Kala Bhairav Puja: భయం, పనుల్లో అడ్డంకులు తొలగాలంటే కాలభైరవ పూజ ఏ రోజు చేయాలంటే..

సోమవారం శివయ్యను పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో.. అదే విధంగా ఆదివారం నాడు కాలభైరవుడిని పూజించడం వల్ల అనేక సమస్యలు తీరతాయని.. కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ రోజు కాల భైరవుడిని పూజించే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

Kala Bhairav Puja: భయం, పనుల్లో అడ్డంకులు తొలగాలంటే కాలభైరవ పూజ ఏ రోజు చేయాలంటే..
Kala Bhairava Puja
Follow us

|

Updated on: May 26, 2023 | 9:03 AM

హిందూ మతంతో ముడిపడి ఉన్న నమ్మకం ప్రకారం కాలభైరవుడు సాక్షాత్తు పరమ శివుడి అంశ. శివయ్య  రుద్ర అవతారం కాలభైరవుడు పరిగణించబడతాడు. దుష్టశిక్షకుడి గా, గ్రహపీడల్ని తొలగించే దేవుడిగా పూజలు అందుకుంటున్నా డు. అంతేకాదు కాల భైరవుడు రక్షణ, శిక్ష ఇచ్చే దేవుడని పురాణాలు పేర్కొన్నాయి. సోమవారం శివయ్యను పూజిస్తే ఎంత ఫలితం వస్తుందో.. అదే విధంగా ఆదివారం నాడు కాలభైరవుడిని పూజించడం వల్ల అనేక సమస్యలు తీరతాయని.. కోరిన కోర్కెలు నెరవేరుతాయని నమ్ముతారు. ఈ రోజు కాల భైరవుడిని పూజించే విధానం గురించి వివరంగా తెలుసుకుందాం.

వాస్తవానికి కాలభైరవుడు పూజించిన వెంటనే సంతోషించి  భక్తులపై అనుగ్రహం ఇచ్చే దైవంగా భావిస్తారు. అదే సమయంలో తప్పు చేసే వారికి శిక్ష ఇచ్చే దైవంగా పురాణాలు పేర్కొన్నాయి. అందుకనే అత్యంత భక్తి శ్రద్దలతో కాలభైరవ స్వామిని పూజిస్తారు. శివుని స్వరూపం కాబట్టి.. రుద్రుడి భృకుటిలోంచి పుట్టిన కాలభైరవ స్వామిని అనుగ్రహం శివయ్యను పూజించినా లభిస్తుంది.

భయాన్ని దూరం చేసే భైరవుడు  భైరవుడిని వారంలో ఏ రోజైనా ఎప్పుడైనా పూజించవచ్చు. అయితే ఆదివారం ప్రత్యేకంగా భైరవుడిని ఆరాధించడం కోసం అంకితం చేయబడింది. భైరవుడు శివుని రుద్ర అవతారంగా పరిగణించబడుతుంది.  భైరవుడిని ఆరాధించడం ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం, శివుని అగ్ని రూపమైన కాల భైరవుడిని పూజించడం ద్వారా భయం నశిస్తుంది. అంతేకాదు పనుల్లో ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయి.

ఇవి కూడా చదవండి

భైరవుడిని ఎప్పుడు పూజించాలి? భైరవుడిని పూజించడానికి రాత్రి సమయం అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో పూజలు చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయని నమ్ముతారు. అయితే, నియమ, నిబంధనల ప్రకారం మీ సౌలభ్యం ప్రకారం కాలభైరవుడిని ఎప్పుడైనా పూజించవచ్చు. అయితే ప్రదోష కాలంలో భైరవుని ఆరాధన కూడా చాలా పవిత్రమైనది, ఫలవంతమైనదిగా పరిగణించబడుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).

Latest Articles