Beetroot Juice: రక్తం పెరుగుతుందని బీట్‌రూట్ జ్యూస్ ఎక్కువగా తాగేస్తున్నారా..? మరి అది ఎంత ప్రమాదమో కూడా జర తెలుసుకోండి..

Beetroot Juice: బీట్‌రూట్ లేదా దాని రసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్‌లోని పలు రకాల విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక అద్భుతమైన పోషకాలే అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇంకా బీట్‌రూస్ రసం రక్తంపై సానుకూల ప్రభావాలను కలిగి, ఎర్ర రక్త కణాల..

Beetroot Juice: రక్తం పెరుగుతుందని బీట్‌రూట్ జ్యూస్ ఎక్కువగా తాగేస్తున్నారా..? మరి అది ఎంత ప్రమాదమో కూడా జర తెలుసుకోండి..
Beatroot Side Effects
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: May 24, 2023 | 11:33 AM

Beetroot Juice: బీట్‌రూట్ లేదా దాని రసంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్‌రూట్‌లోని పలు రకాల విటమిన్లు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వంటి అనేక అద్భుతమైన పోషకాలే అందుకు ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ఇంకా బీట్‌రూస్ రసం రక్తంపై సానుకూల ప్రభావాలను కలిగి, ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది, అంతేకాక హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతుంది. అయితే పరిమితి దాటితే అమృతం కూడా విషంగా మారినట్లు బీట్‌రూట్ జ్యూస్‌ని ఎక్కువగా తీసుకోవడం కూడా హానికరమే. అవును, బీట్‌రూట్ రసం ఎక్కువగా తాగడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అసలు ఆ దుష్ప్రభావాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. కిడ్నీ రాళ్లు: బీట్‌రూట్‌లో ఆక్సలేట్ పుష్కలంగా ఉన్నందును ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దోహదం చేస్తుంది. అందుకే బీట్‌రూట్ జ్యూస్‌ను మితంగా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కిడ్నీలో రాళ్లు ఉంటే బీట్‌రూట్ రసానికి పూర్తిగా దూరంగా ఉండాలని కూడా హెచ్చరిస్తున్నారు.
  2. అలర్జీ: బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల అనాఫిలాక్సిస్ అనే అలెర్జీకి దారితీస్తుంది. దాని ఫలితంగా మీ శరీరం పూర్తి సున్నితత్వంగా మారడంతో పాటు గొంతు బిగుతు, బ్రోంకోస్పాస్మ్ వంటి ఇతర సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది.
  3. బీటూరియా: బీట్‌రూట్ లేదా ఎరుపు రంగు కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల, ప్రజలు బీటూరియా లక్షణాలను అభివృద్ధి చెందుతాయి. బీట్‌రూట్‌ రసాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రం లేదా మలం ఎర్రగా మారడాన్ని బీటూరియా అంటారు.
  4. కడుపు నొప్పి: బీట్‌రూట్‌లో నైట్రేట్‌లు పుష్కలంగా ఉన్నందున్న వీటిని ఎక్కువగా తీసుకుంటే పొత్తికడుపులో తిమ్మిర్లు వస్తాయి.
  5. ఇవి కూడా చదవండి
  6. గర్భస్థ సమస్యలు: ఎక్కువ నైట్రేట్ తీసుకునే గర్భిణీ స్త్రీలకు శక్తి లోపించడం, తలనొప్పి, కళ్లు తిరగడం, కళ్లు, నోరు, పెదవులు, చేతులు, కాళ్ల చుట్టూ నీలి-బూడిద చర్మం ఏర్పడవచ్చు. కాబట్టి బీట్‌రూట్‌ని మితంగానే తీసుకోండి.
  7. కాలేయానికి హానికరం: బీట్‌రూట్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కాలేయంలో లోహ అయాన్‌లు పేరుకుపోతాయని, వీటికి కాలేయాన్ని దెబ్బతీసే శక్తి ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
  8. కాల్షియం లోపం: బీట్‌రూట్ రసం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం స్థాయిలు తగ్గుతాయి. ఇంకా తక్కువ కాల్షియం స్థాయిలు ఉన్న మహిళలు బీట్‌రూట్ జ్యూస్‌ను ఎక్కువగా తీసుకోకూడదని సిఫార్సు చేయబడింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..