అయ్యో పాపం.. తండ్రి ఆత్మహత్యను సెల్ ఫోన్ లో వీడియో తీసిన 4 ఏళ్ల కొడుకు.. షాకింగ్ ఘటన

శుక్రవారం వీడియో బయటకు రావడంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కెమెరాను పట్టుకుని వీడియో తీస్తున్న బాలుడు బిగ్గరగా ఏడవ‌డం కూడా అందులో వినిపించింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసులో కీలకంగా మారిన వీడియోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అయ్యో పాపం.. తండ్రి ఆత్మహత్యను సెల్ ఫోన్ లో వీడియో తీసిన 4 ఏళ్ల కొడుకు.. షాకింగ్ ఘటన
Crime
Follow us
Jyothi Gadda

|

Updated on: May 27, 2023 | 3:20 PM

ఏపీలోని కడప జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రి ఆత్మ‌హ‌త్య చేసుకుంటుండ‌గా త‌న నాలుగేళ్ల కొడుకు ఆ ఘ‌ట‌న‌ను మొబైల్ ఫోన్ లో రికార్డు చేసిన షాకింగ్‌ సంఘటన చోటు చేసుకుంది. కడప నగరంలోని చిలకలబావి ప్రాంతంలో జరిగిన ఈ విషాద సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుడి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివ‌రాల ప్రకారం మృతుడు తీవ్ర మనస్థాపంతో బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే తన ఇంటి పైకప్పుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసింది. అయితే, ఈ షాకింగ్ ఘ‌ట‌న‌ను అత‌ని చిన్న కొడుకు మొబైల్ ఫోన్‌లో వీడియో తీశాడు.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..చిలకలబావి ప్రాంతానికి చెందిన షేక్ జమాల్ వలి టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య అరిఫున్ కువైట్‌లో ఉద్యోగం చేస్తోంది. దీంతో అతని ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకుతో క‌లిసి నివసిస్తున్నాడు. గత కొద్ది రోజులుగా జమాల్ తీవ్ర మనస్తాపం, గందరగోళ జీవితాన్ని గడుపుతున్నాడని చెప్పారు. ఒక సంవత్సరం క్రితం అతని తండ్రి మదార్ సాహెబ్ మరణంతో అతడు మరింత నిరాశకు గురైనట్టుగా తెలిసింది. ఈ క్ర‌మంలోనే మనోవేదనతో ఉంటున్న జమాల్‌… తన నాలుగేళ్ల కొడుకును వారి ఇంటి పై అంతస్తుకు తీసుకెళ్లి, అతని ఆత్మ‌హ‌త్య‌ను వీడియో తీయమని కోరాడు. అభం శుభం తెలియని కొడుకు కళ్లముందే..బలవన్మరణానికి పాల్పడ్డాడు. శుక్రవారం వీడియో బయటకు రావడంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. కెమెరాను పట్టుకుని వీడియో తీస్తున్న బాలుడు బిగ్గరగా ఏడవ‌డం కూడా అందులో వినిపించింది.

మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కేసులో కీలకంగా మారిన వీడియోని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్
వి వాంట్ స్టార్ స్టేటస్.. రూటు మార్చిన హీరోయిన్స్