Mumbai Indians: ముంబై ఖాతాలో ఈ ఐపీఎల్ టైటిల్ పడితే సరికొత్త చరిత్రే.. ట్రోఫీల సంఖ్య విషయంలో కానే కాదు..

IPL Final 2023, MI: ఐపీఎల్ 16వ సీజన్‌ ఆరంభంలో వరుస ఓటముల పాలైన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌కి ‘RCB vs GT డూ ఆర్ డై మ్యాచ్‌’లో బెంగళూరు టీమ్ ఓడిపోవడంతో నాల్గో జట్టుగా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లోకి..

Mumbai Indians: ముంబై ఖాతాలో ఈ ఐపీఎల్ టైటిల్ పడితే సరికొత్త చరిత్రే.. ట్రోఫీల సంఖ్య విషయంలో కానే కాదు..
Mumbai Indian 2023
Follow us

|

Updated on: May 25, 2023 | 5:54 PM

IPL Final 2023, MI: ఐపీఎల్ 16వ సీజన్‌ ఆరంభంలో వరుస ఓటముల పాలైన ముంబై ఇండియన్స్ ఆ తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. మరోవైపు ముంబై ఇండియన్స్‌కి ‘RCB vs GT డూ ఆర్ డై మ్యాచ్‌’లో బెంగళూరు టీమ్ ఓడిపోవడంతో నాల్గో జట్టుగా ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది. ఈ క్రమంలోనే తమ కంటే ముందుగా ప్లేఆఫ్స్‌కి వచ్చి మూడో స్థానంలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్‌ని ఎలిమినేటర్ మ్యాచ్‌లో మట్టికరిపించింది. దీంతో లక్నో టీమ్ ఇంటికి చేరింది. అయితే తొలి క్వాలిఫైయర్‌లో ధోని సేన చేతిలో ఓడిన గుజరాత్ టైటాన్స్‌తో ముంబై రెండో క్వాలిఫైయర్‌లో తలపడనుంది. ఆ మ్యాచ్‌లో కూడా గెలిస్తే ముంబై టీమ్ నేరుగా చెన్నై సూపర్ కింగ్స్‌తో మరోసారి ఐపీఎల్ ఫైనల్‌లో తలపడుతుంది. అసలు విషయం ఏమిటంటే.. చెన్నై టీమ్‌పై రోహిత్ సేన విజయం సాధించి టైటిల్ గెలిస్తే ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర నమోదు కావడం ఖాయం. కానీ అంది టైటిల్‌ నెగ్గే విషయంలో మాత్రం కానే కాదు.

అవును, ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లోకి నాల్గో జట్టుగా ప్రవేశించిన ముంబై ఇండియన్స్ ఈ ట్రోఫీ గెలిస్తే ఆరోసారి టైటిల్ గెలిచినట్లవుతుంది. ఇది ఐపీఎల్‌లో ఓ పెద్ద రికార్డు అయినప్పటికీ.. ముంబై ఇండియన్స్ కోసం వేరే రికార్డ్ ఒకటి వేచిచూస్తోంది. అదే.. ప్లేఆఫ్స్‌లో నాల్గో జట్టు టైటిల్ కొట్టడం. అవును, ఇప్పటివరకు జరిగిన 15 సీజన్ల ఐపీఎల్‌లో ప్లే ఆఫ్స్‌కు చేరిన నాల్గో జట్టు టైటిల్‌ నెగ్గిన దాఖలాలే లేవు. ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టు 3 సార్లు, రెండో జట్టు 7 సార్లు, మూడో జట్టు ఒక్క సారి టైటిల్‌ సాధించాయి.

ఈ క్రమంలో ప్లే ఆఫ్స్‌కు చేరిన మొదటి జట్టుగా మూడు సార్లు(2017, 2019, 2020) టైటిల్‌ సాధించిన ఘనత ముంబై ఇండియన్స్‌కే దక్కగా.. ప్లేఆఫ్స్‌కి చేరిన రెండో జట్టుగా  సీఎస్‌కే(2011, 2018, 2021) 3 సార్లు, కోల్‌కతా నైట్ రైడర్స్(2012, 2014) 2 సార్లు, ముంబై టీమ్ (2013, 2015) 2 సార్లు టైటిల్‌ సాధించాయి. అలాగే 2016 ఐపీఎల్ సీజన్‌లో మూడో జట్టుగా ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ఓ సారి టైటిల్ గెలుచుకుంది. ఇక ఈ సీజన్‌లో నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై ఒకవేళ టైటిల్‌ గెలిస్తే.. నాలుగో జట్టుగా ప్లే ఆఫ్స్‌లో ప్రవేశించి టైటిల్‌ నెగ్గిన తొలి జట్టుగా సరికొత్త చరిత్ర సృష్టించనుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, ముంబై ఇండియన్స్‌ శుక్రవారం జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. గుజరాత్‌ని ఓడిస్తే ఈ ఆదివారం జరిగే ఫైనల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో బరిలోకి దిగుతుంది. మరి ప్లేఆఫ్స్‌లోకి నాల్గో జట్టుగా ప్రవేశించి టైటిల్ కొట్టాలంటే.. ముంబై మరో రెండు మ్యాచ్‌లు గెలవారి. మరి గుజరాత్‌ను దాటి చెన్నై టీమ్‌పైకి ముంబై వెళ్తుందో లేదా క్వాలిఫయర్ మ్యాచ్‌లోనే ఇంటి బాట పడుతుందో తెలియాలంటే వేచి చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..