IPL Final 2023: నేడే ఐపీఎల్ ఫైనల్.. ధోని ఖాతాలో మరో ట్రోఫీ పడుతుందా..? లేదా హార్దిక్ చేతుల్లోనే ఉండిపోతుందా..?
IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు రోజుకి చేరుకుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ట్రోఫీ కోసం జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగబోతోంది. సీజన్ తొలి మ్యాచ్ ఆడిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లే...
IPL 2023 Final: ఐపీఎల్ 16వ సీజన్ ముగింపు రోజుకి చేరుకుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ట్రోఫీ కోసం జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగబోతోంది. సీజన్ తొలి మ్యాచ్ ఆడిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లే.. ఈ చివరి మ్యాచ్‌లో కూడా తలపడబోతున్నాయి. విశేషం ఏమిటంటే.. ఈ సీజన్‌లో తొలి, ఆఖరి మ్యాచ్‌లతో పాటు తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో కూడా గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లే బరిలోకి దిగాయి. అయితే ఆ మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించగా.. ఆ ప్రతీకారాన్ని నేటి మ్యాచ్‌లో తీర్చుకోవాలని గుజరాత్ టైటాన్స్ చూస్తోంది. మరోవైపు తొలి క్వాలిఫయర్ విజయం, ఆ తర్వాత సుదీర్ఘ విశ్రాంత సమయం కలిగిన ధోని సేన ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. ఎలా అయినా తన ఖాతాలో మరో ట్రోఫీని వేసుకోవాలని కూడా చెన్నై టీమ్ ఉవ్వీళ్లూరుతోంది.
IPL పిచ్‌పై GT vs CSK
ఐపీఎల్ 16వ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఇది మూడో పోరు. సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. తొలి క్వాలిఫయర్‌లో ధోని సేన 15 పరుగుల తేడాతో గెలిచింది. ఇక నేడు ఐపీఎల్ ట్రోఫీ కోసం ఈ ఇరు జట్ల మధ్య జరిగే మూడో మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి. ఇక క్వాలిఫయర్ 1లో ఓడిన గుజరాత్.. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ ఓడించి ఫైనల్‌కి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఈ ఇరుజట్ల మధ్య పోటాపోటీ రికార్డులు చూసుకుంటే.. ఐపీఎల్ క్రికెట్‌లో చెన్నై, గుజరాత్ జట్లు ఇప్పటివరకు 4 సార్లు తలపడ్డాయి. వీటిలో చెన్నై సూపర్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ 3-1 ఆధిక్యంలో ఉంది.
నేటి ఫైనల్ మ్యాచ్ వేదిక గుజరాత్ టైటాన్స్‌కే లాభదాయకం
ఐపీఎల్ 16వ సీజన్ ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌తో ఉన్న ప్లస్ పాయింట్ ఏమిటంటే.. ఆ జట్టు తమ మైదానంలోనే ఆతిథ్యం ఇస్తున్నందున, వారికి ఆ పిచ్ బాగా తెలుసు. క్వాలిఫయర్ 2లో అహ్మదాబాద్ పిచ్‌లోనే ముంబై ఇండియన్స్‌ను హార్దిక్ సేన ఓడించింది. అలాగే గతేడాది తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా గుజరాత్ విజయం సాధించింది. ఈ ఫలితాలు గుజరాత్ టీమ్‌కి ఉత్సాహాన్ని పెంచుతాయి. కానీ, చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇప్పటికే 9 సార్లు ఐపీఎల్ ఫైనల్ ఆడిన అనుభవం మెండుగా ఉందని గమనించాలి.
అహ్మదాబాద్‌లో వాతావరణం, పిచ్ ఎలా ఉంది..?
గుజరాత్ నరేంద్ర మోదీ స్టేడియం వాతావరణం, పిచ్ విషయానికొస్తే.. ఆకాశం మేఘావృతమై ఉంటుందని అంచనా. అలాగే క్వాలిఫైయర్ 2 సమయంలో పడినట్లుగా వర్షం పడే అవకాశం అయితే చాలా తక్కువ. అదే సమయంలో పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది.
GT vs CSK: డ్రీమ్ 11 ప్రిడిక్షన్
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఈ ప్లేయర్లు కీలకం కానున్నారు.
కీపర్: ఎంఎస్ ధోని, వృద్ధిమాన్ సాహా
బ్యాట్స్‌మెన్: డెవాన్ కాన్వే, రితురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, శుభ్‌మన్ గిల్, డేవిడ్ మిల్లర్
ఆల్‌రౌండర్లు: రవీంద్ర జడేజా, రషీద్ ఖాన్, హార్దిక్ పాండ్యా
బౌలర్లు: మోహిత్ శర్మ, మతిసా పతిరానా, మహమ్మద్ షమీ, దీపక్ చాహర్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..