Team India: వన్డేల్లో టీమిండియా హ్యాట్రిక్ వీరులు.. లిస్టులో నలుగురు బౌలర్లు..

కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఈ బౌలర్లు తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించారు. అదే సమయంలో చాలా మంది బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు కూడా తీశారు. హ్యాట్రిక్ తీయడం అంత తేలికైన విషయం కాదు.

Team India: వన్డేల్లో టీమిండియా హ్యాట్రిక్ వీరులు.. లిస్టులో నలుగురు బౌలర్లు..
Team India
Follow us

|

Updated on: May 27, 2023 | 7:45 PM

Indian Cricket Team: భారత క్రికెట్ జట్టు ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించింది. ఈ సమయంలో, చాలా మంది ఆటగాళ్లు తమ పేరిట అనేక రికార్డులు సృష్టించారు. భారత్ ఎప్పుడూ బ్యాట్స్‌మెన్‌కు కంచుకోటగా పరిగణిస్తుంటారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, మహ్మద్ అజారుద్దీన్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి వెటరన్‌లు ఇక్కడి నుంచే వచ్చారు. అయితే, చాలా మంది వెటరన్ బౌలర్లు కూడా భారత జట్టులో తమ పేరును స్పెషల్‌గా రాసుకొన్నారు.

కపిల్ దేవ్, బిషన్ సింగ్ బేడీ, జహీర్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రా వంటి బౌలర్లు అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు. ఈ బౌలర్లు తమ పేరిట ఎన్నో రికార్డులు సృష్టించారు. అదే సమయంలో చాలా మంది బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు కూడా తీశారు. హ్యాట్రిక్ తీయడం అంత తేలికైన విషయం కాదు. కానీ, ఇప్పటివరకు చాలా మంది భారత బౌలర్లు హ్యాట్రిక్ వికెట్లు తీశారు. ఈ ఎపిసోడ్‌లో వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన నలుగురు భారత బౌలర్ల గురించి తెలుసుకుందాం..

వన్డేల్లో భారత్ తరపున హ్యాట్రిక్ సాధించిన నలుగురు బౌలర్లు..

1. చేతన్ శర్మ: వన్డేల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత ఆటగాడు చేతన్ శర్మ. 1987 ప్రపంచకప్ సందర్భంగా నాగ్‌పూర్‌లో న్యూజిలాండ్‌పై ఈ ఘనత సాధించాడు. హ్యాట్రిక్ సమయంలో కెన్ రూథర్‌ఫోర్డ్, ఇయాన్ స్మిత్, ఎవెన్ చాట్‌ఫీల్డ్‌లను అవుట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

చేతన్ శర్మ తన వన్డే కెరీర్‌లో మొత్తం 65 మ్యాచ్‌లు ఆడి, 67 వికెట్లు పడగొట్టాడు. 22 పరుగులకు 3 వికెట్లు పడగొట్టడం అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

2. కపిల్ దేవ్: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ 1991లో ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై హ్యాట్రిక్ సాధించాడు. రోషన్ మహానామ, రమేష్ రత్నాయకే, సనత్ జయసూర్యలను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ పూర్తి చేశాడు. ఆ సమయంలో వన్డేల్లో హ్యాట్రిక్‌ సాధించిన రెండో భారత బౌలర్‌గా నిలిచాడు.

కపిల్ దేవ్ తన వన్డే కెరీర్‌లో 225 వన్డేలు ఆడి 253 వికెట్లు తీశాడు. 43 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడం అతని అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది.

3. కుల్దీప్ యాదవ్: రెండుసార్లు హ్యాట్రిక్‌ సాధించిన ఏకైక భారత బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌. 2017లో ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియాపై తొలిసారి హ్యాట్రిక్ వికెట్ తీశాడు. వరుసగా 3 బంతుల్లో మాథ్యూ వేడ్, అష్టన్ అగర్, పాట్ కమిన్స్‌లను అవుట్ చేశాడు. ఆ తర్వాత, 18 డిసెంబర్ 2019న విశాఖపట్నంలో వెస్టిండీస్‌పై కుల్దీప్ యాదవ్ హ్యాట్రిక్ వికెట్ తీశాడు. వరుసగా బంతుల్లో షాయ్ హోప్, జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్‌లను అవుట్ చేసి కుల్దీప్ రెండో హ్యాట్రిక్ పూర్తి చేశాడు.

4. మహ్మద్ షమీ: 2019 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై మహ్మద్ షమీ హ్యాట్రిక్ వికెట్ తీశాడు. మహ్మద్ నబీ, అఫ్తాబ్ ఆలం, ముజీబ్ ఉర్ రెహ్మాన్‌లను ఔట్ చేశాడు. అతని అద్భుత ఆటతీరుతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!