AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neuralink: గ్రేట్ న్యూస్.. మనిషి మెదడులో చిప్ పెట్టేలా ప్రయోగాలు చేస్తున్న న్యూరాలింక్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం

ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ అనే స్టార్టప్ సంస్థకు అమెరికాకు చెందిన జౌషధ నియంత్రణ సంస్థ శుభవార్త తెలిపింది. మానవ మెదడులో ఎలక్ట్రానికి చిప్ అమర్చి ఆ సంస్థ చేపట్టే ప్రయోగాల కోసం ఆమోదం తెలిపింది. దీంతో కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకునే బ్రేయిన్ కంప్యూట్రర్ ఇంటర్‌ఫేస్ ప్రయోగాలకు మార్గం సుగమమైంది.

Neuralink: గ్రేట్ న్యూస్.. మనిషి మెదడులో చిప్ పెట్టేలా ప్రయోగాలు చేస్తున్న న్యూరాలింక్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం
Neuralink
Aravind B
|

Updated on: May 27, 2023 | 8:39 PM

Share

ప్రపంచ కుభేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ అనే స్టార్టప్ సంస్థకు అమెరికాకు చెందిన జౌషధ నియంత్రణ సంస్థ శుభవార్త తెలిపింది. మానవ మెదడులో ఎలక్ట్రానికి చిప్ అమర్చి ఆ సంస్థ చేపట్టే ప్రయోగాల కోసం ఆమోదం తెలిపింది. దీంతో కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకునే బ్రేయిన్ కంప్యూట్రర్ ఇంటర్‌ఫేస్ ప్రయోగాలకు మార్గం సుగమమైంది. మానవుల్లో క్లినికల్‌ ప్రయోగాలను చేపట్టేందుకు ఎఫ్‌డీఏ అనుమతి ఇవ్వడం ఆనందంగా ఉందని న్యూరాలింక్ తెలిపింది. త్వరలోనే ఇందుకు సంబంధించి నియామకాలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే క్లినికల్‌ ప్రయోగాలకు అనుమతి రావడంతో న్యూరాలింక్‌కు ఎలాన్‌ మస్క్‌ అభినందనలు తెలిపారు.

మరోవైపు కృత్రిమ మేధ పై టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ గత కొంతకాలంగా తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. అది మానవుల కన్నా తెలివైందని, భవిష్యత్‌లో మానవాళిపై ఆధిపత్యం సాధిస్తుందని చెబుతున్నారు. దాన్ని ఎదుర్కోనేందుకే న్యూరాలింక్‌ ప్రాజెక్టు మొదలుపెట్టామని తెలిపారు. ఏఐని అధిగమించేలా మానవ మేధస్సును, సామర్థ్యాలను పెంచడానికి ఈ ప్రాజెక్టు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇంకో విషయం ఏంటంటే న్యూరాలింక్‌ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో కూడా విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని వెల్లడైనట్లు ఆ సంస్థ నిపుణులు పేర్కొన్నారు. దీని సాయంతో ఒక కోతి ‘పాంగ్‌’ అనే ఓ వీడియో గేమ్‌ను ఆడిన విషయాన్ని తెలిపారు. ఈ క్రమంలోనే మానవుల్లోనూ ప్రయోగాలకు ప్రయత్నించగా.. తాజాగా వాటికి ఆమోదం లభించిందని తెలిపారు.

మరో కీలకమైన విషయం ఏంటంటే మెదడుతో పాటు ఇతర శరీర భాగాల్లోనూ ఈ చిప్‌లను అమర్చడంపై న్యూరాలింక్‌ పరిశోధనలు జరుపుతూనే ఉంది. పక్షవాతం వచ్చినవారిలో దెబ్బతిన్న అవయవాలను కదలించగలిగేలా చేసేందుకు వెన్నుపూసలో అమర్చేలా ఓ చిప్‌ను రూపొందిస్తున్నామని పేర్కొంది. అలాగే చూపు కోల్పోయిన వారికి కూడా సహాయపడేలా మరో పరికరాన్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ రెండింటిలో కూడా తాము కచ్చితంగా విజయం సాధిస్తామని న్యూరాలింక్‌ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..