World Cup 2023: వరల్డ్‌ కప్‌-2023 షెడ్యూల్‌ వచ్చేసింది.. క్వాలిఫైయర్స్ కోసం ఏయే జట్లు తలపడుతున్నాయంటే..?

ICC World Cup 2023 Qualifiers: మెన్స్‌ వన్డే వరల్డ్‌కప్‌ 2023 క్వాలిఫయర్స్‌ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ క్వాలిఫైయర్స్ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననుండగా వాటిని  5-5 జట్లుగా రెండు గ్రూపులు..

World Cup 2023: వరల్డ్‌ కప్‌-2023 షెడ్యూల్‌ వచ్చేసింది.. క్వాలిఫైయర్స్ కోసం ఏయే జట్లు తలపడుతున్నాయంటే..?
Icc Men's Cricket World Cup Qualifier 2023
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 24, 2023 | 12:12 PM

ICC World Cup 2023 Qualifiers: మెన్స్‌ వన్డే వరల్డ్‌కప్‌ 2023 క్వాలిఫయర్స్‌ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం విడుదల చేసింది. జింబాబ్వే వేదికగా జరుగనున్న ఈ క్వాలిఫైయర్స్ టోర్నీ జూన్‌ 18 నుంచి జులై 9 వరకు జరుగనుంది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననుండగా వాటిని  5-5 జట్లుగా రెండు గ్రూపులు చేశారు. ఇక గ్రూప్‌-ఏలో జింబాబ్వే, వెస్టిండీస్‌, నెదార్లండ్స్‌, నేపాల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌.. అలాగే గ్రూప్‌-బిలో శ్రీలంక, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌, ఒమన్‌, యూఏఈ జట్లు ఉన్నాయి.

అయితే తొలి దశలో ప్రతి జట్టు తమ గ్రూప్‌లో మిగతా జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఈ క్రమంలో రెండు గ్రూప్‌ల్లో టాప్‌ 3 స్థానాల్లో నిలిచే జట్లు సూపర్ సిక్స్‌ దశకు అర్హత సాధిస్తాయి. ఈ దశలో ప్రతి జట్టు కూడా గ్రూప్‌ దశలో ఎదురుపడని జట్లతో తలపడతాయి. అయితే సూపర్ సిక్స్ దశకు చేరుకోవడంలో విఫలమైన జట్లపై సాధించిన పాయింట్లు మినహా, ప్రతి జట్టు గ్రూప్ దశలో సాధించిన పాయింట్లు సూపర్ సిక్స్ దశకు బదిలీ అవుతాయి. ఈ మ్యాచ్‌లు అయిపోయే సరికి టాప్‌ 2 ప్లేసెస్‌లో ఉన్న జట్లు భారత్‌ వేదికగా జరిగే ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్-2023కు అర్హత సాధిస్తాయి.

కాగా, భారత్‌ వేదికగా ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు 8 జట్లు నేరుగా అర్హత సాధించిన విషయం తెలిసిందే. అలా అర్హత సాధించన జట్లలో భారత్‌, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌, సౌతాఫ్రికా ఉన్నాయి. మరోవైపు ఈ మెగా టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే విడుదల చేసేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డిఫరెంట్ మూవీస్ చేస్తున్న విక్కీ కౌశల్
డిఫరెంట్ మూవీస్ చేస్తున్న విక్కీ కౌశల్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ !! ది రాజా సాబ్ నుంచి అప్డేట్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
NBK 109 టైటిల్.. అదేనా ?? సోషల్ మీడియా లో ఫుల్ ట్రెండ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
కోహ్లీ కమ్ బ్యాక్ ఖాయమన్న టీమిండియా మాజీ కోచ్
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
ఆరెంజ్‌ జ్యూస్‌ తెచ్చిన అదృష్టం.. ఏకంగా రూ. 2.10 కోట్లు !!
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
జిల్‌ బైడెన్‌ టీ పార్టీకి పిలిచినా రానన్న ట్రంప్‌ సతీమణి..
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
ఊహించామా..మంచినీళ్లు సైతం కొనుక్కుని తాగి మంచాన పడాల్సి వస్తుందని
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
దూకుడుగా క్రిప్టోకరెన్సీ.. బిట్‌కాయిన్‌ విలువ ఇన్ని లక్షలా ??
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు
కోల్‌కతా వైద్యురాలి కేసులో నిందితుడు. సంజయ్ రాయ్ సంచలన వ్యాఖ్యలు