదా వెడల్పాటి పాత్రలో ఆవాల నూనె వేసి అందులో మీ ముఖాన్ని చూసి శనికి నీడను దానం చేస్తున్నట్లు ఆ నూనెను దానం చేయండి.
- హిందువుల విశ్వాసం ప్రకారం గోసేవ చేయడం వల్ల శనికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎవరి జాతకంలో శని దోషం ఉంటే.. మీరు దానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, మీరు ప్రతిరోజూ లేదా ముఖ్యంగా శనివారం నాడు నల్ల ఆవును పూజించి, సేవించాలి. శనికి సంబంధించిన సమస్యలను నివారించడానికి, నల్ల ఆవుకు ఆవనూనెతో రోటీని తినిపించాలి. వీలైతే నల్ల ఆవు పాలతో చేసిన నెయ్యి దీపాన్ని రోజూ పూజలో ఉపయోగించాలి.
- జాతకంలో శనికి సంబంధించిన దోషం తొలగిపోవాలంటే శనివారం నాడు నల్ల చీమలకు పిండి, పంచదార, నల్ల నువ్వులు కలిపి తినాలి. ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏలి నాటి శని దోష నివారణ జరుగుతుందని విశ్వాసం.
- శనీశ్వరుడుకి సంబంధించిన దోషం తొలగిపోవాలంటే శనివారం నాడు ఇంట్లో ఎలాంటి మురికిని ఉంచకూడదు. ఈ రోజున ఇంట్లోని చెత్తా చెదారం, విరిగిన, చెడు వస్తువులను తొలగించాలి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).